telangana

నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు

Submitted by arun on Fri, 11/16/2018 - 13:58

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ రజత్ కుమార్. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికార పార్టీ నాయకులపై కూడా ఫిర్యాదు వస్తే కేసులు పెడుతున్నామని తెలిపారు. పోలింగ్ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తారని తెలిపారు. సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని అన్నారు. సుందరయ్య విజ్నాన కేంద్రంలో రజత్ కుమార్ మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. 

19 స్థానాలపై సస్పెన్స్...వ్యూహాత్మకంగా కాంగ్రెస్ మూడో జాబితా...

Submitted by arun on Fri, 11/16/2018 - 10:58

కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. తుది జాబితా విడుదలకు అంతా సిద్ధమైందని నిన్నంతా హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలు చివరికి అభ్యర్థుల పేర్లను రేపు ప్రకటిస్తామని తీరిగ్గా తెలిపారు. ఇంతకీ కాంగ్రెస్ మూడో లిస్ట్ విడుదల ఎందుకు జాప్యమౌతోంది. కోదండరాం ఢిల్లీ వెళ్ళడానికి కాంగ్రెస్ లిస్ట్ వాయిదా పడటానికి సంబంధం ఉందా..? జనగామ సీటు కోసం ఢిల్లీలో పొన్నాల సాగిస్తున్న మంతనాలు ఎంతవరకు వచ్చాయి..?

కాసేపట్లో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ విడుదల

Submitted by arun on Thu, 11/15/2018 - 10:44

తెలంగాణలో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఏఐసీసీ ఇన్‌చార్జి సెక్రటరీలు, పీసీసీ చీఫ్ భేటీ అయి జాబితాను ఖరారు చేయనున్నారు. ఇప్పటిదాకా విడుదలైన జాబితాల్లో కొందరు సీనియర్ల పేర్లు కనపించలేదు. ముఖ్యంగా జనగామ, తుంగతుర్తి, సనత్‌నగర్, ఎల్‌బి.నగర్‌లలో అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. దీంతో ఇప్పటికే టిక్కెట్టు రాని సీనియర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణలో జోరందుకున్ననామినేషన్లు

Submitted by chandram on Wed, 11/14/2018 - 18:23

రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో నామినేషన్ల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు.

మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ మూడో లిస్ట్..

Submitted by arun on Wed, 11/14/2018 - 10:29

బిజెపి మూడో జాబితా ప్రకటించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ వెళ్లిన బిజెపి నేతలు అమిత్ షా, నడ్డాలతో భేటీ కానున్నారు. మిగతా స్థానాల అభ్యర్థులపై వారితో చర్చిస్తారు. 30 పైగా స్థానాలకు అభ్యర్థులను బిజెపి ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. బిజెపి మూడో జాబితాలో మహబూబ్ నగర్ పద్మాజా రెడ్డి, కొడంగల్ నాగురావు నామోజీ, కొల్హాపూర్ సుధాకర్, జడ్చర్ల మాదిని శ్రీనివాస్, నల్గొండ షణ్ముఖ, ఇబ్రహీంపట్నం అశోక్ గౌడ్, చేవెళ్ల ప్రకాష్,  పరిగి ప్రహ్లాద్ లేదా కాసాని, చొప్పదండి బొడిగే శోభ, మంచిర్యాల అరవింద్ రెడ్డి, జుక్కల్ నాయుడు ప్రకాష్, ఎల్లారెడ్డి బాణాల లక్ష్మారెడ్డి పేర్లు ఉండే అవకాశం ఉంది. 

Tags

తెలంగాణలోకి మావోయిస్టు యాక్షన్‌ టీమ్స్‌

Submitted by chandram on Tue, 11/13/2018 - 18:12

త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణలోకి మావోయిస్టుల యాక్షన్‌ టీమ్స్‌ ప్రవేశించాయని పోలీసులు తెలిపారు. నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు. దీనికి సంబంధించి మావోల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో యాక్షన్‌ టీమ్‌ కదలికలు ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే ముందు తమకు సమాచారం అందించాలని నాయకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్‌ నాయకులకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు పోలీుసలు తెలిపారు.

కూటమికి కాంగ్రెస్ బారీ షాక్..

Submitted by arun on Tue, 11/13/2018 - 10:01

కళ్లు కాయలు కాసేలా అభ్యర్థులు, నేతలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అయితే మహాకూటమిలో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలు కోరిన స్థానాల్లో సైతం కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించి.. షాక్ ఇచ్చింది. వరుస భేటీలు, గంటల కొద్ది చర్చలు, మరెన్నో సమాలోచనలు సీట్లపై ఎడతెగని పంచాయతీలు తెలంగాణలో మహా కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. చివరకి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు కూడా సీట్ల సర్ధుబాటుపై భాగస్వామ్య పార్టీలకు క్లారిటీ రాని పరిస్థితి. అయితే, ప్రజలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదల అయ్యింది.

వరంగల్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

Submitted by chandram on Sun, 11/11/2018 - 14:22

వరంగల్ అర్బన్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు ఎగిసి పడ్డాయి. వరంగల్ పశ్చిమ టికెట్ నాయిని రాజేందర్ రెడ్డికి ఇవ్వాలంటూ అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  హన్మకొండలోని పార్టీ కార్యాలయంగేటుకు తాళాలు వేసి దీక్షకు దిగారు. గ్రేటర్ కాంగ్రెస్  అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు ఇతర కార్యకర్తలు ఆందోళన దిగారు. రాజేందర్‌ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ స్ధానిక ప్రజాప్రతినిధుల వార్నింగ్‌ ఇచ్చారు. కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన సీనియర్ నేతలు బుజ్జగించే పనిల్లో పడ్డారు. 

నేడు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:44

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో తమ అభ్యర్థుల నామినేషన్ల కోసం బి-ఫారాలను అందించబోతోంది టీఆర్ఎస్. తెలంగాణ భవన్‌లో నేటి సాయంత్రం 4గంటలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బి-ఫారాలు అందించనున్నారు. 107 మంది అభ్యర్థులకు బి-ఫారాలను అందించి, మార్గనిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. మరోవైపు పార్టీ మేనిఫెస్టోను కూడా ఆయన ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 

కూటమిలో సీట్ల కుంపట్లు.. తెగేదాకా లాగుతారా?

Submitted by arun on Sat, 11/10/2018 - 16:14

సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమతున్నాయి మహకూటమిలోని భాగస్వామ్య పార్టీలు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో భేటీ అయిన ఎల్.రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కాంగ్రెస్ సీపీఐకి మూడు స్థానాలనే ఇస్తామనడంతో ఐదు స్థానాలు కావాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. టీడీపీకి 14 సీట్లు ఇస్తామన్నడంతో మరో రెండు సీట్లు కావాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేస్తోంది. కాసేపట్లో పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్‌తో భాగస్వామ్య పార్టీ నేతలు భేటీకానున్నాయి. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు సీట్లపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి.