CM Chadrababu

చంద్రబాబు డ్రామా బాగుంది

Submitted by arun on Sat, 02/03/2018 - 18:17

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఏపీకి నిధులు రాలేవ‌ని సీఎం చంద్రబాబు తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట అని వైసీపీ అధినేత జగన్‌ ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు చేస్తోన్న డ్రామాలు చూస్తోంటే ఆశ్చ‌ర్యం అనిపించిందని అన్నారు. బడ్జెట్‌ తర్వాత చంద్ర‌బాబు మంత్రుల‌తో, ఎంపీల‌తో చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ట అని జగన్ చుర‌క‌లంటించారు. బీజేపీ ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిందని, గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్ గురించి ఏనాడూ ఇంత‌గా బాధ‌ప‌డ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం తీవ్రంగా బాధ‌ప‌డిపోతున్నార‌ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కత్తి చూపు..ఏపీ సర్కారు వైపు

Submitted by arun on Sun, 12/24/2017 - 13:40

నిన్న మొన్నటి వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన కత్తి మహేష్, తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పేరిట విడుదలైన ఆదేశాలను ప్రశ్నించాడు. జనవరి 1న దేవాలయాలకు అలంకరణలు వద్దని, నూతన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమవుతుందని, క్రీస్తు శకాన్ని అనుసరించి జనవరి 1న పండుగ చేసుకోవడం సముచితం కాదని, ఆలయాల్లో పండగ వాతావరణం సృష్టించొద్దని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.