AP Government

నిరుద్యోగులకు ‘యువ నేస్తం’

Submitted by arun on Fri, 08/03/2018 - 10:32

ఏపీలోని నిరుద్యోగులకు వరాలు ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన నిరుద్యోగ భృతికి.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి -యువనేస్తం కింద ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయిల భృతిని అందించనున్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించిన విధివిదానాలను ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకానికి ముఖ్యమంత్రి -యువనేస్తం పేరు పెట్టారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని చెప్పారు. ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయిలు అందిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. నిరుద్యోగ భృతిని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.

అజ్ఞాతవాసి మూవీపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

Submitted by arun on Sun, 01/07/2018 - 11:14

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలవుతున్న అజ్ఞాతవాసి మూవీపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10 నుంచి 17 వరకు... రోజూ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఏపీ సర్కార్‌ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన ఏపీ ప్రభుత్వం

Submitted by lakshman on Sat, 12/23/2017 - 18:35

ఏపీ సర్కారు జారీ చేసిన ఓ సర్క్యులర్ ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది. జనవరి ఒకటో తేదీన దేవాలయాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లేవీ ఉండరాదని, అలంకరణల పేరిట డబ్బు తగలేయరాదని ఏపీ సర్కారు ఫర్మానా జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇంకా క్రీస్తు శకాన్ని ఫాలో అవుతున్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఏపీ సర్కారు జనవరి 1 ప్రాధాన్యత తగ్గించి.. క్రమంగా ఉగాదికే పెద్దపీట వేస్తుందా? క్రీస్తు శకం స్థానంలో శాలివాహన శకాన్ని మళ్లీ అమలు చేస్తారా? ప్రపంచమంతా గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో.. ఏపీ సర్కారు ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఈ అంశాలే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.