Subsidy Sheeps

సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న పథకం లోపాలు

Submitted by arun on Thu, 12/28/2017 - 16:43

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం నీరుగారుతోంది. పథకం అమలులో లోపాలు సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులు ఎంతకాలం తరువాత అమ్ముకోవచ్చన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో దానిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అధికారుల నుంచి గొర్రెలను అందుకున్న కొద్ది రోజులకే విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు అధికారులు కూడా తమవంతు సాయం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు తగినన్ని గొర్రెల దొరక్కపోవడంతో అధికారులు కూడా కొనుగోళ్లు చేస్తూ..తిరిగి వాటినే పంపిణీ చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌లో సబ్సిడీ గొర్రెలు

Submitted by arun on Thu, 12/28/2017 - 12:29

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం అమలులో లోపాలు సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. నిబంధనల్లో లొసుగుల ఆధారంగా దళారులు రీసైక్లింగ్ దందాకు తెర తీశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 350కి పైగా రాయితీ గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు. మూడు రోజులుగా స్టేషన్ లోనే ఉంటున్న ఈ గొర్రెలు ఆకలితో అలమటిస్తున్నాయి.