YSRCP MPs

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం

Submitted by arun on Fri, 06/22/2018 - 10:35

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు  ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..? 

వైసీపీ ఫిరాయింపు ఎంపీలకు ఝలక్ .. వేటు వేసేందుకు సిద్ధమైన లోక్‌సభ స్పీకర్ ?

Submitted by arun on Wed, 06/06/2018 - 12:43

వైసీపీ నుంచి గెలిచి టీడీపీ, టీఆర్ఎస్‌లలోకి ఫిరాయించిన ఎంపీలపై చర్యలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్‌తో సమావేశమయిన వైసీపీ ఐదుగురు ఎంపీలు ఫిరాయింపుదార్ల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటానంటూ హామి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టారేణుక టీడీపీలో చేరగా .. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. స్పీకర్‌ నిర్ణయంతో ఈ నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

వైసీపీ ఎంపీల రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్

Submitted by arun on Wed, 06/06/2018 - 11:26

ఏపీలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇవాళ వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజున.. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ రాజీనామా లేఖలను.. స్పీకర్‌కు అందజేశారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై ఇవాళ స్పీకర్ సుమిత్రా మహాజన్  తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. 

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం

Submitted by arun on Tue, 05/29/2018 - 11:05

రాజీనామాల విషయంలో.. వైసీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. స్పీకర్ సుమిత్ర మహాజన్‌.. ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారా.. లేదా.. అన్నది నేడు సాయంత్రానికి తేలిపోతుంది. మరి.. వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌పై  ఒత్తిడి తెస్తారా.. సైలెంట్‌గానే ఉంటారా.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ ఎంపీల వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకొచ్చింది?

Submitted by arun on Wed, 05/23/2018 - 10:15

కర్ణాటక రాజకీయ పరిణామాల తో వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారం మరో మారు తెర పైకి వచ్చింది. ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎంపీల రాజీనామాలను వెంటనే ఆమోదించిన స్పీకర్... వైసీపీ ఎంపీల రాజీనామాలపై తాత్సారం చేస్తున్నారు. నెల రోజుల తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి  వైసీపీ ఎంపీలకు పిలుపు వచ్చింది. తమ రాజీనామాలపై వైసీపీ ఎంపీలు నిజంగానే సీరియస్ గా ఉన్నారా, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు అనే దానిపై స్పెషల్ స్టోరీ.  

క్షీణించిన వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

Submitted by arun on Mon, 04/09/2018 - 11:01

ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు డీహైడ్రేషన్ కు గురయ్యారంటూ తెలిపారు. తక్షణమే దీక్ష విరమించి వైద్యానికి సహరించాలంటూ కోరారు. ఇందుకు ఆయన అంగీకరించకపోవడంతో దీక్ష స్థలిని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు  బలవంతంగా వైవి సుబ్బారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. 

మేకపాటికి అస్వస్థత...ఆసుపత్రికి తరలింపు

Submitted by arun on Sat, 04/07/2018 - 16:02

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీలు ఆమరణ  నిరాహార దీక్ష రెండు రోజు కొనసాగుతోంది. రాజమోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, వరప్రసాద్‌రావులు దీక్షలు చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో వర్షం వచ్చినప్పటికీ వైసీపీ ఎంపీలు దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. దీక్షలో ఉన్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ, తలనొప్పితో బాధపడుతున్న మేకపాటి వేదిక నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డిని రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష

Submitted by arun on Fri, 04/06/2018 - 15:54

ప్రత్యేక హోదా పోరు ఉధృతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఐదుగురు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి ఏపీ భవన్‌ వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది. 

రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించిన వైసీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 04/06/2018 - 12:47

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. శుక్రవారం పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. కేంద్రం తీరు మారకపోతే తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరిరోజు మూకుమ్మడిగా రాజీనామానాలు చేస్తారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశం మేరకు ఈరోజు లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే ఎంపీలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు.

ఢిల్లీ వేదికగా జగన్ హోదా పోరాటం

Submitted by arun on Wed, 04/04/2018 - 16:51

ప్రత్యేకహోదా లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. సమస్యను  జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఒకవైపు సీఎం చంద్రబాబు హస్తిన బాట పట్టగా మరోవైపు వైసీపీ అధినేత తనదైన వ్యూహంతో ఢిల్లీ యుద్ధానికి సన్నద్ధమయ్యారు. తమ పోరాటంతో ఇటు రాష్ట్రంలోనే, అటు కేంద్రంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.