tamil nadu

ఐపీఎస్ అధికారి కూతురు ‘అరాచకం’

Submitted by arun on Tue, 04/03/2018 - 12:20

తమిళనాడు అదనపు డీజీపీ తమిళ్‌సెల్వన్‌ కూతురు సోమవారం అర్ధరాత్రి చెన్నైలో హల్‌చల్‌ చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఆమె.. తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌పై వీరంగం వేసింది. ‘నన్నే అడ్డుకుంటావా? నేనొక ఐపీఎస్‌ అధికారి కూతుర్ని. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను’ అని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను హెచ్చరించింది. అంతేకాకుండా వెంటనే తండ్రికి ఫోన్‌ చేసి.. తనను ఆపిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించాలని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను ఆ కానిస్టేబుల్‌ చిత్రీకరించారు.

ఆకలి తీర్చాల్సిన ఇడ్లీ.. చిన్నారి గొంతు నులిమేసింది

Submitted by arun on Sat, 03/17/2018 - 11:13

ఎప్పటిలాగే ఆ చిన్నారి.. స్కూలుకు రెడీ అవుతోంది. ఆమె తల్లి తన గారాల పట్టికి టిఫిన్ తినిపిద్దామని వేడివేడిగా ఇడ్లీలు కూడా చేసి పెట్టింది. అంతా బానే ఉంది. కాసేపట్లో ఆ పాప టిఫిన్ తినేసి స్కూలుకు వెళ్లేందుకూ రెడీ అవుతోంది. కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఎందుకు ఉంటుంది? విధి వక్రించింది. ఆ చిన్నారి తిన్న ఇడ్లీ.. ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. ఆ పాప ప్రాణం విలవిల్లాడింది. డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టినా.. లాభం లేకపోయింది. దారి మధ్యలోనే ఊపిరి ఆడకపోవడంతో.. ఆ చిన్నారి మరణించింది.

దిన‌క‌ర‌న్ కీల‌క నిర్ణ‌యం

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:48

అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కృత నేత టీటీవీ దినకరన్ కొత్త పార్టీ లాంఛ్‌ తేదీని ప్రకటించాడు. గ‌త కొంత కాలంగా దినకరన్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చ‌ర్చ‌లు చ‌ర్చ‌లుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15వ తేదీన కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.  ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్‌ వెల్లడించనున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో : కమల్‌

Submitted by arun on Wed, 02/21/2018 - 12:41

తమిళ సీనియర్ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర షురూ అయ్యింది. ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటికి వెళ్ళిన కమల్...కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. తొలిసారి కలాం ఊరికి వచ్చిన కలామ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కలాం కుటుంబ సభ్యుల్ని కలిశాక కమల్ హాసన్... రామేశ్వరంలో మత్య్సకారులతో సమావేశమయ్యారు. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు.

చిరూ దెబ్బ‌ ర‌జ‌నీకి త‌గ‌ల‌కుండా ఉంటుందా

Submitted by arun on Fri, 01/05/2018 - 14:37

ర‌జ‌నీ రాజ‌కీయం పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో పార్టీ పెట్టిన మెగ‌స్టార్ చిరంజీవికి రాజ‌కీయం ఎలాంటి చేదు అనుభ‌వాల్ని మిగిల్చిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. చిరంజీవికి  త‌గిలిన ఎదురు దెబ్బ‌లు ర‌జ‌నీకాంత్ కు త‌గ‌ల‌కుండా ఉంటాయా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఎందుకంటే త‌మిళ‌నాట రాజ‌కీయం అంటే క‌త్తిమీద సామేన‌ని చెప్పుకోవాలి.
 

రజినీకి కలిసొచ్చేవేంటి?

Submitted by arun on Tue, 01/02/2018 - 12:08

45 ఏళ్ల వయసులో రాజకీయంగా అవకాశమొచ్చినా వదులుకున్నాను, 68 ఏళ్ల వయసులో పదవిపై ఆశ ఉంటుందా అని రజినీకాంత్ అన్నారు. మరి పాలిటిక్స్‌లోకి అప్పుడు రాని రజినీ, ఇప్పుడెందుకు వస్తున్నారు...రజినీకి కనిపిస్తున్న నాలుగు అనుకూలతలేంటి...న్యూఇయర్‌లో న్యూపార్టీ అంటున్న రజినీకి కలిసొచ్చేవేంటి?

స్థానికత రజినీకి మైనస్ అవుతుందా?

Submitted by arun on Tue, 01/02/2018 - 12:01

దేవుడు ఆదేశిస్తాడు...అరుణాచలం పాటిస్తాడని, నాడు సినిమాలో నేడు, పొలిటికల్‌ లైఫ్‌లోనూ చెప్పాడు రజినీకాంత్. ఆధ్యాత్మిక పాలిటిక్స్ చేస్తానంటున్న రజినీని, ఆదేశించింది దేవుడు కాదు, నరేంద్ర మోడీ అంటున్నవారి విమర్శలూ అనేకం. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత...రజినీకాంత్‌కు ప్లస్సులేనా...మైనస్‌లూ ఉన్నాయా?

రజనీ ద లీడర్‌

Submitted by arun on Sun, 12/31/2017 - 19:04

ఉత్కంఠకు తెరపడింది. కోట్లాది మంది అభిమానులు, తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ప్రకటి కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందుస్పష్టత ఇచ్చేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాట్లుగా అధికారికంగా ప్రకటించారు.

రజ‌నీ పార్టీలో బీజేపీ నేత..అప్ర‌మ‌త్త‌మైన ఇత‌ర పార్టీ నేత‌లు

Submitted by arun on Sun, 12/31/2017 - 13:04

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు, ల‌క్ష‌మంది అభిమాన సంఘాలు , ట్విట్టర్లో 44 లక్షల మంది ఫాలోవ‌ర్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రోవైపు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారో లేదో ఆయ‌న‌తో ప‌నిచేసేందుకు ఇత‌ర పార్టీకి చెందిన నేత‌లు ఉవ్విళ్లూరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రజినీ పెట్టబోయే పార్టీలో తానూ చేరతానని తిరువళ్లూరు బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎస్‌వి సెల్వరాజు ప్రకటించారు. దీంతో షాక్ తిన్న బీజేపీ నేత‌లు సెల్వ‌రాజ్ పార్టీ మార‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ర‌జ‌నీకాంత్ రాజకీయ ప్ర‌క‌ట‌న‌పై మండిప‌డ్డ సుబ్రమణ్య స్వామి

Submitted by arun on Sun, 12/31/2017 - 11:39

ఆయ‌న‌ ప్ర‌త్య‌ర్ధుల‌పై  ఏదో మామూలుగా ఆరోపణలు చేసి వదిలేయరు..వాటిని నిరూపించేదాకా పట్టువదలని విక్రమార్కుడు. వదల బొమ్మాలి నిన్నొదల అంటూ తను వేసిన కేసుల్ని తానే శోధించి వాదించి సాధిస్తారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ స్వామి..సుబ్ర‌మ‌ణ్య‌స్వామి. ఈ బీజేపీ నేత  సుబ్రమణ్య స్వామి అల్లర చిల్లర ఆరోపణలు అస్సలు చేయరు. ఆయన నోటి నుంచి వచ్చిదంటే కాగితాల ఆధారాలు ఉండే ఉంటాయి. ఇంతవరకు కేసులు అన్ని ఇలాగే ఉన్నాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కటకటాల్లోకి పంపి చుక్కులు చూపించారు. అదే కేసులో శశికళను ఊచలు లెక్కి పెట్టించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో మారన్ , కనిమొళిల్ని ముప్పతిప్పలు పెట్టించారు.