andhra pradesh

కృష్ణాజిల్లాకు పిడుగుల హెచ్చరిక

Submitted by arun on Sat, 06/02/2018 - 15:42

ఆంధ్ర ప్రదేశ్‌కు మరోసారి పిడుగు ముప్పు పొంచి ఉంది. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాట్రాయి, విసన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శ్రీకృష్ణదేవరాయల వారి కోటపై పిడుగు పడింది. పిడుగు ధాటికి....రాజగోపురం పెచ్చులూడిపోయింది. ఎత్తయిన రాజగోపురంపై పిడుగులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే అపురూప కట్టడం పాడవుతోందని పర్యాటకులు విమర్శించారు.

సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కిన యువకుడు

Submitted by arun on Wed, 05/30/2018 - 16:53

ట్రైన్‌‌తో సెల్ఫీ దిగుతూ మరో యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివారులో చోటు చేసుకుంది. పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉండడంతో ట్రైన్ ఎక్కి సాయి అనే యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తగలడంతో సాయికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటినా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 

ఇది మహానాడు చరిత్రలో మరో రికార్డు: మంత్రి లోకేష్

Submitted by arun on Tue, 05/29/2018 - 17:22

బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయని తాను ఎప్పటి నుంచో చెప్తున్నానన్నారు ఏపీ మంత్రి లోకేశ్. బీజేపీని శత్రువని ముందే చెప్పానని తెలిపారు. మహానాడుకు గతేడాది కంటే 33 శాతం ఎక్కువగా వచ్చారన్న ఆయన.. ఇది మహానాడు చరిత్రలోనే మరో రికార్డు అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న భయం.. కార్యకర్తల్లో కనిపిస్తోందని.. మంత్రి లోకేశ్ మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు. పార్టీని రక్షించుకోవాలన్న తపన కార్యకర్తల్లో ఉందని.. నేతల్లో ఉన్న నిరుత్సాహం తొలగిస్తున్నామని చెప్పారు లోకేశ్.

ఇక సీఎం పదవి చాలు, ఇకపై

Submitted by arun on Tue, 05/29/2018 - 15:32

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ... "చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం.చాలామంది కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారని ఒక్క ముక్కలో తేల్చేశారు. రేపటి రోజున లోకేశ్‌ సీఎం అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా?

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం

Submitted by arun on Tue, 05/29/2018 - 11:05

రాజీనామాల విషయంలో.. వైసీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. స్పీకర్ సుమిత్ర మహాజన్‌.. ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారా.. లేదా.. అన్నది నేడు సాయంత్రానికి తేలిపోతుంది. మరి.. వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌పై  ఒత్తిడి తెస్తారా.. సైలెంట్‌గానే ఉంటారా.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జగన్‌, విజయసాయిరెడ్డి..శరణమా? కారాగారమా?

Submitted by arun on Mon, 05/28/2018 - 15:37

తెలుగుదేశం మహానాడులో రెండోరోజు ఓ బుడ్డోడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శాతకర్ణి గెటప్‌‌లో మహానాడుకు వచ్చిన ఈ బుడ్డోడు... బాలయ్య తరహాలో డైలాగ్‌లు పేల్చాడు. శరణమా? రణమా? అంటూ కేంద్రానికి హెచ్చరికలు పంపిన ఈ చిన్నోడు... తమది బడుగు జాతి కాదు తెలుగు జాతి అంటూ పేల్చిన డైలాగ్‌లు... వేదికపై ఉన్నవారందరినీ ఆకట్టుకున్నాయి. ఇక జగన్‌, విజయసాయిరెడ్డి టార్గెట్‌గా పేల్చిన డైలాగ్‌లను వింటూ చంద్రబాబు పడిపడి నవ్వారు. చంద్రబాబు వల్లే అమరావతి అభివృద్ధి సాధ్యమని అంగీకరించి.... జైల్లో విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్‌పై సెటైర్లు పేల్చాడు ఈ బుడ్డోడు. 


 

వైసీపీ ఎంపీల వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకొచ్చింది?

Submitted by arun on Wed, 05/23/2018 - 10:15

కర్ణాటక రాజకీయ పరిణామాల తో వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారం మరో మారు తెర పైకి వచ్చింది. ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎంపీల రాజీనామాలను వెంటనే ఆమోదించిన స్పీకర్... వైసీపీ ఎంపీల రాజీనామాలపై తాత్సారం చేస్తున్నారు. నెల రోజుల తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి  వైసీపీ ఎంపీలకు పిలుపు వచ్చింది. తమ రాజీనామాలపై వైసీపీ ఎంపీలు నిజంగానే సీరియస్ గా ఉన్నారా, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు అనే దానిపై స్పెషల్ స్టోరీ.  

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Submitted by arun on Tue, 04/17/2018 - 11:37

సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పలు కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అలాగే చంద్రబాబు దీక్ష ఏర్పాట్లు చూడటానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీక్షలో పాల్గొనాలని కేబినెట్ పిలుపునిచ్చింది. 

చంద్రబాబు పాకిస్తాన్‌ ఏజెంట్

Submitted by arun on Mon, 04/16/2018 - 11:51

తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్. ప్రత్యేక హోదా అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది. కేంద్రం ఆర్థిక సాయం చేద్దామనుకున్నా ఏపీ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 

ప్రత్యేక హోదా కోసం ఏపీలో బంద్‌

Submitted by arun on Mon, 04/16/2018 - 10:32

ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుతో ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచే బస్టాండ్ల వద్ద విపక్షాలు ధర్నాలు చేపట్టాయి. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోడ్డెక్కిన ఒకటీ అరా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయగా, పాలిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు.