Telangana government

డుబుల్‌కు కేంద్రం షాక్‌

Submitted by arun on Wed, 10/17/2018 - 09:43

తెలంగాణ ప్రభుత్వానికి మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం కేటాయించిన 190 కోట్లకు పైగా నిధులను తిరిగి ఇచ్చేయాలని కోరింది. నిధులు విడుదలై రెండేళ్లయినా ఒక్క ఇంటినీ నిర్మించకపోవడంతో డబ్బు వాపస్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

కేసీఆర్ ప్రభుత్వంపై గుత్తా జ్వాల సంచలన ట్వీట్.. ఆ పై తొలగింపు!

Submitted by arun on Tue, 08/07/2018 - 10:34

తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అందులో  ఆరోపించింది. ఆమె ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అన్ని చానళ్లలోనూ ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత కాసేపటికే జ్వాల ఆ ట్వీట్‌ను తొలగించింది.

కంటతడి పెట్టిన జోగిని శ్యామల.. ఏడుస్తూ శాపనార్థాలు

Submitted by arun on Mon, 07/30/2018 - 11:43

బోనాల జాతరలో జోగిని శ్యామల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఏటా హైదరాబాద్‌లో జరిగే గోల్కోండ, లష్కర్ బోనాల్లో పాల్గొని బోనమెత్తి ఆడతారు. అమ్మవారిపై ఎంతో భక్తితో ఆడిపాడే శ్యామల ఈసారి లష్కర్ బోనాలలో మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) జాతరను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చిన తన బాధను వెలిబుచ్చుకున్నారు. మహిళలను కించపరిస్తే పుట్టగతులు ఉండవని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

పీవీ సింధుకి కేసీఆర్ సర్కారు షాక్.!

Submitted by arun on Fri, 07/13/2018 - 11:26

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. తనకు అదనంగా స్థలం ఇవ్వాలని కోరిన విన్నపాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చిది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధుకు అప్పట్లోనే తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ భరణి లేఅవుట్‌లో దాదాపు రూ.15 కోట్ల విలువైన 1000 గజాల స్థలంతో పాటు రూ.5 కోట్ల నగదును ఆమెకు అందజేసింది. అయితే.. తనకు ఇచ్చిన భూమి పక్కనే ఉన్న 398 గజాల స్థలం కూడా కావాలంటూ ఆమె కొన్నాళ్ల క్రితం సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆమె విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

Submitted by arun on Fri, 07/06/2018 - 17:32

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గత నెల 21న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.7పై కోర్టు స్టే విధించింది. ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌-7 వల్ల స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని నీలేరాయ్‌, కాలేశ్రేయ అనే ఇద్దరు స్పోర్ట్స్‌ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

సమ్మెపై పునరాలోచించుకోండి: మంత్రి

Submitted by arun on Fri, 06/08/2018 - 12:32

తెలంగాణ సెక్రటేరియట్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ, ఎండీ రమణారావుతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు. సంస్థను ప్రైవేట్‌పరం చేయాలని భావిస్తున్నందునే కేసీఆర్‌... అలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించి సమ్మెని నివారిస్తారో లేక... బలవంతంగా సమ్మెలోకి దించుతారో సీఎం తేల్చుకోవాలన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.

ఆగస్టు 15 నుంచి తెలంగాణలో రైతు బీమా పథకం

Submitted by arun on Mon, 06/04/2018 - 17:10

రైతు బీమా పథకం.. తాను చేసిన గొప్పపని అన్నారు సీఎం కేసీఆర్‌. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలవుతుందని చెప్పారు. రైతు ఎలా మరణించినా 10 రోజుల్లోనే బాధిత కుటుంబానికి.. 5 లక్షల బీమా అందుతుందన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఏడు జోన్లుగా తెలంగాణ

Submitted by arun on Thu, 05/24/2018 - 16:33

రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా.. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

పథకాల అమలు తీరుపై సీఎం అసంతృప్తి

Submitted by arun on Tue, 04/17/2018 - 12:06

దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించలేదనేది మన సామెత. ఇది ప్రభుత్వ పథకాల విషయంలో సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వం ఎంత మంచి పథకాలు రూపొందించినా...క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఎంత మందికి లబ్ది చేకూరుతుందో అనుమానమే. పైగా అవినీతి బంధుప్రీతి మనకు మామూలే. పథకం ఎంత గొప్పదైనా.. ప్రజలకు చేరువైనప్పుడే ప్రయోజనం. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..పథకాల అమలుపై దృష్టిసారించారు. 

పాడి రైతులకు గేదెల పంపిణీకి రెడీ అయిన తెలంగాణ సర్కార్

Submitted by arun on Sat, 02/10/2018 - 11:15

ఇప్పటివరకు చేప పిల్లలు, గొర్రె పిల్లలు పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. పాడి రైతులకు గేదెలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో.. గేదెలను పంపిణీ చేయనుంది. ఇందుకోసం.. రాష్ట్ర బడ్జెట్‌లో 970 కోట్లు పెట్టేందుకు ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి.