selfie video

వరద నీటితో ఇళ్లంతా నిండిపోయింది..దయచేసి నన్ను కాపాడండి...

Submitted by arun on Sat, 08/18/2018 - 11:02

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. ఇప్పటికే 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఇప్పటి 3వేల మందిని రక్షించాయ్ ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ బృందాలు. 80 డ్యామ్‌లకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. NDRF టీమ్స్ సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ మరికొందరు నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

అత్తింటి ఆగడాలకు మగాడి బలి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:53

భార్యతో కలిసి అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాలలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. 

సెల్ఫీ పిచ్చి...వేగంగా వస్తున్న రైలు ముందు పోజిచ్చి..

Submitted by arun on Wed, 01/24/2018 - 14:52

 హైదరాబాద్‌ భరత్‌నగర్‌లో యువకుడు దుస్సాహసం చేశాడు. రన్నింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్‌ ట్రైన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. భరత్‌‌నగర్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ ఢీకొని యువకుడు శివకి తీవ్ర గాయాలయ్యాయి. తల, చేతికి గాయాలు కావడంతో లింగంపల్లి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల కిందట భరత్‌నగర్‌ రైల్వేట్రాక్‌పై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో శివకు తలకు, చేతికి బలంగా గాయాలయ్యాయని రైల్వే ఎస్పీ అశోక్‌ తెలిపారు. అతనికి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పీక్‌ స్టేజ్‌కి వెళ్లిపోతోంది.

నవవధువు ఆత్మహత్య... సెల్ఫీ వీడియో!

Submitted by arun on Mon, 12/25/2017 - 11:14

పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేశారో... లేక కట్టుకున్న భర్త నచ్చలేదో... పెళ్లయిన నాలుగు నెలలకే ఓ నవ వధువు తన ప్రాణాలు తీసుకుంది. మరణించే ముందు తన నిర్ణయానికి కారణాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం 30వ వార్డు కొండయ్య చెరువు పరంజ్యోతి స్కూలు సమీపంలోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో రైల్వే పార్శిల్‌ సర్వీస్‌ ఉద్యోగి ఉద్దండి వీరవెంకటనాగేశ్వరరావు ఉంటున్నారు. ఆయన తన కుమార్తె మౌనిక (24)ను ఆగస్టులో ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రకు ఇచ్చి పెళ్లిచేశారు.