Polavaram project

పోలవరం ప్రాజెక్టు సమీపంలో రోడ్లకు బీటలు

Submitted by arun on Sat, 11/03/2018 - 12:44

పోలవరం ప్రాజెక్టు సమీపంలో రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టుకు వెళ్లే రూట్‌లో రహదారి కుంగడంతోపాటు పెద్దఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాదు రోడ్లకు పగుళ్లు వచ్చిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోయాయి. దాంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. అయితే భూకంపం వస్తుందేమోనని స్థానికుల భయాందోళన చెందుతున్నారు. స్థానికుల భయాందోళనలతో పోలవరం ఇంజనీరింగ్‌ అధికారులు రోడ్లను పరిశీలిస్తున్నారు. అయితే రోడ్ల పగుళ్లకు వాతావరణ మార్పులే కారణమని అనుమానిస్తున్నారు.

పోలవరంపై కాగ్ కీలక నివేదిక

Submitted by arun on Wed, 09/19/2018 - 16:23

పోలవరం ప్రాజెక్ట్‌పై కాగ్ కీలక రిపోర్ట్ ఇచ్చింది. విపరీతమైన జాప్యం, మందకొడిగా పనులు జరుగుతున్నా కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్ పేర్కొంది. కేంద్ర జలవనరుల సంఘం డీపీఆర్‌ను ఆమోదించకముందే హెడ్‌వర్క్స్ పనులు అప్పగించారని తెలిపింది. ఒప్పందాలు రద్దయి ఖర్చు పెరగడంతో జాప్యం పెరిగిందని కాగ్‌ పేర్కొంది. 2005లో డీపీఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ విలువ 10 వేల 151 కోట్లు కాగా, 2010లో డీపీఆర్ ప్రకారం 16 వేల 010 కోట్లు, తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు రేటు 55 వేల 132 కోట్లకు చేరిందని కాగ్ నివేదికలో పేర్కొంది.
 

అందుకే నా మనుమడు దేవాన్షును తీసుకువచ్చా: చంద్రబాబు

Submitted by arun on Wed, 09/12/2018 - 16:07

పోలవరంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించన గ్యాలరీ వాక్ లో.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తాత అడుగుల్లో అడుగులు వేస్తూ.. గ్యాలరీ వాక్ లో హుషారుగా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో సందడి చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు.రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూడాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే.. ఒక అవగాహన వస్తుందని అన్నారు. అందుకే తన మనుమడు దేవాన్షును కూడా తీసుకువచ్చానని సీఎం చెప్పారు.

నేడు పోలవరానికి గడ్కరీ.. పర్యటనపై ఉత్కంఠ!

Submitted by arun on Wed, 07/11/2018 - 12:23

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  పోలవరం పర్యటన ఆసక్తిగా మారింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన తరువాత  తొలి సారి ఏపీలో పర్యటిస్తున్న గడ్కరి ఏయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రాజెక్టుపై మంత్రి సందేహాలు లేవనెత్తితే అక్కడికక్కడే నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.  

అందుకే కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పా: పురందేశ్వరి

Submitted by arun on Tue, 06/26/2018 - 13:22

భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని తాను పట్టుబట్టానని, రాష్ట్ర విభజన బిల్లులో ఆ విషయాన్ని కలపని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని బీజేపీ మహిళా నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

2019 నాటికి పోలవరం పూర్తిచేస్తాం: చంద్రబాబు

Submitted by arun on Mon, 06/11/2018 - 16:55

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రంవాల్‌ పూర్తయిన సందర్భంగా చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. పోలవరం నిర్మాణంలో డయాఫ్రంవాల్‌ పూర్తిచేయడం ఓ చరిత్ర అని.... పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరందుతుంది తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను అభినందించారు.

పోల‌వ‌రానికి రూ.1400కోట్లు మంజూరు

Submitted by lakshman on Wed, 03/21/2018 - 09:47

త‌మ‌పై నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న ఏపీ ప్ర‌జ‌ల్ని చ‌ల్లార్చేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన పోల‌వ‌రం ప్రాజెక్ట్ కు రూ. 1400కోట్లు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. 

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది : ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు

Submitted by arun on Sat, 02/10/2018 - 13:51

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకూ 4 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేశారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మోడీ ప్రభుత్వం తొలిభేటీలోనే 7 మండలాలపై నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఆ మండలాలకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిందని ఆయన చెప్పారు.

ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేస్తాం: వైసీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 12/22/2017 - 16:18

ఈ రోజు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పోల‌వ‌రం నిర్మాణం, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు ఏర్పాటుపై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. పోలవ‌రం నిర్మాణాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే చేప‌ట్టాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. అయితే, 2019 క‌ల్లా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తామ‌ని గ‌డ్క‌రీ చెప్పార‌ని అన్నారు. అలాగే, డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్‌ను ప్రైవేటీక‌రించ‌వ‌ద్ద‌ని గ‌డ్క‌రీని కోరామ‌ని తెలిపారు. రాజీనామా చేస్తే ప్ర‌త్యేక హోదా వ‌స్తుందంటే ఇప్ప‌టికిప్పుడు తాము రాజీనామా చేస్తామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అన్నారు.