pawan kalyan

పవన్ పెళ్లాలపై వాళ్లే తేల్చుకోవాలి... జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

Submitted by arun on Wed, 07/25/2018 - 17:43

పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ లో ఈ విషయమై ప్రస్తావించగా ఉండవల్లి మాట్లాడుతూ, ‘పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియో నేను చూడలేదు.. పేపర్ లో చూశా. ఇది చాలా తప్పు. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు జగన్‌కు లేదన్నారు. ఢిల్లీలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు ఎందరు పెళ్లాలు అన్నది వారే తేల్చుకోవాలన్నారు. ఐపీసీ చాప్టర్ 28 ప్రకారం మరొకరు కామెంట్ చేయకూడదన్నారు. పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలి తప్ప నీకూ నాకూ సంబంధం లేదని మన చట్టం చెబుతుంది.

పవన్‌ ఫ్లెక్సీలను చింపిన ఆకతాయిలు

Submitted by arun on Wed, 07/25/2018 - 17:11

పశ్చిమగోదావరిలో మరోసారి ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. భీమవరంలో పవన్‌ ఫ్లెక్సీలను ఆకతాయిలు ధ్వంసంచేశారు. పవన్‌ కల్యాణ్‌ బస చేసిన హోటల్‌కి కూతవేటు దూరంలో అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చింపివేశారు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. తమ సహనాన్ని పరీక్షించొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలోనూ భీమవరంలో పవన్ ఫ్లెక్సీలు చింపివేయడంతో కేసులు నమోదయ్యాయి. పవన్‌ భీమవరం పర్యటనలో ఉండగానే ఇప్పుడు మరోసారి ఫ్లెక్సీలను ధ్వంసంచేయడంపై అభిమానులు ఫైరవుతున్నారు. 

జగన్‌ వ్యాఖ్యలకు పవన్‌కల్యాణ్‌ కౌంటర్‌...

Submitted by arun on Wed, 07/25/2018 - 16:11

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం నాడు ఆయన  పశ్చిమగోదావరిజిల్లాలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం నాడు వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగాడు. ఈ విమర్శలకు  పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు. బలమైన  వ్యక్తిని కాబట్టే  జగన్  తనపై వ్యక్తిగత విమర్శలు  చేస్తున్నారని పవన్ కళ్యాణ్  తిప్పికొట్టారు.సమాజంలో మార్పు కోసం  తాను  రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

పంచ్ పడింది...పవన్ తాజా వ్యాఖ్యలపై దుమారం

Submitted by arun on Wed, 07/25/2018 - 12:59

రాజకీయ నాయకుడికి అందులోనూ, ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్న నాయకుడికి సమాజం పట్ల, చట్ట సభల పట్ల కనీస పరిజ్ఞానం అవసరం వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగాలను కుంటున్న పవన్ కల్యాణ్ అత్యుత్సాహంలో గతి తప్పి మాట్లాడు తున్నారా? ప్రస్తుత రాజకీయాలకు తగిన విధంగా మాట్లాడటంలో పవన్ పరిణతిని కనపరచలేకపోతున్నారా? తాజాగా పవన్ కామెంట్లపై రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విజయవాడలో మాట్లాడిన మాటలు ఆలోచించి మాట్లాడినట్లుగా లేవనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  

కాలు బెణికినా యాత్రకు సిద్ధమంటున్న పవన్‌

Submitted by arun on Wed, 07/25/2018 - 10:39

కాలు బెణికినా... ప్రజాపోరాట యాత్ర కొనసాగించాలని జనసేన అధినేత పవన్‌ నిర్ణయించారు. భీమవరంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మూడు వారాలు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. అయితే, ఇవాళ ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని రేపటి నుంచి ప్రజాపోరాట యాత్ర కొనసాగించేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. బస చేసిన ఫంక్షన్‌ హాల్లోనే ఇవాళ విద్యార్థులు, దేవాలయ ధర్మాదాయ శాఖ సిబ్బందితో పవన్‌ ముఖా ముఖి నిర్వహించనున్నారు.
 

పవన్‌‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్‌...పవన్‌కి నలుగురు భార్యలు

Submitted by arun on Wed, 07/25/2018 - 10:20

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పవన్‌‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోయారన్న పవన్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రియాక్టయిన వైసీపీ అధినేత కార్లు మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తారంటూ జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లకో ఐదేళ్లకో పెళ్లాలను మార్చేసే పవన్‌ గురించి మాట్లాడుకోవడం మన ఖర్మ అన్నారు. పవన్ కల్యాణ్‌‌లా మరొకరు ఇలా పెళ్లిళ్లు చేసుకొని ఉండుంటే... నిత్య పెళ్లికొడుకు అంటూ బొక్కలో వేసేవారన్నారు.

వైసీపీ బంద్‌...పవన్‌ యాత్రకు బ్రేక్‌

Submitted by arun on Tue, 07/24/2018 - 10:20

జనసేన అధినేత పవన్‌ పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. వైసీపీ బంద్‌ నేపథ్యంలో ప్రజా పోరాట యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌... భీమవరంలో ప్రజాసంఘాలతో సమావేశం కానున్నారు. మరోవైపు తుందుర్రులో ఆక్వాపార్క్‌ బాధితులను పరామర్శించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా పవన్‌ యాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

చంద్రబాబుపై పవన్‌ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు‌...రాజ్యసభ సీటు ఇస్తానని...

Submitted by arun on Mon, 07/23/2018 - 11:57

చంద్రబాబునాయుడు పెద్ద మోసగాడంటూ జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీతో కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టిన పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు తనను ఘోరంగా మోసం చేశారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ పెట్టి తర్వాత మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో పొత్తుపై తేల్చేసిన జనసేనాని!

Submitted by arun on Sat, 07/21/2018 - 13:47

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని గట్టిగా బదులిచ్చారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు వచ్చే లాభమేంటని జనసేనాని ప్రశ్నించారు? ప్యాకేజీకి ఒప్పుకొని మళ్లీ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్విట్టర్ లోనే కౌంటర్ ఎటాక్ చేశారు .

అవిశ్వాసం పెడితే.. పార్టీల మద్ధతు కూడగడతా అన్న పవన్ ఎక్కడ..?

Submitted by arun on Sat, 07/21/2018 - 11:43

ఒకరు పోరాడారు మరొకరు పోరాటంలో లేకుండా పోయారు. ప్రత్యేక హోదాయే లక్ష్యంగా సాగిన రాజకీయాల్లో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల పోరాటం ముగిసినట్లేనా..? నాలుగేళ్లు కలిసి కాపురం చేశాక ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంటూ ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ పట్ల కేంద్రం వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టింది. ఇటు ప్రతిపక్ష వైసీపీ మాత్రం రాజీనామాలు చేస్తామని చెప్పి చేసి చూపించింది. ఇక్కడితో కేంద్రంపై ఈ రెండు పార్టీల పోరాటం ముగిసినట్లే అని భావిస్తున్నారు.