tamil nadu

తమిళనాడుకు ముంచుకొస్తున్న మరో ముప్పు

Submitted by arun on Tue, 11/20/2018 - 13:15

‘గజ’ తుపాను గండం నుంచి బయటపడక ముందే తమిళనాడుకు  మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశ మున్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతికి మారిందని, ఇది మరింత స్థిరపడనుందని చెన్నై వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో వాయు గుండంగా మారి బలపడే అవకాశముందన్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తదితర సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని సూచించారు. వచ్చే 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశమున్నందున జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 

పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు

Submitted by arun on Sat, 11/17/2018 - 16:41

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని పెళ్లిచేసుకుని తమ పరువు తీసిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దర్నీ కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. అత్యంత కిరాతమైన ఈ ఘటన గతవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

తమిళనాడులోనూ ఐటీ దాడులు...ఏక కాలంలో వంద చోట్ల సోదాలు

Submitted by arun on Thu, 10/25/2018 - 12:32

తమిళనాడు ఇసుక మాఫియాపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో దాదాపు 100 ప్రాంతాల్లో దాడులు ప్రారంభించారు. నాలుగు ఇసుక మైనింగ్ కంపెనీల యజమానులు, వారి బంధుమిత్రులు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. న్యూస్ 7 అధినేత వైకుందరాజన్, వీవీ మినరల్ కంపెనీ, మణికందన్, చంద్రసేన్, సుకుమార్ తదితరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. సముద్రపు ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం సేకరించిన అధికారులు, ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

తమిళనాడు సీఎంకు మద్రాసు హైకోర్టు ఊహించని షాక్...!

Submitted by arun on Fri, 10/12/2018 - 16:56

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ జగదీశ్ ఇవాళ తీర్పు వెలువరించారు. పారదర్శక విచారణ కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగించామన్న ధర్మాసనం మూడు నెలల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. హైవే ప్రాజెక్టుల కేటాయింపులో  పళనిస్వామి అవినీతి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డీఎంకే ఫిర్యాదు చేసిన నాలుగు నెలల తర్వాత హైకోర్టు ఈమేరకు స్పందించింది. 

తల్లి శవంపై కూర్చుని అఘోర పూజలు

Submitted by arun on Wed, 10/03/2018 - 14:40

తన తల్లి శవంపై కూర్చుని ఓ అఘోరా అంత్యక్రియలు నిర్వహించడం తమిళనాడులో కలకలం సృష్టించింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన మణికంఠన్‌ అఘోరా.. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూన్న అతని తల్లి మేరీ మరణించింది. దీంతో ఆమె అంత్యక్రియలు కుమారుడైన మణికంఠన్ నిర్వహించాడు. అయితే మణికంఠన్ వారణాసిలో అఘోరాగా శిక్షణ తీసుకుని అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మణికంఠన్ 20 మంది అఘోరాలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. భౌతికకాయానికి ప్రత్యేక పూజలు చేస్తూ.. ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ మణికంఠన్‌ తల్లి శవంపై కూర్చున్నాడు.

గుట్కా స్కాం ప్రకంపనలు...మంత్రి, ఐపీఎస్ అధికారుల ఇళ్లపై సీబీఐ దాడులు

Submitted by arun on Wed, 09/05/2018 - 12:51

గుట్కా కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు తమిళనాడులోని చెన్నైలో దాడులు నిర్వహిస్తున్నారు. మంత్రి విజయ భాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్ నివాసంతో పాటు మొత్తం 40చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా సీనియర్ అధికారులు, అధికార అన్నాడీఎంకే నేతల ఇళ్లపై దాడులు చేసిన సీబీఐ, పోలీస్ అధికారులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని దాడులను ముమ్మరం చేశారు.

ముగిసిన సీనియర్ల శకం...ఆ లోటును భర్తీ చేసేదెవరు?

Submitted by arun on Thu, 08/09/2018 - 10:14

ఇన్నాళ్లూ ఆయన తమిళనాడుకు  పెద్ద దిక్కుగా ఉండేవారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా తమిళనాడు ప్రజలు ఎంతో భరోసాతో బతికారు  క్రియాశీలక రాజకీయాల్లో కరుణానిధి లేకపోయినా, తమిళనాడు ప్రజలు ఒక రకమైన ధైర్యాన్ని పొందారు కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. ప్రజలకు దారి చూపి నడిపించే నేత కరువయ్యాడా?

Tags

జనం మీద దూసుకెళ్లినకారు…ఏడుగురు మృతి

Submitted by arun on Wed, 08/01/2018 - 14:09

తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుందరాపురం సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు కళాశాల విద్యార్థులు ఉన్నారు. మరో ఏడుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు జనంపైకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రేమించుకున్న అన్నాచెల్లెలు...పెద్దల మందలింపుతో...

Submitted by arun on Fri, 06/29/2018 - 13:27

మైనర్లైన వారు వరుసకు అన్నాచెల్లెలు. కానీ, ప్రేమించుకున్నామని వారు చెప్పడంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో రైలుకింద పడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు.

తమిళనాడు కీలక నిర్ణయం

Submitted by arun on Tue, 06/05/2018 - 15:21

ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా తమిళనాడులోని కొందరు పర్యావరణ ప్రేమికులు వినూత్న నిరసన చేపట్టారు. వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని, భూగర్భ జలాలకు సమస్యాత్మకంగా మారుతున్నాయని పేర్కొంటూ ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించారు. తలలపై పోలిథిన్ బ్యాగ్‌లను ధరించి రోడ్లపైకి వచ్చారు. మరోవైపు పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్ విషయంలో తమిళనాడు సర్కారు కఠిన చర్యలకు దిగింది. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు.