YSR Congress Party

కాంగ్రెస్‌కు పట్టిన గతే వైసీపీకి పడుతుంది : మంత్రి కొల్లు రవీంద్ర

Submitted by arun on Thu, 05/31/2018 - 13:07

కాంగ్రెస్‌కి పట్టిన గతే.. వైసీపీకి పడుతుందని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నాడని ఆయన మండిపడ్డారు..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందన్న కొల్లు రవీంద్ర.. సోంపేట, గంగవరం పోర్టు లో మత్స్యకారులపై జరిపిన కాల్పులను ఇంకా వారు మర్చిపోలేదన్నారు.. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలుగా ఆదుకుందని ఆయన పేర్కొన్నారు.

జగన్ సంచలన ప్రకటన

Submitted by arun on Thu, 05/31/2018 - 11:45

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర లో జగన్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి 10 వేల చొప్పున పింఛన్లు ఇస్తామంటూ హామీలు గుప్పించారు. అంతేకాదు ఉచితంగా ఆపరేషన్ చేయించడమేకాకుండా, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న సమయంలో పేషెంట్‌కి ఉచితంగా డబ్బులు ఇస్తామని తెలిపారు.

వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత

Submitted by arun on Thu, 04/26/2018 - 12:34

విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి గుడ్ బై చెప్పి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్వతీపురంలో ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా శత్రుచర్లకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు. శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరరాజు ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మామయ్య.

ఒక ఫోన్ కాల్... ఒకే ఒక్క ఫోన్ కాల్..జగన్‌కు ఝలక్ ఇచ్చింది

Submitted by arun on Thu, 04/26/2018 - 11:53

రాజకీయాల్లో హత్యలుండవ్.. అన్నీ ఆత్మహత్యలే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. అవకాశం కోసం ఎదురుచూసిన చాలామంది.. అరటితొక్క మీద కాలేసిన సందర్భాలు కోకొల్లలు. గోడ దూకేందుకు ముహూర్తాలు పెట్టుకున్న కొందరు.. అటూ ఇటూ కాకుండా.. గోడ మీద పిల్లుల్లా కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి అనుభవించిన వారూ ఉన్నారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కథ కూడా వీటికే విరుద్దం కాదని తేలిపోయింది. 

వైసీపీలోకి భారీగా వలసలు

Submitted by arun on Tue, 04/24/2018 - 12:21

వైసీపీ లో చేరికల ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకున్నాయి. సామాజిక వర్గాల వారిగా పేరున్న నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఎన్నికల సమయానికి పార్టీని‌బలోపేతం చేసుకోవాలని వైసీపి భావిస్తోంది. రానున్న రోజుల్లో బలమైన నాయకులకు రెడ్ కార్పెట్ పరచాలని వైసీపీ డిసైడైంది.

‘వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదు?’

Submitted by arun on Wed, 04/11/2018 - 15:12

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి ఇతర పార్టీల మద్దతును వైసీపీ ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పూలే జయంతిని నిర్వహించే హక్కు లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీల చైతన్య యాత్రల తర్వాత బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకుందని విమర్శించారు. 

వైసీపీ ఎత్తులపై లాజిక్ లేవనెత్తిన బాబు

Submitted by arun on Mon, 03/12/2018 - 13:24

కేంద్రం నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో చెప్పలేకుండా ఉంది. కానీ.. ఇదే సందర్భంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయం మాత్రం మహా రంజుగా కొనసాగుతోంది. కేంద్రంపై అవిశ్వాసం ఉందంటూనే.. అదే కేంద్రంపై పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామని చెబుతున్న వైసీపీ.. ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ గా మారింది.

లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు

Submitted by arun on Wed, 03/07/2018 - 12:20

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిందని వైసీపీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే...ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో తమ ఆందోళన కొనసాగుతుందంటున్నారు వైసీపీ ఎంపీలు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.

ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల అరెస్టు

Submitted by arun on Mon, 03/05/2018 - 14:26

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

విజ‌య్ సాయిరెడ్డిపై దండెత్తిన ఐఏఎస్ లు

Submitted by arun on Wed, 02/21/2018 - 12:30

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్రపై విజయసాయి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడింది. ఇటీవల విజసాయి రెడ్డి సతీష్ చంద్రపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది అధికారులకు రాజకీయాలు అంటకట్టవద్దని హితవు పలికిన ఐఏఎస్ అధికారులు... పరిపాలన సజావుగా సాగాలంటే ఇలాంటివి మానుకోవాలని సూచించింది.