telangana

దూకుడు పెంచిన బీజేపీ...తెలంగాణకు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

Submitted by arun on Fri, 09/14/2018 - 13:06

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంపై దృష్టి సారించిన ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ నిర్వహించేందుకు అంగీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 

ఆజాద్‌ టూర్‌పై టీకాంగ్రెస్‌ భారీ ఆశలు

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:37

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను ఆజాద్ సెట్ చేయబోతున్నారా? ప్రస్తుత రాజకీయాలపై ఆయన దృష్టి పెట్టనున్నారా? ఆజాద్‌ రాకతో అంతా సెట్‌ అవుతుందా? ఇంతకీ ఆజాద్ రాకకు ప్రధాన ఉద్దేశమేంటి? 

టీడీపీతో పొత్తుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 11:32

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వద్దే వద్దన్నారు. తొలి నుంచి టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్న ఆమె.. మరింత ఘాటుగా స్పందించారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు అవసరమా ? కాదా అన్న విషయాన్ని అధిష్టానం మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీతో పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతరం ఉందన్నారు. ఈ నెల 15 తర్వాత నుంచి రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.  

కొండగట్టు బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Submitted by arun on Tue, 09/11/2018 - 12:38

కొండగట్టులో బస్సు ప్రమాదం విషయం తెలియడంతో సీఎం కేసీఆర్ వెంటనే, జిల్లా అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సీఎం ఆదేశాలతో  జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.   
 

ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌‌కు భారీ షాక్‌....

Submitted by arun on Tue, 09/11/2018 - 09:02

ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌‌కు భారీ షాక్‌ తగిలింది. టీకాంగ్రెస్‌ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టు, వీసా తీసుకున్న కేసులో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 13ఏళ్ల క్రితం నమోదైన కేసులో కీలక సమాచారం సేకరించిన పోలీసులు అర్ధరాత్రి పటాన్‌‍చెరు దగ్గర అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ...మొత్తం 119 స్థానాల్లో ...

Submitted by arun on Mon, 09/10/2018 - 11:39

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమైంది. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాలమూరులో నిర్వహించే బహిరంగ సభ తర్వాత తొలి విడతగా 50 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. అలాగే ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులను ప్రచారానికి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది.

ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్....06-09-18...6+9+1+8=24...2+4=6

Submitted by arun on Thu, 09/06/2018 - 11:01

తెలంగాణలో ముందస్తు కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ రద్దు చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. తిథి, వార నక్షత్రాలు, ముహుర్తాలు, లగ్న బలాల లెక్కల ప్రకారమే నడుచుకునే టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు కూడా ఆ లెక్క ప్రకారమే ముందస్తుకు వెళ్తున్నారా? ఆ లెక్క ప్రకారమే శాసనసభను రద్దు చేస్తారా? ఆరో తారీఖు, గురువారం, పుష్యమి నక్షత్రం అసలు ఈ లెక్కకు అర్థమేంటి.?

తెలంగాణ గట్టుపైన...బీజేపీ, టీజేఎస్...

Submitted by arun on Thu, 09/06/2018 - 09:58

తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుందా..? మిత్రులను వెతుక్కొంటోందా..? అమిత్ షా చూపు ఏ పార్టీ వైపు ఉంది..? దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న అంచనాల నడుమ బీజేపీతో దోస్తీకి సిద్ధమైన పార్టీ ఏది..? 

ప్రచారం ఊపందుకుంటుంది ఉద్యమంలా!

Submitted by arun on Wed, 09/05/2018 - 15:46

ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది ఉద్యమంలా,

ఇక అన్ని పార్టీలు ప్రచార ప్రణాలికల్లో మునిగాయిలా,

ఒకరు 50 రోజుల్లో 100 బహిరంగ సభలు చేస్తాం యిలా,

అని అంటే, మరొకరు మీము మీకన్నా తక్కువనా యెలా,

అని దూకుడు  పెంచాసాగిరి. శ్రీ.కో. 

Tags

ఎన్నికలొస్తాయి.. సిద్ధం కండీ: అమిత్‌ షా

Submitted by arun on Tue, 09/04/2018 - 13:32

ముందస్తు ఎన్నికలకు కాషాయ పార్టీ  రెడీ అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికలు వస్తాయంటూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 12 లేదా 15న మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఆ తర్వాత నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ నేతలతో కిషన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.