telangana

ఓ వైపు బదిలీలు.. మరోవైపు వరాలు

Submitted by arun on Sat, 08/25/2018 - 08:29

ఓ వైపు ముందస్తు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా మరికొన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేలా కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల్లో అర్చకులు, మసీదుల్లో ఇమామ్‌ ల జీతభత్యాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్‌ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్‌ ...?

Submitted by arun on Fri, 08/24/2018 - 13:25

త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించేలా వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం సెప్టెంబర్ 10లోగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తేనే  ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల కమిషన్‌కు వంద రోజుల వరకు సమయం అవసరమవుతుంది. రాజ్యాంగ నియమాల ప్రకారం ఆరు నెలలలోపు ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి.  ఈ లెక్కన మిజోరాంలో ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 15 నాటికి పూర్తి కావాలి . ఈ లెక్కన సెప్టెంబర్ 10 లోపు అసెంబ్లీ రద్దు చేసినప్పుడే ఎన్నికలు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నేడు వున్నాయట అతి భారీ వర్షాలు

Submitted by arun on Mon, 08/20/2018 - 11:18

ఈరోజు తెలంగాణలో వున్నాయట అతి భారీ వర్షాలు,

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుండి వచ్చే వార్తలు. 

బంగాళాఖాతంలో వచ్చెనట అల్పపీడనం ప్రభావాలు,

ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో కురుస్తున్నాయి జల్లు వర్షాలు. శ్రీ.కో

రాహుల్‌కు తెలిస్తే ఉత్తమ్ ఉద్యోగం ఊడిపోతుంది

Submitted by arun on Tue, 08/14/2018 - 16:49

రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. కిరాయికి ప్రజలను తీసుకువచ్చి ర్యాలీలు తీశారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని దానం ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతేనని జోస్యం చెప్పారు. ఇక సెటిలర్స్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. అసలు సెటిలర్స్‌ను ఆకర్షించే మొహాలు కాంగ్రెస్‌లో ఉన్నాయా?

చెయ్యి అధికారంలోకి

Submitted by arun on Tue, 08/14/2018 - 12:23

తెలంగాణలో, కేంద్రంలో తమ చేయి వస్తోందట, 

అధికారంలోకి ఇక వచ్చేది తామేనట,

ప్రదాని మోదీలా వారు అబద్ధాలు చెప్పరట,

వారు ఏది చెబుతారో అదే చేసి చూపిస్తారట. శ్రీ.కో 

కాంగ్రెస్‌తోనే మహిళాభివృద్ధి: రాహుల్

Submitted by arun on Mon, 08/13/2018 - 16:54

నరేంద్ర మోదీ ప్రభుత్వం సామన్య ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. రాజేంద్రనగర్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్‌‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...‘ మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళితేనే అభివృద్ధి జరుగుతుంది.

టీ కాంగ్రెస్‌లో సీనియర్ లేఖ కలకలం

Submitted by arun on Sat, 08/11/2018 - 17:47

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు క్రీయాశీలకంగా మారుతున్నారా ? పార్టీ వ్యవహారాలపై అధినేత రాహుల్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారా ? లేఖాస్త్రాలు సంధిస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారా ?  అంటే అవుననే సమాధానాలు టెన్ జన్‌పధ్ నుంచి గాంధీ భవన్‌ వరకు వినిపిస్తున్నాయి.  

ఎన్నికల్లో గెలుపుకు కేసిఆర్ వ్యూహాలు...ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లు.. ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు

Submitted by arun on Sat, 08/11/2018 - 12:23

వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహన్ని సిద్దం చేసారా? పనితీరు ఒక్కటే సరిపోదు అభ్యర్ధుల ఎంపిక కూడా పక్కాగా ఉండాలని భావిస్తున్నారా? సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఆదారంగా అభ్యర్ధుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ కు ఆయన అధిక ప్రధాన్యత నిస్తున్నారా? నియోజకవర్గాల్లో కులాలు, వారి బలాల అధారంగా అభ్యర్ధులను గుర్తిస్తున్నారా? 

రాహుల్‌కు...స్పెషల్ బిర్యానీ

Submitted by arun on Mon, 08/06/2018 - 13:57

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయ్. పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్‌ బిర్యానీ రుచులను టేస్ట్ చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్‌వీ హెచ్చరించింది.

ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం

Submitted by arun on Mon, 08/06/2018 - 10:27

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయ్యింది. హస్తిన పర్యటన లక్ష్యాన్ని సాధించారు. గత రెండు నెలలుగా పడుతున్న తర్జన భర్జనలకు త్వరలోనే తెరపడనుంది. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలవడ్డాయి. దీనికి సంబంధించి రానున్న రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందంటూ.. సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో మరికొన్ని గంటల్లోనే రాష్ట్ర ముఖచిత్రం అధికారికంగా మారనుంది.