TRS

త్వరలోనే టీజేఎస్ ఖాళీ అవుతుంది - హరీష్‌రావు

Submitted by chandram on Mon, 11/12/2018 - 16:38

టీజేఎస్ అధినేత కోదండరామ్ టార్గెట్‌గా మంత్రి హరీష్‌ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమాన్ని అవహేళన పార్టీలతో నాలుగు సీట్ల కోసం కోదండరామ్‌ జతకట్టారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన తమను మాత్రం శత్రువులుగా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కోదండరామ్‌ను ఎలా అవమానించారో గుర్తు చేసుకోవాలంటూ సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతల నుంచి కోదండరామ్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న చరిత్ర టీఆర్ఎస్‌దేన్నారు. సంగారెడ్డి జిల్లా టీజేఎస్ నేతలకు పార్టీ కండువ కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కోదండరామ్ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందంటూ జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ తొలి జాబితాలో గందరగోళం

Submitted by arun on Mon, 11/12/2018 - 13:34

టీఆర్ ఎస్ తొలి జాబితాలో గందరగోళం నెలకొంది. తొలి జాబితాలో నాంపల్లి టీఆర్ ఎస్ అభ్యర్థిగా మునుకుంట్ల ఆనంద్ గౌడ్ పేరు ప్రకటించారు. ఆయన రెండు నెలలుగా నాంపల్లిలో ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఎం.ఐ.ఎం కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎంతో స్నేహ పూర్వక పోటీ దెబ్బతినకుండా ఉండేందుకు నాంపల్లిలో సిహెచ్. ఆనంద్ గౌడ్ కు టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వనున్నారు.  

నాంపల్లి టీఆర్ఎస్‌ అభ్యర్థికి షాక్‌...మునుకుంట్ల ఆనంద్‌గౌడ్‌కు బీ ఫామ్‌ ఇవ్వని కేసీఆర్‌

Submitted by arun on Mon, 11/12/2018 - 10:49

నాంపల్లి టీఆర్ఎస్‌ అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్‌గౌడ్‌కు.. కేసీఆర్‌ షాకిచ్చారు. తెలంగాణ భవన్‌లో 107 మంది అభ్యర్థులతో సమావేశం అయిన కేసీఆర్‌ అభ్యర్థులందరికీ తానే స్వయంగా బీ ఫామ్స్‌ అందించారు. అయితే నాంపల్లి అభ్యర్థి ఆనంద్‌గౌడ్‌కు మాత్రం.. బీ ఫామ్‌ను నిరాకరించారు. తొలివిడుత ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో ఆనంద్‌గౌడ్‌ పేరు కూడా ఉంది. దీంతో ఆయన గత రెండు నెలలుగా.. నియోజకవర్గంలో ప్రచారం చేశారు. కానీ చివరకు.. ఆనంద్‌గౌడ్‌కు బీఫామ్‌ దక్కలేదు. 
 

భర్త విజయం కోసం భార్యా ప్రచారం

Submitted by chandram on Sun, 11/11/2018 - 16:24

వనపర్తి టీఆర్ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తరపున ఆయన సతీమణి సింగిరెడ్డి వాసంతిరెడ్డి నేడు నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీరంగపురంలోని ప్రజలను కలిసిన ఆమె టీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. వనపర్తి అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే నిరంజన్‌రెడ్డిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాసంతిరెడ్డి మాట్లడుతూ ప్రచారానికి వచ్చిన నాకు శ్రీరంగపురం గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయామని వాసంతిరెడ్డి ధీమావ్యక్తం చేశారు.

మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి: మోహన్‌బాబు

Submitted by chandram on Sun, 11/11/2018 - 15:46

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సినీ నటుడు, ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆలయ అర్చకులు, సిబ్బందికి ఆయన వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ్ముడూ అని సంబోధిస్తూ మోహన్‌బాబు ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
 

టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయిన సీఎం కేసీఆర్‌

Submitted by chandram on Sun, 11/11/2018 - 14:42

భారీ మెజార్టీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్‌కు చెందిన పార్టీ కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కాసేపట్లో సమావేశం కానున్నారు. సుమారు 15 వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్టు సమాచారం. భద్రతా కారణాలతో 12 గంటల వరకే కార్యకర్తలను లోపలికి అనుమతించారు. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పోటీ చేస్తున్ననేపధ్యంలో భారీ మెజార్టీ లక్ష్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో ఈ నెల 14న నామినేషన్ వేయనుండంతో జన సమీకరణ ఇతర అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.  
 

Tags

నేడు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:44

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో తమ అభ్యర్థుల నామినేషన్ల కోసం బి-ఫారాలను అందించబోతోంది టీఆర్ఎస్. తెలంగాణ భవన్‌లో నేటి సాయంత్రం 4గంటలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బి-ఫారాలు అందించనున్నారు. 107 మంది అభ్యర్థులకు బి-ఫారాలను అందించి, మార్గనిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. మరోవైపు పార్టీ మేనిఫెస్టోను కూడా ఆయన ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 

వారిపట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ

Submitted by arun on Sat, 11/10/2018 - 14:46

కాంగ్రెస్ నాయకుల గల్ఫ్ యాత్రపై ఎంపీ కవిత మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ఇప్పటివరకూ గుర్తుకు రాని గల్ఫ్ కార్మికుల పట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఎంపీ కవిత ప్రశ్నించారు. గల్ఫ్ వలసలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టేనన్నారు. కాంగ్రెస్ హయాంలో చిల్లగవ్వ విడుదల చేయకుండా NRI సెల్ నడిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతున్నాన్నరు. గడిచిన నాలుగేళ్లలో గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం 106 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గల్ఫ్‌లో ఈ నాలుగేళ్లలో 1278 మంది చనిపోతే అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి స్వస్థలాలకు తీసుకొచ్చామన్నారు.

ఈ నెల 11న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు

Submitted by arun on Fri, 11/09/2018 - 11:57

టీఆర్ఎస్ అభ్యర్థులకు బీపారాలు అందచేసే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారాలు అందజేస్తారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమవుతారు. ఇదే సమావేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులందరికి బీ ఫారాలు ఇస్తారు. అలాగే ఆదివారం గజ్వెల్ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారు. ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశానికి 15వేల మంది టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం. 

ప్రజలు నిలదీస్తుంటే ప్రచారం చేయలేకపోతున్నారు: పొన్నం

Submitted by arun on Wed, 11/07/2018 - 10:42

టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల గురించి మాట్లాడటం కాదని, చేతనైతే మీ సంగతి చూసుకోండని విమర్శించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 14 సీట్ల కోసం 60 రోజులుగా తేల్చుకోలేకపోయిన టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. మహాకూటమి గురించి మాట్లాడే కంటే నాలుగున్నరేళ్లలో జనాన్ని మోసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నిలదీస్తుంటే ప్రచారం చేయలేక పరువు తీసే విధంగా టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.