Sushma Swaraj

కేంద్రమంత్రి సుష్మా స్వ‌రాజ్‌ సంచలన నిర్ణయం..

Submitted by chandram on Tue, 11/20/2018 - 15:22

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధానంగా తన ఆరోగ్యసమస్యల దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మా తెలిపింది. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో అనే అంశాన్ని ఇక పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయలేను అని పార్టీకి కూడా వెల్లడించనని సుష్మా తెలిపారు. 

పాస్‌పోర్ట్‌ ఇక మరింత సులభం

Submitted by arun on Tue, 06/26/2018 - 17:07

పాస్‌‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ‘పాస్‌పోర్టు సేవా దివస్’ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ ‘పాస్‌పోర్ట్ సేవా’ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాజా యాప్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ దరఖాస్తును దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చని, మొబైల్‌ ఫోన్ల నుంచే పాస్‌పోర్ట్‌ దరఖాస్తును నింపవచ్చని చెప్పారు. నూతన పథకాల ద్వారా పాస్‌పోర్ట్‌ విప్లవం చోటుచేసుకుందని మంత్రి అభివర్ణించారు.

ఆ 39 మంది భారతీయులు చనిపోయారు

Submitted by arun on Tue, 03/20/2018 - 12:27

ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్‌ ఘటన విషాదాంతమైంది. నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న ఆ 39 మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 2014లో ఇరాక్‌లో కిడ్నాప్ అయిన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వారందరినీ  ఐఎస్ ఉగ్రవాదులు  పొట్టనపెట్టుకున్నారని సుష్మ ప్రకటించారు.
 

పాక్ జ‌ట్టుతో క్రికెట్ ఆడ‌డం కుద‌ర‌దు : సుష్మా

Submitted by arun on Mon, 01/01/2018 - 16:52

పాక్ - భార‌త్ క్రికెట్ మ్యాచ్ లు ఇప్ప‌ట్లో జ‌రిగే దాఖ‌లాలు ఏం క‌నిపించేలా లేవు. స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో దేశం త‌రుపున పాక్ లో  క్రికెట్ ఆడ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. అయితే నువ్వా నేనా అని త‌ల‌ప‌డే భార‌త్ - పాక్ ల మ‌ధ్య పూర్తిస్థాయి సిరీస్ 2007లో జ‌రిగింది. ఆ త‌రువాత డిసెంబ‌ర్ 2012లో పాక్ జ‌ట్టు భార‌త్ కు వ‌చ్చి ఆడింది. అయితే ఇరు దేశాల‌మ‌ధ్య మ్యాచ్ లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ అభిమానులు భావించారు. ఇటీవ‌ల‌ కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబంతో పాటు కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్‌తో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

కాంగ్రెస్ ఎంపీని బ్లాక్ చేసిన సుష్మా స్వ‌రాజ్‌!

Submitted by arun on Fri, 12/29/2017 - 16:33

ఇరాక్‌లో త‌ప్పిపోయిన 39 మంది భార‌తీయుల గురించి మాటిమాటికి అడుగుతున్న కార‌ణంగా ట్విట్ట‌ర్‌లో కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తాప్ సింగ్ బ‌జ్వా ఖాతాను, విదేశాంగ‌మంత్రి సుష్మా స్వ‌రాజ్ బ్లాక్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ప్ర‌తాప్ సింగ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.‘‘విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను నడపవలసిన తీరు ఇదేనా? 39 మంది భారతీయులు ఇరాక్‌లో అదృశ్యమవడంపై ప్రశ్నించినందుకు బ్లాక్ చేయడం సుష్మా స్వరాజ్ గారి పని తీరును తెలియజేస్తోందా?’’ అని సింగ్ ట్వీట్ చేశారు.

పాక్ అవమానంపై కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్..

Submitted by arun on Thu, 12/28/2017 - 12:35

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ ప్రవర్తించిన తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యసభలో సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తూ పాక్ అవమానంపై కంటతడి పెట్టారు. భద్రత పేరుతో కుల్‌భూషణ్ తల్లి, భార్య ధరించిన దుస్తులను బలవంతంగా మార్పించడం, మంగళసూత్రాలు తీయించడం హేయమైన చర్య అని చెప్పారు. వితంతువులుగా వారిని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. షూలో కెమెరా లేదా రికార్డింగ్ పరికరం ఉందని పాక్ వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించిదని తెలిపారు.