nizamabad

భూపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి

Submitted by arun on Thu, 11/15/2018 - 11:25

మహాకూటమి దొంగల కూటమన్నారు ఎంపీ కవిత. వారికి అధికారమిస్తే తెలంగాణకు ద్రోహం చేస్తారని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీడీపీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించడంలో అపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పొత్తు ఎందుకో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న వారినే మళ్లీ గెలిపించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ప్రజా నాయకుడు బాజిరెడ్డి గోవర్దన్‌ని మళ్లీ గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

ఫోన్‌ పోయింది.. మందు బాబు వీరంగం..

Submitted by chandram on Wed, 11/14/2018 - 12:25

మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. దింతో చాకచాక్యంగా పోలీసులు మందుబాబుని సురక్షితంగా కాపాడి ఇంట్లో అప్పచేప్పారు. నిజామాబాద్ జిల్లా దమ్మన్నపేట గ్రామస్థుడు తప్పతాగిన మైకంలో ధర్పల్లి గ్రామంలో నీళ్ల ట్యాంక్ ఎక్కి నానా వీరంగం చేశాడు. వివరాల్లోకి వెళితే ధర్పల్లి వద్ద చాయ్ దుకాణం వద్ద ఇద్దరు కానిస్టేబుల్ టీ తాగుతుండగా తులసీనారాయణస్వామి నా సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు వివరించి, ఎలాగైన నా ఫోన్ మీరే వెతికి తిరిగి అప్పగించాలని పోలీసులను కోరారు.

వలసలు చివరికి ఎవరికి ఎసరు...టిక్కెట్ల రేసుతో ప్రశ్నార్థకంగా రేవంత్‌ వర్గం భవిష్యత్తు

Submitted by arun on Tue, 11/06/2018 - 12:23

వాళ్లంతా ఆ నేతను నమ్ముకున్నారు. ఆయన వెంటే నడిచారు. పార్టీలో సముచిత స్ధానం దక్కుతుందని ఆశించారు. టికెట్టు తమకే అనే ధీమాలో ఉన్న ఆ నేతలకు మహాకూటమి పొత్తులు షాక్ ఇస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంలా మారింది ఆ వలస నేతల పరిస్ధితి. మింగలేక కక్కలేక కొత్తగూడు వెతుక్కునే పనిలో పడ్డారు. 

ఒకే ఒక్క చాన్స్‌ ఇవ్వండి...

Submitted by arun on Mon, 10/29/2018 - 17:18

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఒకే ఒక్క ఛాన్స్.. అభ్యర్ధిగా ఖరారు చేస్తే చాలు.. ఎమ్మెల్యే సీటు పార్టీకి కానుకగా ఇస్తాం.. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతాం.. అన్ని ఖర్చులు మేమే భరిస్తాం అంటూ ఆ ఎమ్మెల్సీలు... ఎమ్మెల్యే సీటు కోసం పట్టుబడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు అదే బాటలో ఉన్నారు. ఓ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు కాగా.. మరో ఇద్దరి పోటీపై అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్సీల పదవీ కాలం మరో మూడేళ్ల వరకు ఉండటంతో.. టికెట్టు కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన ఎమ్మెల్సీలు పై ప్రత్యేక కథనం. 

నిజామాబాద్ జిల్లాలో రసవత్తరంగా రాజకీయం...ప్రచారం ఆ మూడు చోట్లే

Submitted by arun on Wed, 10/24/2018 - 13:30

అధికార పార్టీకి ధీటుగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేతలు సైతం ఓ దఫా తమ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతుండగా ఆ మూడు నియోజవర్గాల్లోనే సందడి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో మహా కలవరం మొదలైంది. సీట్ల పీటముడి వీడక అభ్యర్ధుల్లో టెన్షన్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం సరళిపై ప్రత్యేక కథనం.

వ్యవసాయానికి కేరాఫ్‌ నిజామాబాద్‌!

Submitted by arun on Wed, 10/03/2018 - 17:04

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభలో ఎంపీ కవిత ప్రసంగించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి కేరాఫ్‌ అడ్రస్‌ నిజామాబాద్‌ జిల్లా అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్‌ కరెంటు కోతలు లేకుండా చేశారని, ఇంటింటికీ నల్లాల కోసం రూ. 4వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో లక్షా 5వేల కేసీఆర్‌ కిట్‌లు పంపిణీ చేశామని, 4లక్షల 72వేలమంది రైతులకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ హయాంలో నిజామాబాద్‌కు 292 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.
 

కాసేపట్లో నిజామాబాద్‌కు కేసీఆర్...గులాబీమయంగా మారిన ఇందూరు నగరం

Submitted by arun on Wed, 10/03/2018 - 14:11

సీఎం సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హుస్నాబాద్ సభ అనంతరం 25రోజలు గ్యాప్ తర్వాత జరుగుతున్న రెండో సభ కావడంతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌ మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. హెలిక్యాప్టర్‌లో నేరుగా సభా స్థలానికి వస్తారు. ఇందుకోసం సభా స్థలం వద్ద హెలిప్యాడ్‌ను నిర్మించారు. వచ్చిన వెంటనే కొద్దిసేపు పార్టీ అభ్యర్థులతో సమీక్షిస్తారు. అనంతరం బహిరంగసభా వేదిక పైకి వచ్చి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. టీఆర్‌ఎస్‌ జెండాలు, తోరణాలతో నగరమంతా గులాబీ మయంగా మారింది.

Tags

ధర్మపురి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధం

Submitted by arun on Sat, 08/04/2018 - 10:10

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనపై నిర్భయతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారు. ఇంటికి తాళాలు వేసి పరారు కావడంతో పోలీసులు గాలిస్తున్నారు. మూడు  బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, బాధిత విద్యార్థినులు మాత్రం సంజయ్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నారు. 

లైంగిక వేధింపుల వెనుక ఉన్నదెవరు...డీఎస్‌ కొడుకు వాదనేంటి?

Submitted by arun on Fri, 08/03/2018 - 17:43

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పై లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సంజయ్‌ తమను లైంగిక వేధించాడంటూ నేరుగా హోంమంత్రి నాయినికే ఫిర్యాదుచేసి సంచలనం సృష్టించిన శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్ధినులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి కంప్లైంట్ చేశారు. వికృత ప్రవర్తనతో తీవ్ర వేధింపులకు గురిచేశాడని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంజయ్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్న విద్యార్ధినులు రక్షణ కల్పించాలని సీపీని కోరారు.

యూకేజీ విద్యార్థిని కిడ్నాప్...తల్లిదండ్రుల ఆందోళన

Submitted by arun on Fri, 08/03/2018 - 12:03

నిజామాబాద్ నందిపేటలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. గీతా కాన్వెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల మల్లీశ్వరిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. చిన్నారి  కిడ్నాప్‌ మిస్టరీ వీడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వన్నెల్‌ గ్రామానికి చెందిన రమేష్, హరిత దంపతుల రెండో కూతురైన  మల్లీశ్వరీ నిన్న స్కూల్‌ కి వెళ్లి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.