Andrapradesh

ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్ మంత్రులుగా ప్రమాణం

Submitted by chandram on Sun, 11/11/2018 - 12:08

ఏపీ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌ హాల్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి సభ్యుడు ఎన్‌ఎమ్‌డీ ఫరూక్‌తో పాటు, కిడారి శ్రావణ్‌ కుమార్‌లు కొత్తగా మంత్రి వర్గంలో చేరారు. ఎన్‌ఎమ్‌డీ ఫరూక్ దైవ సాక్షిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా కిడారి శ్రవణ్ మాత్రం దైవ సాక్షిగా ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. 
 

సోమశిల ఆయకట్టు నీటి పంపిణిపై నేడు కీలక నిర్ణయం

Submitted by arun on Thu, 11/08/2018 - 14:24

ఏపీలో అతిపెద్ద జలాశయం సోమశిల ఆయకట్టు నీటి పంపిణిపై నిర్ణయం తీసుకునేందుకు నెల్లూరు సాగునీటి సలహా మండలి సమావేశం కాబోతుంది. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు అధ్యక్షతన మంత్రులు అమర్నాథ్ రెడ్డి సారధ్యంలో జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సోమశిల జలాశయం ఆయకట్టు తాగునీటిపై గతంలో ఎప్పుడూ లేనంత విధంగా సందేహాలు మొదలయ్యాయి. అంతంత మాత్రంగానే ఉన్న నీటి నిల్వతో ఆయకట్టుకు ఏ మేరకు నీరందిస్తారన్నది రైతుల్లో ఆందోళన నెలకొంది.. ప్రస్తుతం సోమశిల జలాశయం‌లో 42 టీఎంసీల నీరుంది జలాశయం పూర్తి ఆయకట్టు గతేడాది లెక్కల ప్రకారం 8 లక్షల ఎకరాలకు పై మాట దీంతో నీరందించాలంటే కనీసం మరో 15 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది.

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by arun on Sat, 12/23/2017 - 13:07

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటిన ఆలయాల్లో కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ దేవాదాయ శాఖ సర్యులర్ జారీ చేసింది. జనవరి 1 న దేవాలయాల్లో పండుగ వాతావరణం సృష్టించొద్దని దేవాదాయశాఖ తేల్చిచెప్పింది. భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపొద్దని ఆలయ ద్వారాలను స్వాగత తోరణాలు కట్టడం వంటివే చేయవద్దని స్పష్టం చేసింది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజు మాత్రమే దేవాలయాల్లో వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అనుబంధ సంస్ధ ధర్మపరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి ఆదేశించారు.