fire

స్కూల్ వ్యాన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Submitted by arun on Wed, 07/18/2018 - 14:33

నిర్మల్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్‌ పిల్లలను తీసుకెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ పిల్లను కిందకు దించేయడంతో ప్రాణహాని తప్పింది. ప్రమాదం సమయంలో ఆటోలో ముప్పై మంది విద్యార్థులున్నారు. అక్కాపూర్‌ నుంచి స్కూల్‌ పిల్లలతో వస్తున్న ఆటో నిర్మల్‌ ఎస్పీ కార్యాలయం వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే మంటలను ఆర్పివేశారు. 

నిప్పు లేకుండానే మంటలు...దయ్యమే కారణమంటున్న గ్రామస్తులు

Submitted by arun on Thu, 07/05/2018 - 15:55

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చండ్రాయని పల్లి  గ్రామంలో నిప్పు లేకపోయినా మంటలు చెలరేగుతున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో  ఉదయం, సాయంత్రం ఉన్నట్టుండి మంటలు రేగుతున్నాయి. మూడు నెలులగా ఇంట్లోని సర్వస్వం బూడిద అవుతున్న ఈ మంటలు ఆగడం లేదు. వీటి బారినుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక పిల్లాపెద్దలు నిత్యం జాగారం చేస్తున్నారు.

కొమురంభీమ్‌ జిల్లాలో దారుణం..మహిళకు నిప్పంటించిన ప్రత్యర్ధులు

Submitted by arun on Wed, 01/31/2018 - 17:41

కొమురంభీమ్‌ జిల్లాలో దారుణం జరిగింది. బెజ్జారు మండలం మర్దడిలో మహిళకు ప్రత్యర్ధులు నిప్పంటించారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

అగ్ని పునీతం...భగభగ మండే అగ్ని కీలలను దాటుతున్న పశువులు

Submitted by arun on Mon, 01/15/2018 - 17:06

భగభగ మండే మంటలు, ఆకాశన్నంటే అగ్ని కీలలు. రాజేసిన ఎండు గడ్డి నుంచి ఎగిసి పడుతున్న నిప్పు రవ్వలు. నిప్పుల మధ్యలోకి దూకి.. సురక్షితంగా పశువులు బయటకి వస్తుంటే.. ఇలాంటిది కూడా జల్లికట్టు వంటి ఆచారమే.  కొన్ని పండగల్లో, మరికొన్ని జాతరల్లో.. నిప్పుల్లో నడవడం మనకు తెలిసిందే. నిప్పులో నడిచి వస్తే మంచి జరుగుతుందని అంటారు. మరి పశువుల్ని కూడా నిప్పుల్లో నడిపించే సంప్రదాయం ఎక్కడుందో తెలుసా? 

హోంమంత్రి కాన్వాయ్‌లో మంటలు

Submitted by arun on Fri, 01/05/2018 - 12:59

హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్‌లోని జీపులో మంటలు చెలరేగాయి. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు మంత్రి బయలదేరారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని జీపులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కిందకు దిగారు. జీపు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికీ ఎలాంటి అపాయం జరుగకపోవడంతో చినరాజప్పతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆకవరపాలెం సర్పానది వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు.

విషాదం..ఆడుకుంటున్న చిన్నారులకు అంటుకున్న నిప్పు

Submitted by arun on Thu, 12/28/2017 - 13:48

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. చొప్పదండి మండలం వెదురుగుట్టలో పొరపాటున ముగ్గురు చిన్నారులకు నిప్పు అంటుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఐదేళ్ల చిన్నారులు అగ్గిపెట్టేతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ నిప్పు రవ్వలు పక్కనున్న కిరోసిన్‌పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో చిన్నారులు భయంతో అరుపులు కేకలు వేశారు.

మతిస్థిమితం లేని వ్యక్తిని మంటల్లోకి నెట్టిన భూతవైద్యుడు

Submitted by arun on Wed, 12/27/2017 - 14:13

నిజామాబాద్ జిల్లా నిజాం కాలనీలో దారుణం జరిగింది. ఓ భూత వైద్యుడు చేసిన నిర్వాకం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చాడు. మతి స్థిమితం లేని వ్యక్తి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన భూతవైద్యుడు అతన్ని మంటల్లోకి నెట్టాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. భూతవైద్యుడిపై బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.