america

అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

Submitted by chandram on Sat, 12/01/2018 - 12:26

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ H.W బుష్‌ కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన బుష్ 94 ఏళ్లు. బుష్‌ సతీమణి బార్బరా గత ఏప్రిల్‌లో మరణించారు. రిపబ్లికన్‌ పార్టీ నేత అయిన జార్జ్‌ H.W బుష్‌ ..1989 నుంచి 1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 నుంచి 1989 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. జార్జ్‌ H.W బుష్‌ను అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్తగా పేర్కొంటారు. జార్జ్‌ H.W బుష్‌ పెద్ద కొడుకైన జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924, జూన్ 12న బుష్ జన్మించారు.

ప్రపంచ పెద్దన్నయ్య కాలం!

Submitted by arun on Thu, 11/15/2018 - 15:40

ఒక్కో దేశం యొక్క అధ్యక్షుడికి ఒక్కో పదవికాలం వుంటుంది..అయితే..ప్రపంచ పెద్దన్నయలా వ్యవహరించే ..అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీకాలం ఎంతో మీకు తెలుసా!. అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీకాలం 4 సంవత్సరాలు మాత్రమే..అయితే కొద్దిమంది..పాత అద్యక్షులు రెండు పర్యాయాలు కూడా చేసారు... ప్రస్తుత ట్రంప్ గారు మాత్రం నాలుగు సంవత్సరాలకే సరిపుచ్చుకున్టరేమో అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే.శ్రీ.కో.

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

Submitted by arun on Fri, 09/07/2018 - 10:49

అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి లోని ఓ బ్యాంక్‌లో గుర్తుతెలియని  వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన ఫైరింగ్ లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన వారిని దగ్గర్లోనిఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు గుంటూరు జిల్లా  తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. 

అమెరికా చాక్లెట్

Submitted by arun on Fri, 08/10/2018 - 13:42

చాక్లెట్లు అంటే అందరికి ఇష్టమే, కానీ అమెరికన్లు మాత్రం ఒక్క సెకనుకి 50 కిలోల చాక్లెట్లు తింటున్నారట, అందుకే ఓవర్ వెయిట్ అవుతున్నారేమో. శ్రీ.కో
 

డోనాల్డ్ ట్రంప్ కు భారత్ షాక్.. అమెరికా దిగుమతులపై సుంకాల పెంపు..!

Submitted by arun on Sat, 08/04/2018 - 16:51

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాణిజ్య యుద్దానికి తెరతీస్తున్నారు. అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతోంది. ఆ లిస్ట్ లో భారత్ కూడా ఉంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ చైనా, రష్యాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచాయి. అయితే సుంకాల పెంపు నుంచి భారత వస్తువులను మినహాయించాలని కోరగా అమెరికా తిరస్కరించింది. 

Tags

శరత్‌‌ను చంపిన దుండగుడి కాల్చివేత

Submitted by arun on Mon, 07/16/2018 - 11:54

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో తెలంగాణ విద్యార్థిని శరత్‌‌ను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు. కేన్సస్‌లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో  నిందితుడు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని వైద్యులు ప్రకటించారు. నిందితుడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం జల్లెడపట్టారు. ఈ క్రమంలో దుండగుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దాంతో అతడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు.

వైద్యో అమెరికో

Submitted by arun on Wed, 07/11/2018 - 13:21

అమెరికాలో భారతీయ డాక్టర్లల సంఖ్య సుమారు 50 వేలు, అంటే ప్రతి 1325 మంది అమెరికన్లకి ఒక భారతీయ డాక్టరన్నమాట, అదే మన దేశంలో 2400 మందికి ఒక వైద్యుడు.అంటే  చెట్టు పెరిగేది ఇక్కడ, కానీ తన పండ్లు పంచేది అక్కడ! శ్రీ.కో
 

హైస్కూల్లో "ఐ"ఎక్కువ

Submitted by arun on Wed, 07/11/2018 - 13:05

అమెరికలో హైస్కూల్ చదివే విద్యార్థుల్లో మూడోవంతు మందికి "ఐ"ఫోన్లు ఉన్నాయట.
అందుకే... అక్కడ "ఐ"(నేను) హై లొనే ఉంటుంది శ్రీ.కో

మళ్లీ రక్తమోడిన అమెరికా

Submitted by arun on Fri, 06/29/2018 - 11:03

అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఓ పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు  విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. నాలుగు అంతస్తుల ఈ భవనంపై ఓ గ్లాస్ డోర్ నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ అనూహ్య ఘటనతో అందులో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు ఉద్యోగులు బల్లల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నట్టు సమాచారం

షికాగో సెక్స్‌ రాకెట్‌: ఆడియో టేపుల కలకలం

Submitted by arun on Tue, 06/19/2018 - 13:43

ఫిల్మ్ ఇండస్ట్రీలో.. షికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే బయటికొచ్చిన కీలక సూత్రధారి కిషన్ ఆడియో టేపులు.. కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇంత జరుగుతున్నా.. ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.