kadapa

దీక్ష విరమించిన సీఎం రమేశ్.. చంద్రబాబు ఏం చెప్పారు..?

Submitted by arun on Sat, 06/30/2018 - 14:49

కడప ఉక్కు పరిశ్రమ కోసం గత 11 రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ దీక్ష విరమించారు. ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాడతామంటూ సీఎం చంద్రబాబు హామి ఇవ్వడంతో ఆయన దీక్ష విరమణకు అంగీకరించారు.  సీఎం చేతుల మీదుగా నిమ్మరసం అందుకున్న అనంతరం దీక్ష విరమించారు. బీటెక్ రవితో  కలసి ఈ నెల 20న దీక్షకు దిగిన సీఎం రమేష్  స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమణ లేదని ప్రకటించారు. శరీరంలో కిటోన్ లెవల్స్ పెరుగుతున్నాయంటూ వైద్యులు హెచ్చరించినా ఏ మాత్రం పట్టించుకోకుండా దీక్ష కొనసాగించారు.

గడప గడపకి ఉద్యోగం రావాలంటే

Submitted by arun on Thu, 06/28/2018 - 14:38

గడప గడపకి ఉద్యోగం రావాలంటే

కడపకి ఉక్కు కర్మాగారం రావాలంట,

ఢిల్లీ పెద్దలకేమో, విన్నతులు వినరావంటా,

ఇచ్చిన మాటకి పట్టిన తుప్పు కనరాదంటా.

ఉక్కు పరిశ్రమ.

సీఎం రమేష్ దీక్షకు కనిమొళి సంఘీభావం.. కేంద్రంపై ఆగ్రహం

Submitted by arun on Tue, 06/26/2018 - 17:28

ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌కు సొంత రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ కడపలో దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌కు డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమొళి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె...ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సీఎం రమేష్‌ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడారని గుర్తుచేశారు. కేంద్రం మాట మీద నిలబడి ఉంటే ఈపాటికి విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేవని చెప్పారు. బీజేపీకి హిందుత్వం తప్ప దేశ క్షేమం పట్టదని కనిమొళి ధ్వజమెత్తారు.

కడప జిల్లా నాయకులకు క్లాస్ పీకిన చంద్రబాబు

Submitted by arun on Tue, 06/12/2018 - 11:52

ఎంపీ సీఎం రమేష్-వరదరాజులు రెడ్డి వివాదంపై కడప జిల్లా టీడీపీ నాయకులకు చంద్రబాబు క్లాస్ పీకారు. కలిసి పనిచేసుకోకుండా కలహాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య ఈ తరహా విభేదాలు కరెక్ట్ కాదన్న బాబు... రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే.. బీజేపీకి పట్టిన దుర్గతే పడుతుందని సూచించారు.

ఆ గ్రామాల్ని త‌రిమికొడుతున్న దుర‌ద‌

Submitted by arun on Fri, 02/23/2018 - 11:30

చిన్నా లేదు పెద్దా లేదు, పగలు లేదు రాత్రీ లేదు, ఆ ఊరు ఊరంతా దురద. ప్రతీ ఒక్కరికీ పగలు లేదు, రాత్రి లేదు, కంటికసలు కునుకే లేదు. 24 గంటలూ గీరుకుంటూనే కనిపిస్తారు. ఎవరైనా అక్కడికి వెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇస్తే, తిరిగి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ గోక్కుంటారు. ఇక్కడా అక్కడా లేదు, ఒళ్లంతా దురదే, ఊరంతా దురదే. రెండు మూడు నిమిషాలు దురద పెడితేనే చిరాకు పడతాం. అలాంటిది ఒక నెలరోజులుగా దురద పెడుతుంటే, 24 గంటలనూ నిద్రలేకుండా గీరుకుంటూ ఉంటే, వినడానికి మనకే ఇలా ఉంటే, ఇక  ఆ బాధ అనుభవిస్తున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది..?

వింత వివాహాం.. ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న మరో యువతి

Submitted by arun on Tue, 12/26/2017 - 14:32

కడప జిల్లా జమ్మలమడుగులో నమ్మలేని నిజం ఒకటి బయటపడింది. అది వింటే మిమ్మల్ని మీరే కొన్ని నిమిషాల పాటు నమ్మలేరు. నమ్మేందుకు ఎంత ట్రై చేసినా మీ మనసు ఒప్పుకోదు. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని మిమ్మల్ని మీరే ఒకటికి పది సార్లు ప్రశ్నించుకుంటారు.

ముందు ఆ నిజమేంటో చెప్పండి టెన్షన్‌తో చచ్చిపోతున్నాం అని మీరనుకుంటున్నా తెలిశాక మాత్రం టెన్షన్ ఫ్రీ అయిపోతారు. భుజంపై టవల్ వేసుకొని అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయిదే ఈ కేసులో కీ రోల్. అమ్మాయా అని అవాక్కవకండి. అచ్చం అబ్బాయిలా ఉన్నా అచ్చు గుద్దిన అమ్మాయే ఈమె. 18 ఏళ్ల రమాదేవి ఏకంగా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Submitted by arun on Sat, 12/23/2017 - 10:31

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం శవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసి అయిన శివను భార్య అరుణ...ప్రియుడితో కలిసి హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని అన్నాసముద్రం అటవీప్రాంతంలో పడేసింది. అయితే శివ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది.