TRS

టీఆర్ఎస్‌లో నెక్ట్స్ ఎవరు....ఎంపీలే కాదు..ఎమ్మెల్సీలు తమతో...

Submitted by arun on Wed, 11/21/2018 - 18:48

నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి... ఇవాళ వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు. 24 గంటల్లో టీఆర్ఎస్‌కు టాటా చెప్పేసిన వారి పేర్లివి. టీఆర్ఎస్‌కు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చిన షాక్ ఆరంభం మాత్రమేనని ఇంకా మున్ముందు సినిమా చూపిస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతల మాటలు గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

విశ్వేశ్వర్‌రెడ్డి హస్తం కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరార్..

Submitted by chandram on Wed, 11/21/2018 - 18:28

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డి హస్తం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 

తెలంగాణలో ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లోకి!: సీఎం కేసీఆర్

Submitted by arun on Wed, 11/21/2018 - 16:02

తెలంగాణ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోతున్నానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌ ... కేంద్రంలో నాన్- బీజేపీ, నాన్- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని చెప్పారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకొస్తే, తెలంగాణ మళ్లీ చీకట్లోకి వెళుతోందని కేసీఆర్‌ విమర్శించారు. 

టీఆర్ఎస్‌కు మరో షాక్...పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే...

Submitted by arun on Wed, 11/21/2018 - 13:56

ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్‌కు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఒక పక్క సీఎంతో సహా అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే అసంతృప్తులు వరుసగా పార్టీని వీడుతున్నారు. టీఆర్ఎస్‌ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టికెట్ విషయంలో మంత్రి మహేందర్‌రెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశారని, ఆ అవమానాన్ని భరించలేకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేశానని సంజీవరావు తెలిపారు. తన నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్‌కు మద్దతిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

రెండు కాదు.. మూడు వికెట్లు: రేవంత్‌

Submitted by chandram on Tue, 11/20/2018 - 19:55

అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ గూటికి రానున్నరని ఇటివల చేసిన ప్రకటన ఇప్పుడు చూస్తే అర్థంమైతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి పంగా నామాలు పెట్టి రాజీనామా లేఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పంపించారు. అయితే విశ్వేశ్వేర్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ త్వరలో ముచ్చటగా మరో ఇద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి స్ఫష్టంచేశారు. వచ్చే నెల డిసెంబర్ 7లోపు రెండు వికెట్లు పడటం ఖాయామని చెప్పిను ఇప్పుడు మూడు వికెట్లు పడుతాయని తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్...

Submitted by arun on Tue, 11/20/2018 - 17:58

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మహాకూటమి గెలిస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి : కేసీఆర్

Submitted by arun on Tue, 11/20/2018 - 15:53

తెలంగాణ ఆవిర్భవించి నాలుగున్నర ఏ‌ళ్ళే అయినా అనేక విషయాల్లో దేశంలో అగ్ర స్థానంలో నిలిచిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. తెలంగాణలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోయే అవకాశం లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్ళీ చీకటి రోజులు వస్తాయని కేసీఆర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాబోయే రోజుల్లో వాటర్ జంక్షన్ కాబోతోందని సీఎం కేసిఆర్ అన్నారు. రైతులు సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదని చెప్పారు.

రూటు మార్చిన సీఎం కేసీఆర్

Submitted by arun on Tue, 11/20/2018 - 11:23

మలివిడత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ రూటు మార్చారు. మాటల తూటాలను పక్కన బెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేలా ప్రచారం చేపట్టారు. పేద ప్రజలు, రైతులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రసంగించిన కేసీఆర్‌ మరో సారి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. కులం వద్దు మతం వద్దు అంటూనే ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త వరాలను ప్రకటించారు.  

రెబల్ అభ్యర్దులపై గులాబీ బాస్ గుర్రు

Submitted by arun on Tue, 11/20/2018 - 11:00

టీఆర్ఎస్ తరపున రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసినవారిపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారా... ? పార్టీ లైన్ దాటి ముందుకెళ్లిన నేతలపై వేటు తప్పదా..? కేసీఆర్ నిర్ణయాన్ని దిక్కరించి పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయడంపై గులాబీ పార్టీలో ఏం చర్చ నడుస్తోంది.

Tags

వరంగల్‌లో ఆ 4 సీట్లు ఎందుకు హాట్‌ ఫేవరేట్‌?

Submitted by santosh on Mon, 11/19/2018 - 17:31

ఈ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ నాలుగు స్దానాల్లో హోరాహోరీ తప్పదా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఢీ అంటే ఢీ అంటున్నాయా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠపై బెట్టింగ్‌లు సైతం జోరు మీద సాగుతున్నాయా అసలు టఫ్‌ వార్‌కు కారణమేంటి ఎలాంటి సమీకారణాలు సమరాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి వరంగల్ జిల్లాలో అ రెండు పార్టీల మద్య నాలుగు సీట్ల ఫైట్‌పై స్పెషల్‌ స్టోరి.