YSR Congress Party

కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత... వైసీపీ నేతల హౌజ్‌ అరెస్ట్‌

Submitted by arun on Wed, 11/21/2018 - 11:21

కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం గొరిగనూరులో ఇవాళ పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న కడప మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జీ సుధీర్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌ బాబులను పోలీసులు అడ్డుకున్నారు. గొరిగనూరుకు వెళ్లకుండా ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. శాంతిభద్రతల పేరుతో వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గొరిగనూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన రామచంద్రయ్య

Submitted by chandram on Tue, 11/13/2018 - 14:07

ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో రామచంద్రయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్ధంపుచ్చుకున్నారు.

వైసీపీలోకి మాజీ మంత్రి

Submitted by arun on Sat, 11/10/2018 - 12:26

కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన  సీ.రామచంద్రయ్య తర్వలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయ్య కొద్దిరోజుల క్రితం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  చేశారు. ఎల్లుండి నుంచి వైసీపీ అధినేత జగన్‌ చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర  విశాఖ జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.

జగన్ పై దాడి కేసులో నయాట్విస్ట్...వైసీపీ నేతలకు నోటీసులు

Submitted by arun on Sun, 11/04/2018 - 10:45

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. వై.ఎస్ .జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని ఆరోపించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈనెల 6న విచారణ కోసం గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పోలీసులు నోటీసులో కోరారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ అన్నారు.

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసుల నోటీసు

Submitted by arun on Sat, 11/03/2018 - 17:03

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. వై.ఎస్ .జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని ఆరోపించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈనెల 6న విచారణ కోసం గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పోలీసులు నోటీసులో కోరారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ అన్నారు. 

నేటితో ముగియనున్న శ్రీనివాస్‌ కస్టడీ...కీలక విషయాలు రాబట్టిన...

Submitted by arun on Fri, 11/02/2018 - 14:11

జగన్‌పై దాడి కేసులో సిట్‌ విచారణ ఆరో రోజు కొనసాగుతోంది. నేటితో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియనుంది. దీంతో శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శ్రీనివాసరావు నుంచి కీలక విషయాలు రాబట్టిన సిట్‌ అధికారులు  నిందితుడితో కలిసి క్యాంటీన్‌లో పనిచేస్తున్న రమాదేవి, జ్యోతితో పాటు మరో యువతిని విచారించారు. ఇప్పటివరకూ మొత్తం 26మందిని విచారించి సిట్‌ అధికారులు శ్రీనివాసరావు వినియోగించిన 4సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. నిందితుడు శ్రీనివాసరావుకు లై డిటెక్టర్ పరీక్షలు జరిపే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. 

వైసీపీ సాయాన్ని అభినందించిన టీడీపీ ఎంపీ

Submitted by arun on Tue, 10/16/2018 - 16:41

‘తిత్లీ’ తుపాన్ తో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకునేందుకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు తమ వంతు సాయం ఇప్పటికే ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

ఎటూ తేలని వంగవీటి రాధా వ్యవహారం

Submitted by arun on Thu, 10/11/2018 - 10:22

వంగవీటి రాధను బుజ్జగించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు విజయవాడలో లో రాధా నివాసానికి వెళ్లిన సాయిరెడ్డి అరగంట పాటు చర్చలు జరిపారు. సెంట్రల్ నుండి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో రాధాకు వివరణ ఇచ్చిన సాయిరెడ్డి. బందర్ పార్టమెంటుకు వెళ్లాలని సూచించారు.. 

నన్ను చాలామంది టార్గెట్ చేస్తున్నారు...భద్రత పెంచండి!

Submitted by arun on Tue, 10/09/2018 - 17:11

తనకు రక్షణ కల్పించాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే.. డీజీపీకి లేఖ రాశారు. తనను చాలామంది టార్గెట్ చేస్తున్నారని.. తనకు భద్రత పెంచాలంటూ లేఖలో పేర్కొన్నారు. గతంలో తాను ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే, బెదిరింపు లేఖలు వచ్చాయని డీజీపీకి తెలిపారు. రాజధానికి భూసమీకరణ, ఓటుకు నోటు కేసు, సీఎం అక్రమ నివాసం.. సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై పోరాటం గురించి కూడా ఎమ్మెల్యే ఆర్కే, తన లేఖలో ప్రస్తావించారు. 

వైసీపీ నేతలకు డెడ్‌లైన్ విధించిన జగన్

Submitted by arun on Sun, 10/07/2018 - 12:58

డిసెంబరు డెడ్‌లైన్.. ఎలాంటి సమస్యలున్నా మీరే పరిష్కరించుకోండి. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయండని పార్టీ శ్రేణులను ఆదేశించారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్. తన ఆదేశాలను లైట్‌గా తీసుకుంటే నేను కూడా అలాగే మిమ్మల్ని లైట్‌గా తీసుకోవాల్సి వస్తుందని నేతలను హెచ్చరించారు. దీంతో ఉరుకులు, పరుగులు పెడుతున్నారు వైసీపీ నేతలు.