spyder

పవన్, మహేష్ ఇచ్చిన షాక్ లో దిల్ రాజు

Submitted by arun on Wed, 01/24/2018 - 16:25

పెద్ద హీరోల సినిమాలను నిర్మించాలని..డిస్టిబ్యూట్ చేయాలని మూవీ మేకర్స్ తెగ పోటీపడతారు. కానీ దిల్ రాజు మాత్రం ఇక అలాంటి తప్పు చేయనంటున్నాడు. పెద్ద హీరోల పేర్లు చెబితేనే ఆమాడ దూరం పరిగెడుతున్నాడు. పవన్, మహేష్ ఇచ్చిన షాక్ తో ఇంకా కోలుకోలేకపోతున్నాడు.  

స్పైడ‌ర్ వివాదంలో ర‌కుల్ ప్రీత్ సింగ్

Submitted by arun on Fri, 01/05/2018 - 11:47

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ నోరు జారిన‌ట్లు తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో త‌న ఫ్రెండ్లీ నేచ‌ర్ తో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ..చాలా త్వ‌ర‌గా స్టార్ డ‌మ్ సంపాదించింది. వివాదాల జోలికి వెళ్ల‌కుండా త‌న‌పని తాను చేసుకొని వెళుతుంది కాబ‌ట్టే ఈ స్టార్ స్టేట‌స్ వ‌చ్చింద‌ని ఆమె స‌న్నిహితులు అంటుంటారు.

'స్పైడ‌ర్' క‌థ ఏమిటంటే..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 15:16

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ తెర‌కెక్కించే సినిమాలు రెగ్యుల‌ర్‌గా ఉండ‌వు. ఏదో ఒక సందేశాన్ని క‌థ‌లో అంత‌ర్లీనంగా ప్ర‌స్తావిస్తూ ఆయ‌న త‌న సినిమాల్ని తెర‌కెక్కిస్తుంటారు. 'గ‌జిని' చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన‌ మురుగ‌దాస్ 'స్టాలిన్‌', 'తుపాకి' చిత్రాల‌తో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న తాజా చిత్రం 'స్పైడ‌ర్' రేపు విడుద‌ల కానుంది. ఈ చిత్రం క‌థ‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే మురుగ‌దాస్‌నే నేరుగా ఈ సినిమా క‌థేంటో చెప్పుకొచ్చారు.. ఓ ఇంట‌ర్వ్యూలో.

'స్పైడ‌ర్‌'.. 2500 థియేట‌ర్స్‌లో

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 19:57

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 2,500 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తున్న 'స్పైడ‌ర్‌'.. యుఎస్ఎలో ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల అడ్వాన్స్ బుకింగ్‌ని ప్రీమియ‌ర్స్‌కే సొంతం చేసుకుంది.

ర‌కుల్‌.. న్యూ ల‌వ్‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 14:53

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన‌ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ న‌టించిన కొత్త చిత్రం 'స్పైడ‌ర్' ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ర‌కుల్ ఆశ నెర‌వేరుతుందా?

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:52

క‌న్న‌డ చిత్రంతో కెరీర్‌ని మొద‌లుపెట్టిన ఉత్త‌రాది భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌.. ఆ త‌రువాత తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్ర‌మే ఈ ముద్దుగుమ్మ‌కి స్టార్‌డ‌మ్ ద‌క్కింది. తెలుగు త‌రువాత ర‌కుల్ ఎక్కువ‌గా న‌టించింది త‌మిళ చిత్రాల్లోనే. అయితే అక్క‌డ ఆమెకి పెద్ద గుర్తింపు అయితే ద‌క్క‌లేదు. 'అలా మొద‌లైంది' రీమేక్ అయిన 'ఎన్న‌మో ఏదో' త‌రువాత  మూడేళ్ల గ్యాప్ తీసుకుని రెండు త‌మిళ చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది ర‌కుల్‌. ఆ చిత్రాలే 'స్పైడ‌ర్‌', 'దీర‌న్ అధిగారం ఒండ్రు'. వీటిలో ముందుగా 'స్పైడ‌ర్' థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

క‌థ‌, ద‌ర్శ‌కుడుపై ఆధార‌ప‌డి ఉంటుంది - మ‌హేష్‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:38

స్టార్ హీరో ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. 'నిజం', 'నాని', '1-నేనొక్క‌డినే', 'శ్రీ‌మంతుడు' చిత్రాల‌ను ఈ త‌ర‌హాలోనే క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌తో చేసుకుపోయారు మ‌హేష్‌. ఇక మ‌హేష్  తాజా చిత్రం 'స్పైడ‌ర్' కూడా కాస్త ప్ర‌యోగాత్మ‌కం అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా చేశారీ సూప‌ర్‌స్టార్‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిందీ చిత్రం.

మ‌హేష్‌, రాజ‌మౌళి సినిమా ఎప్పుడంటే..

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 14:10

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించాయి. 'బాహుబ‌లి2' త‌రువాత ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్త నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 2018 చివ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసే చిత్రం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు మ‌హేష్‌.

విడుద‌లకి ముందే 'స్పైడ‌ర్' రికార్డ్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 20:24

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ద్విభాషా చిత్రం 'స్పైడ‌ర్‌'. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన‌ ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ తెర‌కెక్కించారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది.

మ‌ళ్లీ దీపావ‌ళే టార్గెట్‌?

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 12:48

ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌..సందేశాన్ని జోడించి యాక్ష‌న్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన ముద్ర వేసిన త‌మిళ ద‌ర్శ‌కుడు పేరిది. 'గ‌జిని', 'స్టాలిన్‌', 'తుపాకి' వంటి చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబుతో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో 'స్పైడ‌ర్‌'ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 27న  ఈ సినిమా విడుద‌ల కానుంది.