East Godavari

‘ఆర్‌ఎక్స్‌ 100’ నా జీవితాన్నేమార్చేసింది

Submitted by chandram on Mon, 11/12/2018 - 13:06

"ఆర్ఎక్స్ 100" మూవీతో నాకంటూ ఒక ప్రత్యేకగుర్తింపును తీసుకొచ్చిందని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలిపారు. అమలాపురంలో దుర్గాస్‌ స్పైసీ ట్రీట్‌ రెస్టారెంట్‌’పాయల్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాయల్ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తున్నయని, అలాగే హీరో రవితేజ నటించే చిత్రంతో పాటు ఇంకో చిత్రంలో కూడా నటిస్తున్నానని వెల్లడించారు. తన హింది టీవీ సిరియల్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిగా గుర్తింపుతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని పాయల్ రాజ్ పుత్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో వ్యాపారులకు కలిసి రాని దీపావళి

Submitted by arun on Wed, 11/07/2018 - 17:43

తూర్పు గోదావరి జిల్లా బాణసంచా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి కలిసి రాలేదు. సుప్రీం తీర్పుతో పాటు స్ధానిక పోలీసుల ఆంక్షలు , పరిమిత సమయంలో అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో లక్షలాది రూపాయల సరుకు వ్యాపారుల దగ్గరే ఉండిపోయింది. దీంతో తప్పని సరి పరిస్ధితుల్లో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఏటా తమ వ్యాపారానికి  వరుణుడు అడ్డొస్తే ఇప్పుడు మాత్రం పోలీసుల నిబంధనలు శాపంగా మారాయంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాణ సంచా విక్రయాలకు ఒక్క రోజే అనుమతి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనులతో పవన్ కల్యాణ్‌ సమావేశం

Submitted by arun on Sun, 11/04/2018 - 16:59

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ లాటరైట్‌ మైనింగ్‌ ప్రాంతంలో జనసేనాని పర్యటించారు. సముద్ర మట్టానికి 860 అడుగుల ఎత్తులో ఉండే వంతాడ గ్రామానికి భారీ భద్రత మధ్య చేరుకున్న పవన్ కల్యాణ్‌ గిరిజనులతో సమావేశమై లాటరైట్‌ మైనింగ్‌‌ పరిస్థితులను పరిశీలించారు. పవన్ కల్యాణ్‌ అధికారిక ఫేస్‌ బుక్‌ పేజ్‌ నుంచి లైవ్‌లో మాట్లాడిన జనసేనాని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మైనింగ్‌ జరుగుతుంటే గిరిజనులకు, స్థానికులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సహజ సంపదను దోచుకుంటుంటే కళ్లప్పగించి చూస్తారా? ఇదేనా రియల్ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే అంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

యువ సేన నయా దీక్ష

Submitted by arun on Wed, 10/24/2018 - 10:42

దేవుళ్ళ పేరుతో మాలలు వేసుకోవడం దీక్షలు చేయడం మనకు మామూలే. కానీ దేవుళ్ళ కోసం కాకుండా ఓ లక్ష్యం కోసం సమస్యల పరిష్కారం కోసం మాలలు వేయడం దీక్షలు చేయడం ఎక్కడైనా చూశారా. లేదు కదూ అయితే మనం తప్పకుండా కడియంలో జరుగుతున్న నయా దీక్షను చూడాల్సిందే. కొత్తగా సేనాని దీక్ష. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఇప్పుడు ఇది న్యూ ట్రెండ్. వీరంతా దేవుళ్ళ భక్తులు కారు. దేవుడి కోసం దీక్ష చేపట్ట లేదు. వీరంతా జన సైనికులు. పవన్ కల్యాణ్ అభిమానులు 9 మంది ఇలా ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో మాల ధరించి దీక్షలు చేపట్టారు. నిష్టగా ఉంటూ చెప్పులు కూడా వేసుకోకుండా ఊరూరా తిరుగుతున్నారు.

వరద నీటిలో కొట్టుకొచ్చి... ఓ ఇంట్లోకి దూరిన పాము

Submitted by arun on Wed, 08/22/2018 - 10:37

ఒకవైపు వరద నీటిలో మగ్గుతుంటే మరోవైపు ఆ వరద నీటిలో కొట్టుకొస్తున్న విష సర్పాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకొచ్చి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న విష సర్పాలతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పలువురు బలైపోయారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగుపాము బుసలు కొడుతూ ఇంట్లోని వారందరినీ భయపెట్టింది. విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గుతోన్న జనాన్ని నాగుపాము బెంబేలెత్తించింది. మూడు గంటలపాటు ఇంట్లోనే తిష్టవేయడంతో ఆ ఇంటి వాసులకు చుక్కలు కనిపించాయి. చివరికి స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించాడు. 

సెన్సేషనల్ కామెంట్లతో వేడి పెంచిన జగన్

Submitted by arun on Tue, 08/07/2018 - 14:24

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  ఎక్కువ రోజులు గోదావరి జిల్లాలోనే పాదయాత్ర సాగించిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసి ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. నెరవేర్చగలిగిన వాగ్దానాలనే ఇస్తూ, తన విశ్వసనీయతను మరోసారి నిలబెట్టుకునే దిశగా వైసిపి అధినేత అడుగులు వేస్తున్నారా? పార్టీని అధికారంలోకి తెచ్చే జిల్లాలో జగన్ టూర్ వాడి, వేడిగా సాగింది. బుధవారం ముగియనున్న జగన్ తూర్పు గోదావరి పర్యటనపై ఓ రౌండ్ అప్..

పవన్ వ్యూహంపై విశ్లేషకుల్లో నెలకొన్న ఆసక్తి

Submitted by arun on Sat, 07/14/2018 - 11:00

ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి ప్రజల్లో జోష్ నింపిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో రెస్ట్‌లో ఉన్న పవన్ ఈ నెల 22 నుంచి తన యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజకీయ పోరాట యాత్రను తిరిగి ప్రారంభించపోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో యాత్రను పూర్తి చేసిన పవన్ నెక్ట్ గోదావరి జిల్లాల్లో యాత్ర కొనసాగించనున్నారు. 

ఆ స్కూల్లో ఒక్కడే స్టూడెంట్

Submitted by arun on Sat, 07/07/2018 - 12:02

కార్పొరేట్ కాన్వెంట్‌ల దెబ్బకు సర్కారి బడులు చిన్నబోతున్నాయి. ఏటికేడు తగ్గుతున్న విద్యార్ధులతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ‌్నార్ధకంగా మారుతోంది. పలు చోట్ల విద్యార్ధుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. పశ్చిమ గోదావరి జల్లాలో ఒక్క విద్యార్ధి కోసం పాఠశాలను నడుపుతున్నారు. 

ఏపీలో ఎండాకాలం సెలవులు

Submitted by arun on Tue, 06/19/2018 - 12:27

తూర్పు గోదావరి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు.వానాకాలంలో మండు వేసవి ని తలపించే వాతావరణం చుక్కలు చూపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో సర్కార్ స్కూళ్లకు మూడురోజులు సెలవులు ప్రకటించింది.  మంగళవారం నుంచి 21వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకూ మినహాయింపు లేదు. తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దుచేస్తాం’ అని హెచ్చరించారు.