mahesh

అంతకు మించి అతడు

Submitted by arun on Thu, 09/13/2018 - 17:19

మీకు తెలుసా! అతడు చిత్రం యొక్క హక్కులు 1.8 కోట్లకు “మా” TV కి మొదట్లో  విక్రయించబడ్డాయి మరియు ఇప్పటికీ ఆ ఛానెల్లో ఎన్నో సార్లు వచ్చింది  , అయితే ఇటీవలే సుమారు 3.5 కోట్ల హక్కులు పునరుద్ధరించబడ్డాయి. ఒక తెలుగు సినిమాకి హక్కులు పునరుద్ధరించుకోనేందుకు వచ్చిన డబ్బులో ఇవి చాల ఎక్కువ అని ఇండస్ట్రీ వార్త. మరి త్రివిక్రమ్ మహేష్ల మేజిక్ అంతే కదా. శ్రీ.కో.

సుకుమార్ నన్ను కొట్టలేదు: మహేష్

Submitted by arun on Fri, 04/06/2018 - 17:57

'రంగస్థలం' సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల దగ్గర సందడి .. భారీగా వసూళ్లు పెరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా టీమ్ .. ఇటీవల సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో కమెడియన్ మహేశ్ పై సుకుమార్ చేయి చేసుకున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. దీనిపై మహేష్ స్పందించాడు. తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఆయన కాళ్లకు నమస్కరించబోయానని.. తనను వద్దని సుక్కు వారించారే తప్ప తనను కొట్టలేదని పేర్కొన్నాడు. ఒకవేళ కొట్టినా ఇంకా సంతోషించేవాడినంటూ తన స్వామి భక్తిని వెల్లడించాడు మహేష్.
 

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ పై మ‌హేష్ సెటైర్లు

Submitted by lakshman on Fri, 03/02/2018 - 17:19

భరత్ అనే నేను’తో ఫ‌స్ట్ ఓత్ తో అల‌రించిన మ‌హేష్ బాబు . శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశాడు. దీంతో ఆ సినిమా మొత్తం పొలిటిక‌ల్ సెటైర్లు ఉంటాయ‌ని ఊహించారు.

నమ్రతకు టెంపర్ ఎక్కువ

Submitted by arun on Fri, 02/23/2018 - 12:43

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పై బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేనాటికే నమ్రత సీనియర్ మోడల్ అని చెప్పింది. ఆమెతో పాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా అగ్ర స్థానంలో ఉండేదని తెలిపింది. అయితే సీనియారిటీ కారణంగా వీరిద్దరూ తనతో చాలా పొగరుగా ప్రవర్తించేవారని వ్యాఖ్యానించింది. 

బాహుబలి తర్వాత ఆ రికార్డ్ స్పైడర్‌దే

Submitted by lakshman on Wed, 09/13/2017 - 15:43
మహేశ్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం స్పైడర్. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికాలో 400 స్క్రీన్స్‌లో స్పైడర్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత యూఎస్‌లో అత్యధిక స్క్రీన్స్‌పై...