YSR Congress Party

పాదయాత్రనే స్ఫూర్తిగా కృష్ణుడు

Submitted by arun on Wed, 08/08/2018 - 17:45

వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడట,

వినాయకుడు సినిమా ఫేం కృష్ణుడట, 

కత్తిపూడిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలోనట,

ఏపీలో వైసీపీ విజయం సాధించడానికేనట.

ఇద్దరు నేతలపై జగన్‌ సీరియస్‌

Submitted by arun on Wed, 08/08/2018 - 14:13

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీలో నెలకొన్న వర్గపోరుపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ అయినట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు మురళీరాజు, పర్వతప్రసాద్ లను తన శిబిరం వద్దకు పిలిపించుకున్న జగన్... వారిద్దరికీ క్లాస్ పీకారు. కత్తిపూడి క్రాస్‌రోడ్డు నుంచి జరిగిన పాదయాత్రలో మురళీరాజు మేనల్లుడుపై పర్వత ప్రసాద్‌ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాకబు చేసిన జగన్‌ సోమవారం రాత్రి కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్‌ కురసాల కన్నబాబు సమక్షంలో ఇరువర్గాలు విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించినట్లు తెలిసింది.

అన్నీ నేనే.. అంతా నేనే...

Submitted by arun on Thu, 07/26/2018 - 11:09

ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి పోరాడారు ఏపిలో ఆ పార్టీ చేసినన్ని దీక్షలు, పోరాటాలు, ఆందోళనలు, బందులు మరే పార్టీ చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు ఓ రకంగా చెప్పాలంటే హోదాకు పేటెంట్ రైట్ ఆ పార్టీదే అనొచ్చు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న వైసీపీ చివరి అంకంలో బొక్క బోర్లా పడిందా? 

నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు

Submitted by arun on Mon, 07/23/2018 - 16:42

వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లను ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. నగరి ప్రజల రుణం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.

బుట్టా రేణుకపై అనర్హత వేటువేయాలి

Submitted by arun on Tue, 07/17/2018 - 17:06

టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ డిప్యూటీ లీడర్‌గా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడమేంటని వైసీపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చినా, టీడీపీ-బీజేపీ లాలూచీ ఇంకా కొనసాగుతుందని, కుమ్మక్కు  రాజకీయాలు కొనసాగుతున్నాయనడానికి ఇంతకంటే రుజువేంకావాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని కోరారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని సమక్షంలోనే విజయసాయిరెడ్డి కోరారు.

పీకే టీమ్ సూచనతో జగన్ ఎలర్ట్...హద్దు దాటితే...

Submitted by arun on Wed, 07/11/2018 - 12:46

వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు రూటు మార్చారు.. నిత్యం చంద్రబాబుపై విమర్శలతో  దూసుకుపోతున్న జగన్ ఇప్పుడు హటాత్తుగా తన స్వరం మార్చుకున్నారు.. గళం సర్దుకున్నారు.. 

‘జగన్‌ను సీఎం చేసేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తా’

Submitted by arun on Thu, 07/05/2018 - 16:47

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వారసుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు కుమారుడు సిద్దార్థరెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. సిద్ధార్థరెడ్డి ఈనెల 7న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డితో విభేదాలు లేవని అన్నారు. జగన్‌ను సీఎం చేసేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తానని సిద్దార్థరెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నందికొట్కూరులో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు.

సొంత పార్టీ నేతలతో జగన్‌కు తలనొప్పులు...తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతోన్న...

Submitted by arun on Thu, 07/05/2018 - 10:54

ప్రజాసంకల్ప యాత్రలో రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరిలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు నేతల కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. 2019లో అధికారం దక్కాలంటే తూర్పులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటోన్న జగన్‌‌‌కు ఇంటి పోరు ఇబ్బంది పెడుతోంది. ఎవర్నీ వదులుకోవడానికి సిద్ధంగాలేని జగన్‌‌ ఏదో ఒక పదవిచ్చి శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది

చంద్రబాబు ‘పీకే ముఖ్యమంత్రి’: వరప్రసాద్

Submitted by arun on Mon, 07/02/2018 - 15:27

ప్యాకేజీ కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్. ముఖ్యమంత్రిగా ఉండటానికి చంద్రబాబుకు అర్హత లేదని.. అనంతపురం వంచనపై దీక్షపైలో మండిపడ్డారు. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన చంద్రబాబును కచ్చితంగా ‘పీకే ముఖ్యమంత్రి’ అనొచ్చు అంటూ ధ్వజమెత్తారు మాజీ  ఎంపీ వరప్రసాద్. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షల రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు తొలగించారన్నారు. ఆయన ఒక పిరికిపంద అని ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు సింహం సింగిల్‌గా వస్తుంది..

సంచలనంగా మారిన బీజేపీ, వైసీపీ నాయకుల దృశ్యాలు

Submitted by arun on Fri, 06/15/2018 - 10:56

ఢిల్లీ పరిణామాలు.. ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయ్. హస్తినలో బీజేపీ, వైసీపీ నేతలు మీట్ అయ్యారని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని, అంతా అవాస్తవమేనని.. వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది. వాళ్లేం చేశారు.. వీళ్లేం చూశారు.. వాస్తవాలేంటి.?

 ఢిల్లీ దృశ్యాలే.. ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. హస్తిన వేదికగా.. బీజేపీ, వైసీపీ నేతలు సమావేశమయ్యారన్న వార్తలు పొలిటికల్‌ హీట్ పెంచాయి. దీంతో.. బీజేపీ, వైసీపీ కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరిందని టీడీపీ చెప్తోంది.