Tihar Jail

తీహార్ జైలు అంటే!

Submitted by arun on Sat, 10/27/2018 - 16:03

తీహార్ జైలు అంటే.. చాలామంది విని వుంటారు.. కానీ తీహార్ జైలు ఎక్కడ వుందో మీకు తెలుసా! ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊసలు లెక్కబెట్టారని ప్రసిద్ధి.  తీహార్ (ఢిల్లీ) భారత రాజధాని ఢిల్లీ లో ఉన్న చాణక్యపురి నుంచి  ఏడు కిలో మీటర్ల దూరంలోనే తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటారు. తీహార్ జైలు, భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్న మించే ఉంటున్నారట..కలి కాలం అంటే ఇదేనేమో. శ్రీ.కో.

Tags

చోటా రాజన్‌ను చంపేందుకు దావూద్‌ కుట్ర

Submitted by arun on Wed, 12/27/2017 - 15:26

ముంబయి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం.. సహచరుడు చోటా రాజన్‌ను తిహార్‌ జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం. దాంతో తిహార్‌ జైలులో భద్రత పెంచాల్సిందిగా జైలు అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఢిల్లీలో టాప్ గ్యాంగ్ స్టర్ అయిన నీరజ్ భావన సహచరుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నీరజ్‌కు అనుబంధం ఉన్న అతను కూడా ఓ చిన్నపాటి ముఠా నాయకుడే. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు. అతన్ని విచారించిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. తాగిన మైకంలో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాలను పోలీసులు గుర్తించారు.