america

సెక్స్ రాకెట్.. మెహరీన్‌ను విచారించిన అమెరికా అధికారులు

Submitted by arun on Mon, 06/18/2018 - 11:10

కెనెడా నుంచి అమెరికాకు వెళ్లిన నటి మెహరీన్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రశ్నించింది. ఆమె ఏ పని మీద అమెరికాకు వెళ్లారన్న విషయాన్ని వివరంగా అడిగింది. అమెరికాలో భారీ సెక్స్‌ రాకెట్‌ నడిపించిన కిషన్‌ మోదుగుమూడి దంపతులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని గురించి కూడా మెహరీన్‌ను అడిగారట. తన కుటుంబాన్ని కలిసేందుకు యూఎస్ వెళ్ళిన తనను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో నిలిపివేసి సుమారు 30 నిముషాలపాటు విచారించారని ఆమె వెల్లడించింది.

ట్రంప్‌తో భేటికి టాయ్‌లెట్‌ వెంట తెచ్చుకున్న కిమ్‌

Submitted by arun on Tue, 06/12/2018 - 12:02

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌...దేశాధినేతల్లో విలక్షణమైన వ్యక్తి. విచిత్రమైన పనులు చేస్తూ....వార్తల్లోకి ఎక్కుతుంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీకి సింగపూర్‌‌కు వెళ్లారు. అధికారులు, భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను వెంట తీసుకెళ్లారు. అక్కడి ఆగని కిమ్‌....ఓ విచిత్ర పని చేసి తాజాగా వార్తల్లో నిలిచారు.

అమెరికాలో అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన ‘మహానటి’

Submitted by arun on Tue, 05/29/2018 - 16:22

అమెరికాలో ‘మహానటి’ వసూళ్ల హవా కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మాహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మాహానటి’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రిగా కీర్తి సురేష్ చూపిన అభినయానికి ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అద్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అన‌ర్హుడు: క‌్లింట‌న్

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:50

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప‌ద‌వికి అన‌ర్హుడని విమ‌ర్శించారు డెమొక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసిన హిల్ల‌రీ క్లింట‌న్. తాను గ‌త ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ట్రంప్ గెలుస్తార‌ని ఎవ‌రు ఊహించ‌లేద‌న్నారు ఆమె. పారిస్‌ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్‌ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు. 

మరో ప్రచ్ఛన్నం

Submitted by lakshman on Thu, 09/21/2017 - 20:16

ఉత్తర కొరియా రూపంలో అమెరికాకు నేడు మరో విలన్ దొరికింది. ప్రచండ తుపానులతో అతలాకుతలమవుతున్న అమెరికాలోని న్యూయార్క్  నగరంలో మంగళవారం నాడు  జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో ఉత్తర కొరియాపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలిసారి ప్రసంగంలో చండ్రనిప్పులు చెరిగారు. అణు విధానంపై ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోకపోతే విధ్వంసం  తప్పదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలపై దురాక్రమణ పూరిత యుద్ధాలు చేసిన అమెరికా, ఆ తర్వాత ఇరాన్, సిరియా దేశాలను విలన్‌లుగా చిత్రీకరిస్తూ  ప్రచారం చేసింది.

బాహుబలి తర్వాత ఆ రికార్డ్ స్పైడర్‌దే

Submitted by lakshman on Wed, 09/13/2017 - 15:43
మహేశ్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం స్పైడర్. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికాలో 400 స్క్రీన్స్‌లో స్పైడర్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత యూఎస్‌లో అత్యధిక స్క్రీన్స్‌పై...