TRS

టీఆర్ఎస్ లో గళం విప్పిన అసంతృప్త నేతలు...సంతంత్రంగా బరిలోకి...

Submitted by arun on Mon, 09/10/2018 - 09:50

టీఆర్ఎస్ లో టిక్కెట్టు దక్కని అసంతృప్త నేతలు తమ గళాన్ని విప్పుతున్నారు. తమ అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు స్వతంత్రంగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట సమితిలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై అసంతృప్త నేతలు అధిష్టానానికి తమ గళాన్ని వినిపిస్తున్నారు. టికెట్ ఆశించిన నేతలకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్నవారు అధిష్టానంపై మండిపడుతున్నారు. పటాన్ చెరువు అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే తిరిగి కేటాయించడంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గాలి అనీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ చదరంగం మొదలాయే.

Submitted by arun on Sat, 09/08/2018 - 16:24


తొలి విడత జాబితాలో లేదు చోటు,

మరి మలి విడత ఆశలకు పోటు,

కనీసం ఒక నామినేటెడ్ పోస్టూతో పాటు,

భవిషత్తుకు ఇస్తారట కొంత మాటు. శ్రీ.కో. 

Tags

బీజేపీ, కేసీఆర్‌ లపై లోకేష్ ఫైర్..

Submitted by arun on Sat, 09/08/2018 - 13:10

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ బాబు బీజేపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  పై విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం లో లోకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే కెసిఆర్ అది చేస్తున్నాడని విమర్శించాడు. కేంద్రం ఆదేశాల అనుగుణంగానే కెసిఆర్ తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

‘అందుకే సురేశ్‌ రెడ్డి పార్టీ వీడారు’

Submitted by arun on Sat, 09/08/2018 - 10:06

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి వెళ్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు మధుయాష్కి తెలిపారు. సిట్టింగ్ స్పీకర్‌గా ఉండి కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని టీఆర్ఎస్‌ స్వాగతించిందంటే ఆ పార్టీ గెలుపోటములు సూచిస్తున్నాయని.. మదుయాష్కి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే సురేశ్‌ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ‍్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్‌ రెడ్డికి టికెట్‌ ఇ‍వ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు.  మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్‌ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు.

కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగిన కాంగ్రెస్‌...కాంగ్రెస్‌లోకి డీఎస్‌, కొండా సురేఖ‌, బాబు మోహన్‌?

Submitted by arun on Sat, 09/08/2018 - 09:25

తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరందుకుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్‌ రెండో దశ ఆపరేషన్‌ మొదలు పెట్టగా కాంగ్రెస్‌ కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు కాంగ్రెస్‌ గాలం వేస్తోంది. ఈ నెల 12న కాంగ్రెస్‌లోకి భారీగా వలసలుంటాయని టీ.కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌తో పాటు కొండా సురేఖ దంపతులు, నందీశ్వర్‌గౌడ్‌, టీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్‌ రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. 

Tags

సురేష్‌రెడ్డి హస్తం పార్టీనీ వీడటం...ఇద్దరు సిట్టింగ్‌లలో టెన్షన్

Submitted by arun on Fri, 09/07/2018 - 16:09

అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. హస్తం పార్టీ నేతలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కుదుపుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పేరున్న మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించింది. సురేష్‌రెడ్డి కూడా హస్తానికి హ్యాండిచ్చి.. కారులో షికారుకు సై అన్నారు. ఈనెల12న తన అనుచరులతో టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకోనున్నారు. సురేష్‌రెడ్డి పార్టీ వీడనుండటం వల్ల నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు కొలుకోలేని దెబ్బతగిలింది. ఆయన పార్టీ మార్పుతో రెండు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం పడనుంది. సురేష్‌రెడ్డి రాకతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి...సాదర స్వాగతం పలికిన కేటీఆర్‌

Submitted by arun on Fri, 09/07/2018 - 12:47

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్  కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సురేష్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్‌ భేటి అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలంటూ కేటీఆర్ ఆహ్వానించారు.  ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు వివేక్‌తో పాటు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ సురేష్‌రెడ్డికి తమ పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తామన్నారు.   

కేసీఆర్‌పై మంత్రి నారాలోకేష్‌ సెటైర్లు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:56

కేసీఆర్‌పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన తెలుగు వాళ్లంతా కలుసుండాలని  ఓ వైపు చెబుతూనే మరో వైపు జాగో  బాగో అంటున్నారన్నారు. టీఆర్ఎస్‌లో టీడీపీ వాళ్లు ఎంత మంది ఉన్నారో అందరికి తెలుసంటూ వ్యాఖ్యానించిన లోకేష్‌ ఆంధ్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కలో కూర్చోబెట్టుకున్నారన్నారు. ఆంధ్రా వాళ్ల ఓట్లతోనే టీఆర్ఎస్‌‌కు జీహెచ్‌ఎంసీ పీఠం దక్కిందన్నారు.  తెలంగాణ అసెంబ్లీ రద్దు ఆమోదం పొందిన సమయంలో నారాలోకేష్ కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి.  

కీలక కాంగ్రెస్‌ నాయకులపై గులాబీ అభ్యర్థులు

Submitted by arun on Fri, 09/07/2018 - 09:48

తెలంగాణ రాజకీయాల్లో ఉద్దండ విపక్ష నాయకులపై, గులాబీదళాధిపతి పోటీగా ఎవరిని నిలబెట్టారు...కీలక నేతలను ఓడించడానికి బరిలోకి దింపిన అభ్యర్థులెవరు?

Tags

అసెంబ్లీ రద్దు ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది...?

Submitted by arun on Fri, 09/07/2018 - 09:08

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమయ్యాయి. అయితే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది. గులాబీ బాస్‌ను ముందస్తుకి నడిపించిన పరిస్థితులు ఏంటి..? అసలు అసెంబ్లీని రద్దు చేసినంత మాత్రాన ముందస్తు ఎన్నికలు జరుగుతాయా..? ముందస్తుకు వెళితే గెలుపు ఖాయమనే నిర్ణయానికి టీఆర్ఎస్ అధినేత ఎలా వచ్చారు ప్రస్తుతం.. ఇవే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.