Ravi Shastri

టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రికి మాజీ ల సెగ...పదవి నుంచి...

Submitted by arun on Mon, 09/17/2018 - 17:17

టీమిండియా చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలంటూ రవిశాస్త్రిపై రానురాను ఒత్తిడి పెరిగిపోతోంది. ఐదోర్యాంకర్ ఇంగ్లండ్ చేతిలో టాప్ ర్యాంకర్ టీమిండియా 4-1తో చిత్తుగా ఓడినందుకు చీఫ్ కోచ్ నైతిక బాధ్యత వహించాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. టెస్ట్ తుదిజట్టు ఎంపికలో పొరపాట్లు, వ్యూహాత్మక తప్పిదాలకు కారణం చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రమేనని భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ తేల్చి చెప్పారు. ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు వేతనం అందుకొంటున్న చీఫ్ కోచ్ ఇక ఎంతమాత్రమూ మాటలతో మాయ చేయలేరని తనకు ఇష్టమైన క్రికెట్ వ్యాఖ్యానం కొనసాగించాలని సలహా ఇచ్చారు.

రవిశాస్త్రితో డేటింగ్‌.. స్పందించిన నటి

Submitted by arun on Tue, 09/04/2018 - 11:21

తాను టీమిండియా కోచ్ రవిశాస్త్రితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఆడి కార్ల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము పాల్గొన్నామని, అంతకు మించి మరేమీ లేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌తో రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

కోహ్లీ షాంపైన్‌ బాటిల్‌ కథ

Submitted by arun on Thu, 08/23/2018 - 14:16

క్రికెట్‌ జట్టు కెప్టెన్, చిచ్చర పిడుగు, విరాట్‌ కోహ్లీ,

తన కోచ్‌ రవిశాస్త్రికి విజయసూచికగా చూపుతూ,

ఓ ప్రతేకమైన కానుక ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

అది ఒక  షాంపైన్‌ బాటిల్‌ చేతిలో ఉంచుతూ.  శ్రీ.కో. 

ధోని రిటైర్మెంట్‌పై కోచ్‌ క్లారిటీ!

Submitted by arun on Thu, 07/19/2018 - 11:57

మిస్టర్ కూల్ ధోనీ ఇప్పుడు మరీ కూలయ్యాడు. అతని బ్యాట్ నుంచి ఆశించినంతగా పరుగులు ప్రవహించడంలేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ వన్డేలో ఆట ముగిసిన తర్వాత అంపైర్ నుంచి ధోనీ బాల్ తీసుకోవడం కొంత వివాదానికి తెరలేపింది.  దానిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఓ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్‌ వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు.

ఇండియన్ క్రికెట్ ఎవర్ గ్రీన్ ధోనీ.. 2019 ప్రపంచకప్ వరకూ మహీనే కీపర్

Submitted by arun on Wed, 12/27/2017 - 18:30

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీపైన చీఫ్ కోచ్ రవి శాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ క్రికెట్లోనే ధోనీ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ భారత వన్డే, టీ-20 జట్లలో కొనసాగుతాడని చెప్పకనే చెప్పారు. భారత ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కమ్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ పై HMTV స్పెషల్ స్టోరీ.

మహేంద్ర సింగ్ ధోనీకి రవిశాస్త్రి హ్యాట్సాఫ్

Submitted by arun on Mon, 12/25/2017 - 18:13

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీపైన చీఫ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ భారత వన్డే, టీ-20 జట్లలో కొనసాగుతాడని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో 26 ఏళ్ల వయసున్న నవతరం క్రికెటర్లలో చాలామంది కంటే 36 ఏళ్ల ధోనీ చాలా చురుకుగా, ఫిట్ గా ఉన్నాడని ప్రశంసించాడు. ప్రస్తుత భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ క్రికెటర్లో ధోనీ ఒకడని అందరూ గమనించాలని భారత ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి కోరాడు.