Visakhapatnam

ఐటి ఉద్యోగాల ఉప్పెన వస్తోంది

Submitted by arun on Fri, 08/10/2018 - 16:30

విశాఖపట్టణం ఇక మునుముందు కాబోతోందట,

ఎందరికో ఐటి ఉద్యోగాల సముద్ర పట్టణమట,

మంత్రిగారి ప్రకారం 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలట 

2024కి ఏపీలో నిరుద్యోగులు వెతికినా వుండరట. శ్రీ.కో
 

విశాఖలో పోటీకి అభ్యర్దులే కరువు

Submitted by arun on Wed, 08/01/2018 - 13:51

విశాఖ లో పొలిటికల్ పార్టీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎన్నికల వేడి మొదలవుతున్నా పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులు మాత్రం కరువుతున్నారు. ఢీల్లి లో నలుగురిలో ఒకరిలా వుండేకన్నా అసెంబ్లీస్థానం కుపోటీ చేసి నియోజకవర్గం లో పట్టుసాధించుకోవాలని నేతలు ఉబలాటపడుతున్నారు. దీంతో ఈ సారి కూడా విశాఖ ఎంపీ స్థానం స్థానికేతరులనే వరించే పరిస్థితి కనిపిస్తుంది.

రైలు ముచ్చట "తూచ్చు"

Submitted by arun on Mon, 07/30/2018 - 13:37

ఆంధ్రప్రదేశ్లో రైల్వేజోన్ కదలిక,

ఇక లేదని తెలిపిన హోంశాఖ,
 
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి,
 
పెట్టను మెలిక, ఆ"హోమ్" శాఖ. శ్రీ.కో

కొంపముంచిన సరోగసి... దళిత మహిళపై అఘాయిత్యం

Submitted by arun on Thu, 05/24/2018 - 13:17

విశాఖపట్నంలో ఓ దళిత మహిళ పట్ల పద్మశ్రీ ఆసుపత్రి దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆమె అనుమతి లేకుండానే సరోగసీ పద్దతి ద్వారా ఆమెను గర్భవతిని చేసింది. ఈ విషయం ఆమెకు తెలియడంతో ఆసుపత్రి వర్గాలను నిలదీసింది. మహిళా సంఘాల సాయంతో ఆసుపత్రి యాజమాన్యంపై పోరాటం చేస్తోంది. వెంటనే తనకు అబార్షన్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

జోన్‌ మీద రివిజన్‌

Submitted by arun on Mon, 02/12/2018 - 09:18

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్రం ఆలోచన మొదలుపెట్టిందా? దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమేరకు వున్నాయి? జోన్ ఏర్పాటుకు  వుండే అవకాశలు పరిశీలిస్తే  వాల్తేర్ రైల్వే డివిజన్ ఏమీ తక్కువకాదేనే అంశాన్ని ఇప్పుడిప్పుడే కేంద్రం గుర్తించిందా? ఒక వేళ జోనే ఏర్పాటైతే భువనే‌శ్వర్ కేంద్రంగా వున్న తూర్పుకోస్తారైల్వేతో ముడిపడి వుండే అంశాలపై ఆచితూచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? విశాఖ రైల్వే జోన్‌ని ఏ రకంగా ఏర్పాటు చేస్తే ఆదాయవనరులను నష్టపోకుండా వుంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశాఖలో బాహుబలి తరహా ఘటన..రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఓ కన్నతల్లి ఆరాటం

Submitted by arun on Fri, 01/19/2018 - 18:00

సృష్టిలో తల్లీ బిడ్డల బంధాన్ని మించినది లేదు.. అది అనంతం..పొత్తిళ్లలో బిడ్డ.. అందనంత ఎత్తుకు ఎదగాలని ఏతల్లయినా కలలు కంటుంది.. తన ఆశ, శ్వాస పిల్లల కోసమేనని ఆరాటపడుతుంది..అలాంటి బిడ్డకు ఏదైనా అపాయం కలిగితే? ఆ తల్లి తట్టుకోగలదా?

కుటుంబాన్ని మింగేసిన ఒంటరితనం

Submitted by arun on Fri, 01/05/2018 - 15:30

ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాలు ఆ కుంటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను సైతం బలి తీసుకున్నాయి. అటు ఆర్ధికంగానూ ఇటు సామాజికంగానూ కృంగిపోయిన ఆ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

విశాఖవాసులను భయపెడుతున్న ఏడాకుల చెట్లు

Submitted by arun on Mon, 12/25/2017 - 15:28

విశాఖవాసులకు కొత్త భయం పట్టుకుంది. చెట్ల నుంచి వచ్చే గాలి స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పచ్చదనం కోసం ఉడా అధికారులు నాటిన చెట్లే ప్రజలను భయపెడుతున్నాయ్. గాలి పీల్చాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ్. విశాఖ వాసులు గాలి పీల్చేందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ? ఆ మొక్కల నుంచి వచ్చే వాసన ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తోందా ?