kajal agarwal

ప్రేమలో పడిన కాజల్ అగర్వాల్.. ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు..!

Submitted by arun on Mon, 04/02/2018 - 16:28

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది! అయితే వ్యక్తి ప్రేమలో మాత్రం కాదండోయ్.. తాను ఆత్మీయంగా పెంచుకునే గుర్రం(ఖలీసి) తో ప్రేమలో పడింది. అవును.. ఈ విషయాన్ని కాజలే స్వయంగా ప్రకటించింది.‘ఖలీసి’ అనే గుర్రం అంటే తనకు చాలా ఇష్టమని అగ్ర కథానాయిక కాజల్‌ తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్రంతో ఆప్యాయంగా దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘రోజు ముగిసే సరికి కాళ్లకు మురికి అంటుకుంటుంది. శిరోజాలు పాడైపోతాయి. కానీ కళ్లల్లోని మెరుపు అలానే ఉంటుంది.. ఖలీసి (గుర్రం)తో  ప్రేమలో ఉన్నా’ అని ఆమె పోస్ట్‌ చేశారు. గుర్రం కళ్లను ఈగల నుంచి రక్షించేందుకు దానికి మాస్క్‌ వేశారు.

కాజల్ కు ఎక్కువ సంతృప్తినిచ్చేదేంటో తెలుసా?

Submitted by lakshman on Sat, 03/03/2018 - 20:03

12 ఏళ్లుగా సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయమేం కాదు. అలాంటి ఫీట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్. ఇప్పుడు కూడా.. కాజల్ హవా కొనసాగుతోందంటే.. ఆమెకున్న టాలెంటే కారణం. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో ఎమ్ ఎల్ ఏ సినిమా చేస్తున్న కాజల్.. ఇదే విషయంపై స్పందించింది. ఇన్నేళ్ల అనుభవంలో ఎక్కువగా సంతృప్తిని ఇచ్చిన విషయాలు ఏంటి అని అడగ్గానే.. ఇదిగో ఇవీ అంటూ జవాబిచ్చింది.

5 రోజులు.. 20 మిలియ‌న్లు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 15:48

త‌మిళ‌నాట క‌థానాయ‌కుడు విజ‌య్ కుండే క్రేజే వేరు. మాస్‌లో విజ‌య్‌కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఆయ‌న కొత్త చిత్రం టీజ‌ర్ మరోసారి రుజువు చేసింది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' (తెలుగులో 'అదిరింది') టీజ‌ర్‌ని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేశారు. 20 గంట‌ల్లోపే ఈ సినిమా టీజ‌ర్ 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. మ‌రో నాలుగు రోజుల్లో ఇంకో 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని.. మొత్తంగా 5 రోజుల్లో 20 మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది.

కాజ‌ల్ 'పారిస్ పారిస్‌'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 13:55

కాజ‌ల్‌కి ఈ ఏడాది బాగా క‌లిసొచ్చింది. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల రూపంలో తెలుగునాట మంచి విజ‌యాలు ద‌క్కాయి. మ‌రోవైపు ఆమె న‌టించిన భారీ బ‌డ్జెట్ త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' విడుద‌ల‌కి సిద్ధమైంది. తెలుగులో 'అదిరింది' పేరుతో రానున్న ఈ చిత్రంలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేశారు. ఈ సినిమా విజ‌యంపై కాజ‌ల్ పూర్తి న‌మ్మ‌కంతో ఉంది.

రికార్డు కొట్టిన 'మెర్స‌ల్‌'

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 13:34

త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి 'రాజా రాణి' ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో విడుద‌ల కానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. 

'అదిరింది' ఆ సినిమాకి న్యూ వెర్ష‌నా?

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 18:54

విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో 'రాజా రాణి' ఫేమ్ అట్లీ రూపొందించిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. స‌మంత‌, కాజ‌ల్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఇవాళ ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్‌ విడుద‌ల‌య్యింది. మూడు పాత్ర‌ల్లో విజ‌య్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ట్రైల‌ర్ చూసిన వాళ్లంతా ఒక‌టే మాట అంటున్నారు.

రేపు 'మెర్స‌ల్' టీజ‌ర్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 12:05

'తెరి' (తెలుగులో 'పోలీస్‌') వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు విజ‌య్‌, క‌థానాయిక స‌మంత‌, ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్ వ‌స్తున్న చిత్రం 'మెర్స‌ల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో స‌మంత‌తో పాటు కాజ‌ల్‌, నిత్యా మీన‌న్ కూడా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ర‌వితేజ‌తో మ‌రోసారి?

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 17:04

ఇక కాజ‌ల్ ప‌ని అయిపోంద‌నుకుంటున్న టైంలో.. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంది అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్‌.  ప్ర‌స్తుతం.. తెలుగులో త‌న తొలి క‌థానాయ‌కుడైన క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి 'ఎమ్మెల్యే' చిత్రంలో న‌టిస్తోందీ అమ్మ‌డు. అలాగే త‌మిళంలో 'క్వీన్' రీమేక్ లోనూ న‌టిస్తోంది.

స‌మంతకి ఒక్కో సినిమా ఒక్కోలా

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 16:29

తెలుగులోనే కాదు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది చెన్నై చిన్న‌ది స‌మంత‌. ఇక్క‌డలాగే త‌మిళంలోనూ స్టార్ హీరోల‌తో ఆడిపాడిందీ ముద్దుగుమ్మ‌. ఇక‌ త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి న‌టిస్తోంది స‌మంత‌. 'మెర్స‌ల్' పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఇదివ‌ర‌కు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'క‌త్తి', 'తెరి' చిత్రాలు వ‌చ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజ‌యాన్నే న‌మోదు చేసుకున్నాయి.

రేషన్‌కార్డులో కాజల్‌ ఫోటో 

Submitted by nanireddy on Wed, 09/13/2017 - 17:30

స్మార్ట్‌ రేషన్‌కార్డులో కుటుంబ యాజమాని ఫోటో స్థానంలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఫోటో వచ్చింది.  ఈ సంఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. ఎన్నికల కమిషన్‌ సం‍స్థ అచ్చువేసి ఇచ్చే రేషన్‌కార్డులో పురుషుల పేరు స్థానంలో మహిళల పేరు, ఫోటోలు మార్పులు గతంలో అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. ఈ తప్పిదాలను తొలగించటానికి ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటూ వస్తుంది.