TRS

ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే బలిదానాలు జరిగేవా?: బాల్క సుమన్

Submitted by arun on Sat, 10/27/2018 - 13:45

కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష, వారి వ్యవహరిస్తున్న తీరును అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. విద్యార్థుల బలిదానాలకు కేసీఆర్ కారకుడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకోవడం వల్లే బలిదానాలు జరిగాయన్నారు. ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతమంది బలిదానాలు జరిగేవా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. 

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోంది

Submitted by arun on Sat, 10/27/2018 - 12:52

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోందన్నారు టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట‌ రేవంత్ రెడ్డి. క్రీడలు జరిగే గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ జరిగే సెన్సేషన్ రైజ్ ఈవెంట్ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈవెంట్ పేరుతో లిక్కర్ సరఫరా జరుగబోతోంది ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారా అని రేవంత్ ధ్వజమెత్తారు. ఈవెంట్ పై ఎన్నికల అధికారి రజత్ కుమార్ విచారణకు ఆదేశించాలని కోరారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయలేదు.. కానీ స్టేడియంలో మాత్రం తాగుబోతుల ఈవెంట్ కు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు...ఢిల్లీకి చేరుకున్న డీఎస్‌, నర్సారెడ్డి, ఆర్‌.కృష్ణయ్య..

Submitted by arun on Sat, 10/27/2018 - 10:37

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఇవాళ సొంత గూటికి చేరబోతున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. అటు టీడీపీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్.కృష్ణ‌య్య‌ కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

Tags

టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు

Submitted by arun on Sat, 10/27/2018 - 10:25

టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. మంత్రుల నివాస ప్రాంగణం, ఇతర అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని మహాకూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుకు సీఈవో నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక తొలిసారిగా, అది కూడా అధికార పార్టీకి నోటీసులు జారీ అయ్యాయి. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులు చర్చనీయాంశమయ్యాయి.

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్...టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి...

Submitted by arun on Sat, 10/27/2018 - 10:07

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఇవాళ సొంత గూటికి చేరబోతున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. అటు టీడీపీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్.కృష్ణ‌య్య‌ కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

Tags

సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టె సత్తా డీఎస్‌ కొడుక్కు ఉందా?

Submitted by arun on Thu, 10/25/2018 - 11:06

సీఎం కేసీఆర్ పై పోటీకి బలమైన అభ్యర్థిని దింపేందుకు బీజేపీ యోచిస్తుంది. గజ్వేల్ లో టీఆర్ ఎస్ అధినేతకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి  కోసం అన్వేషిస్తుంది. చివరకు ఒక క్యాండెట్ పేరును తీవ్రంగా పరిశీలిస్తుంది. కేసీఆర్ గట్టిపోటినిచ్చే ఆ బిజేపి నేత ఎవరు ? కేసీఆర్ ను ఓడించే సత్తా అతనికి ఉందా ? 

Tags

కరీంనగర్ లో టీఆర్ఎస్, బిజెపిలకు షాక్

Submitted by arun on Wed, 10/24/2018 - 12:31

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో టీఆర్ఎస్, బిజెపి పార్టీలకు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాడిజెర్రి టీఆర్ఎస్ ఎంపీటీసీ కొత్తూరు మణెమ్మ, లక్ష్మీదేవిపల్లి బిజెపి ఎంపీటీసీ పొన్నం విజయ, నారాయణపూర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మల్లేశం, ర్యాలపల్లి బిజెపి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ పార్టీలకు రాజీనామా చేశారు. నాలుగేళ్లుగా ఎంపీటీసీలుగా ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో కొత్త జైపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని వారు చెప్పారు. 

కేసీఆర్‌పై బీజేపీ అస్త్రం...పోటీకి యంగ్‌ లీడర్‌...

Submitted by arun on Wed, 10/24/2018 - 10:16

తెలంగాణలో బీజేపీ రూట్  మార్చిందా ? అధికారం కంటే సంచలన విజయాలపైనే దృష్టి సారించిందా ? ఏకంగా సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కమలనాధులు పావులు కదుపుతున్నారా ?  గజ్వేల్‌ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెట్టారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు నిన్న మొన్నటి వరకు నమ్మిన నేస్తంగా ఉన్న మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ కుమారుడు ధర్మిపురి అరవింద్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. 

టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్దాం ..

Submitted by arun on Mon, 10/22/2018 - 14:08

మహాకూటమి పొత్తులుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం టీజేఎస్‌, సీపీఐ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తును జాతీయ దృష్టితో చూడాలంటూ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ తక్కువ సీట్లు ఆఫర్ చేసిన భవిష్యత్ అవసరాలు, కేసీఆర్‌ను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు వెళదామంటూ చెప్పారు. టీఆర్ఎస్ పరాజయమే లక్ష్యంగా కేడర్ పని చేయాలని బలం, విజయావకాశాలు ఉన్న చోటే పోటీ చేద్దామంటూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మరో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్

Submitted by arun on Mon, 10/22/2018 - 11:19

మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అభ్యర్థిగా కె. మాణిక్ రావు, మలక్ పేట్ క్యాండెట్ గా చెవ్వా సతీష్ ల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే 105 మంది అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్ ..తాజా ప్రకటనతో అభ్యర్థుల సంఖ్య 107కు చేరుకుంది.