TRS

అందుకే నాకు అన్యాయం: శంకరమ్మ

Submitted by arun on Sat, 11/17/2018 - 11:13

తాను బీసీని కాబట్టే అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నాయకురాలు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శంకరమ్మ నిన్న ఎల్బీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. తనకు టికెట్ దక్కకపోవడంపై శంకరమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో వెయ్యి మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్క సీటు ఇచ్చారని, ఇప్పుడు అది కూడా దక్కలేదని వాపోయారు.  

ప్రచార జోరు పెంచుతున్న గులాబీ దళం

Submitted by arun on Sat, 11/17/2018 - 10:42

టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చార జోరు పెంచబోతోంది. కేసీఆర్ ప్ర‌చార షెడ్యూల్ ఖరారు కారు జెట్ స్పీడులో దూసుకుపోబోతోంది. ఇంతకాలం మహాకూటని సీట్లు ఫైనల్ కాలేదని ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్ వ‌రుసగా బహిరంగ సబల్లో పాల్గొనబోతున్నారు. బాస్ వస్తే క్షేత్ర స్థాయిలో సీన్ మారిపోతుందని టీఆర్ఎస్ అభ్యర్థులు భరోసాగా ఉన్నారు. 

టీఆర్ఎస్ సరికొత్త ఆపరేషన్...కాంగ్రెస్ ముఖ్యుల...

Submitted by arun on Fri, 11/16/2018 - 10:32

టీఆర్ఎస్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న మొన్నటి వరకు పెద్ద నేతలకు గాలం వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్ వివరాలు మీకోసం. 100 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ ముఖ్యనేతల అనుచరులపై కన్నేసింది. అగ్రనేతలంగా సీట్ల పంపకాలతో కుస్తీ పడుతుంటే వారి అనుచరులకు గులాబీ పార్టీ గాలం వేస్తోంది. ఆయా నేతల కీలక అనుచరులను టీఆర్ఎస్ వైపు ఆకర్షించే ఎలక్షన్ ఆపరేషన్ ప్రారంభించింది. కొందరు టీఆర్ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ ను ముఖ్య నేతల నియోజక వర్గాల్లో శరవేగంగా అమలు చేస్తున్నారు.

గులాబీ పార్టీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై?

Submitted by chandram on Thu, 11/15/2018 - 13:04

తెలంగాణలో ఇతర పార్టీల మాదిరీగానే మొన్నటివరకు అధికార పార్టీలోని నేతలు కూడా వలస బాటపడుతున్నారా? తెరాస పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరే యత్నం చేస్తున్నారా? వారు ఎవరో కాదు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్. వీరిద్ధరు గూలాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకుంటున్నారా? అంటే ముమ్మటికి అవుననే సమాధానాలే వస్తున్నాయి. చేవెళ్ల చాలా కాలం నుండి టీఆర్ఎస్ పై అసంతృప్తితోనే ఉన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డికే పార్టీలో అధిక గుర్తింపు ఇవ్వడంతో విశ్వేశ్వర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.

టీఆర్ఎస్ లోనూ రెడ్లదే ఆధిపత్యం

Submitted by arun on Thu, 11/15/2018 - 11:53

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 117 నియోజకవర్గాలకు పోటీ పడే అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి, రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రకటించిన సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24 సీట్లు దక్కగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, సిక్కులకు ఒకటి దక్కాయి. టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకు 2 విడతలుగా 117 మంది అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్ధులను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, రెడ్లకు 37, వెలమలకు 12, మున్నూరు కాపులకు 8, గౌడలకు 6, యాదవులకు 5 సీట్లు లభించాయి.

Tags

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ధ్వజం

Submitted by arun on Wed, 11/14/2018 - 17:16

అన్ని పార్టీలకు ఒకే అధిష్టానం ఉంటే, కాంగ్రెస్ కు రెండు హై కమాండ్ లు ఉన్నాయని టీఆర్ ఎస్ ఎంపీ కవిత చెప్పారు. కాంగ్రెస్ కు ఒక అధిష్టానం ఢిల్లీలో ఉంటే మరో అధిష్టానం అమరావతిలోఉందని ఆమె ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ధీటుగా మరో పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ‌లో రెండు సంవ‌త్సరాల్లో పూర్తిస్తాయి రుణ‌మాఫీ చేసిన ఘ‌న‌త టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 80 శాతం సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని చెప్పారు.

గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన కేసీఆర్‌

Submitted by chandram on Wed, 11/14/2018 - 15:20

టీఆర్ఎస్‌ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వెల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. సరిగ్గా 2 గంటలా 34 నిముషాలకు గజ్వెల్‌‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనుకున్న సమయానికే ఆర్డీవో కార్యాలయం చేరుకున్న ఆయన అట్టహాసాలకు దూరంగా నామినేషన్ వేశారు. కేసీఆర్‌ వెంట హరీశ్‌రావుతో పాటు మరో ఐదుగురు ముఖ్యులు మాత్రమే ఉన్నారు. కాన్వాయ్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌ కేవలం మూడు కార్లలోనే ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ వేశారు. 
 

టీఆర్ఎస్ తాజా మాజీకి బీజేపీ టిక్కెట్..?

Submitted by arun on Wed, 11/14/2018 - 14:40

కరీంనగర్ జిల్లా చొప్పదండి లో టీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. బిజెపి మూడో లిస్టులో బొడిగె శోభ పేరు వస్తుందని సమాచారం. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇక తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఆమె సోమవారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా పలువురు బీజేపీలో చేరి పోటీ చేయాలని ఆమెను కోరారని తెలిసింది.
 

ఖైరతాబాద్ టికెట్టు కోసం టీఆర్ఎస్‌లో ఆగని నిరసనలు

Submitted by chandram on Tue, 11/13/2018 - 15:05

ఖైరతాబాద్ టికెట్టు కోసం టీఆర్ఎస్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైరతాబాద్ సీటు గురించి టీఆర్ఎస్ భవన్ దగ్గర ఆందోళన చేయడానికి బయల్దేరిన ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాలనీ నుంచి బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరగింది. ఈ తోపులాటలో మన్నె గోవర్ధన్ రెడ్డి కింద పడిపోగా ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది.  వెంటనే మన్నె గోవర్ధన్ రెడ్డిని పక్కనే ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్ లో చేర్పించారు.

త్వరలోనే టీజేఎస్ ఖాళీ అవుతుంది - హరీష్‌రావు

Submitted by chandram on Mon, 11/12/2018 - 16:38

టీజేఎస్ అధినేత కోదండరామ్ టార్గెట్‌గా మంత్రి హరీష్‌ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమాన్ని అవహేళన పార్టీలతో నాలుగు సీట్ల కోసం కోదండరామ్‌ జతకట్టారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన తమను మాత్రం శత్రువులుగా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కోదండరామ్‌ను ఎలా అవమానించారో గుర్తు చేసుకోవాలంటూ సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతల నుంచి కోదండరామ్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న చరిత్ర టీఆర్ఎస్‌దేన్నారు. సంగారెడ్డి జిల్లా టీజేఎస్ నేతలకు పార్టీ కండువ కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కోదండరామ్ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందంటూ జోస్యం చెప్పారు.