shalini pandey

‘అర్జున్ రెడ్డి’ షూటింగ్‌లో నరకం అనుభవించా!

Submitted by arun on Tue, 05/29/2018 - 11:34

తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల ఒకవిధంగా తనెంతో నరకయాతన అనుభవించానని ఈ మూవీ హీరోయిన్ షాలినీ పాండే తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను పడిన నరకయాతన చెప్పలేను. గతంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సార్లు ప్రేమలో పడి విఫలమయ్యా. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో ప్రేమ వైఫల్యంలో ఉన్న తాను హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా… లవ్‌లో ఫెయిల్ అయిన నేను హీరోతో రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. అప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం..అని శాలిని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది.

పొంగలి వండిన షాలినీపాండే

Submitted by arun on Sun, 01/14/2018 - 13:55

కేవ‌లం ఒక్క సినిమాతో యావ‌త్ టాలీవుడ్‌నే త‌న‌వైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. తమిళంలో రూపొందుతున్న ‘100% లవ్‌’ రీమేక్‌ ‘100% కాదల్‌’ సెట్స్‌లో శనివారం సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలినీపాండే పట్టుచీరలో మెరిసిపోతూ, పొంగళ్లు వండుతూ సందడి చేసింది. హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌, బామ్మ పాత్రలో నటిస్తున్న సీనియర్‌ నటీమణి జయచిత్ర తదితరులు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

ఆస్పత్రిలో చేరిన ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్

Submitted by lakshman on Wed, 09/13/2017 - 16:33
ఒక్క సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పేరు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో వినిపించింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని షాలిని భావించినట్టుంది. షోరూం ఓపెనింగ్స్‌తో...