spyder

జ‌న‌వ‌రి నుంచి విజ‌య్, మురుగ‌దాస్ చిత్రం

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 15:36

వైవిధ్యంగా ఉండే యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరు దర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌. తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని   తెచ్చుకున్నాడు మురుగ‌దాస్. ఆయ‌న‌ తాజా చిత్రం 'స్పైడ‌ర్ విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌బాబు హీరోగా తెలుగు, త‌మిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన మురుగ‌దాస్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని విజ‌య్‌తో తెర‌కెక్కించ‌నున్నాడు. జ‌న‌వరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

'స్పైడ‌ర్‌'లో ఆ సీన్స్ లేవు

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 15:05

పొగ‌త్రాగే స‌న్నివేశాలు, మందు తాగే స‌న్నివేశాలు లేకుండా సినిమాలు ఉంటాయా? అది కూడా బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు ఉండే సినిమాల్లో. అంటే.. దానికి స‌మాధానం ఉండ‌వు అనే వినిపించేది. అయితే ఇప్పుడిప్పుడే ఈ త‌ర‌హా సినిమాలకు బ్రేక్ ప‌డుతోంది. గ‌తేడాది వ‌చ్చిన '24' సినిమాలో సూర్య త్రిపాత్రిభినయం చేస్తే.. అందులో ఆత్రేయ అనే పాత్ర విల‌న్‌. అయితే ఎక్క‌డా మందు, పొగ తాగే స‌న్నివేశాలు లేకుండా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ సినిమాని ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు.

145 నిమిషాల 'స్పైడ‌ర్‌'

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 15:31

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తొలిసారిగా చేసిన‌ ద్విభాషా చిత్రం 'స్పైడ‌ర్‌'. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాకి ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'స్టాలిన్' త‌రువాత మురుగ‌దాస్ చేస్తున్న తెలుగు చిత్ర‌మిదే కావ‌డం విశేషం. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అసెంబ్లీ లో మ‌హేష్‌బాబు

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 18:13

అసెంబ్లీలో మ‌హేష్‌బాబుకి ఏం ప‌నా? అనుకుంటున్నారా? అయితే ఇక్క‌డ అసెంబ్లీ అంటే నిజ‌మైన అసెంబ్లీ కాదులెండి. సెట్టింగ్ అన్న‌మాట‌. 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తున్న కొత్త చిత్రం  షూటింగ్.. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో భారీగా నిర్మించిన అసెంబ్లీ సెట్‌లో జ‌రుగుతోంది. డి.వి.వి.దాన‌య్య ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మహేశ్ బాబు స్పైడర్ సినిమా ట్రైలర్ విడుదల

Submitted by lakshman on Fri, 09/15/2017 - 15:52

మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 2మిలియన్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిభరితంగా సాగింది. మురుగదాస్ మేకింగ్, మహేశ్ బాబు యాక్టింగ్‌ కలిస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగింది. ఈ ట్రైలర్‌లో విలన్‌కు, హీరోకు మధ్య వచ్చే సీన్స్, విలన్ సృష్టించే విధ్వంసం, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సంభాషణలను కనిపిస్తాయి.

ముగ్గురు అగ్రహీరోల సినిమా హక్కులూ దిల్ రాజువే

Submitted by lakshman on Thu, 09/14/2017 - 16:26
2017లో టాలీవుడ్‌లో బాగా సంపాదించిన నిర్మాత ఎవరన్నా ఉన్నారంటే అది దిల్ రాజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఆరంభంలో శతమానం భవతి, ఆ తర్వాత నేను లోకల్, డీజే, తాజాగా ఫిదా సినిమాతో...

ర‌కుల్ కి పండ‌గ‌లే

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 14:23

తెలుగు తెర‌ని ఏలుతున్న‌ యువ క‌థానాయిక‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ప‌వ‌న్ క‌ల్యాణ్, ప్ర‌భాస్‌ని మిన‌హాయిస్తే ఇప్ప‌టి అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల్లోనూ న‌టించేసిందీ ముద్దుగుమ్మ‌. అంతేకాకుండా.. ఈ ఏడాదిలో వ‌చ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం'లో భ్ర‌మ‌రాంబ‌గా, 'జ‌య‌జాన‌కి నాయ‌క'లో జాన‌కి (స్వీటీ)గా క‌నిపించి త‌న‌లోని న‌టిని కొత్త కోణాల్లో ఆవిష్క‌రించింది ర‌కుల్‌.  ఇదిలా ఉంటే.. ర‌కుల్ న‌టిస్తున్న తాజా చిత్రాలు పండ‌గ‌ల సంద‌ర్భంలో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్నాయి. మ‌హేష్‌బాబుతో తొలిసారిగా ఆమె న‌టించిన 'స్పైడ‌ర్' చిత్రం విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 27న విడుద‌ల కాబోతుంది.

బాహుబలి తర్వాత ఆ రికార్డ్ స్పైడర్‌దే

Submitted by lakshman on Wed, 09/13/2017 - 15:43
మహేశ్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం స్పైడర్. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికాలో 400 స్క్రీన్స్‌లో స్పైడర్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత యూఎస్‌లో అత్యధిక స్క్రీన్స్‌పై...