Tweets

మంత్రి కేటీఆర్ మరోసారి ఫన్నీ ట్వీట్!

Submitted by arun on Thu, 06/21/2018 - 17:41

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటారు. ఎంతోమంది ట్విట్టర్ ద్వారానే కేటీఆర్‌కు తమ సమస్యలను చెప్పుకుంటుంటారు. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యపైనా కేటీఆర్ స్పందిస్తూ.. వెనువెంటనే సహాయం చేస్తుంటారు. మంత్రిగా ప్రభుత్వ పనులతో ఎప్పుడూ బిజీగా ఉన్నా కూడా.. అప్పుడప్పుడూ తనలోని హాస్యచతురతను బయటపెడుతుంటారు. జోక్‌లు వేస్తూ నవ్విస్తూ ఉంటారు. తాజాగా ఓ చిన్నారి హోంవర్క్‌ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్‌ చేస్తూ కేటీఆర్‌ ఓ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ‘జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్‌...

ఆ దర్శకుడు నమ్మకద్రోహి...పూనమ్ ట్వీట్ వైరల్!

Submitted by arun on Fri, 05/25/2018 - 13:19

గ‌త కొన్ని రోజులుగా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా సంచ‌ల‌న ట్వీట్లు చేస్తున్న హీరోయిన్ పూన‌మ్ కౌర్ తాజాగా మ‌రోసారి త‌న ట్వీట్ల ప‌వ‌ర్ చూపించింది. తాజాగా చేసిన ట్వీట్స్ .. ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారాయి. 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ఆమె చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఈ విషయం మరింత వేడెక్కింది.

ట్వీట్లతో టీడీపీపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్

Submitted by arun on Sat, 02/10/2018 - 13:36

ప్రత్యేక హోదాను వదులుకొనే హక్కును సీఎం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత జగన్. చట్టబద్ధమైన ప్రత్యేక హోదా వద్దనుకొని.. ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ తలూపడాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014 మార్చిలో రాష్ట్రాన్ని విభజించేటపుడు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినపుడే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా మారిందన్నారు. ప్రత్యేక హోదా అమలు కోసం ప్రణాళికా సంఘానికి ముసాయిదా కూడా పంపిన తర్వాత టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి రాజీ పడిందని విమర్శించారు.

పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్థిని చాటుకుంది

Submitted by arun on Mon, 12/25/2017 - 18:22

పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్థిని చాటుకుంది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ పై తన నీచ సంస్కృతిని చాటుకుంది. దేశద్రోహం, గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైళ్లో మగ్గుతున్న జాదవ్‌ను చూసేందుకు మాత్రమే అనుమతిచ్చిన పాక్‌ సర్కార్‌ ఆత్మీయుల మధ్య అడ్డుగోడలు ఏంటని పలువురు మండిపడుతున్నారు.

ఎట్టకేలకు 22 నెలల తర్వాత కుల్‌భూషణ్‌ జాదవ్‌ భార్య, తల్లిని కలిశాడు. భారత్ నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ తల్లి, భార్య పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో జాదవ్‌ను కలిశారు. అరగంటసేపు భేటీ అయిన అతని భార్య, తల్లి కుల్‌భూషణ్‌‌ను చూడగానే ఉద్వేగానికి లోనయ్యారు.