Salman Khan

సల్మాన్ ఖాన్ చెల్లికి వెయ్యి సార్లు ఫోన్ చేసిన ప్రియాంక...

Submitted by arun on Sat, 09/08/2018 - 15:58

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారత్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు.. కానీ ఆమె కొద్దీ రోజుల క్రితం ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీనికి కారణం ప్రియాంకకు తన ప్రియుడు నిక్ జోనాస్ తో పెళ్లి నిశ్చయం అవడం.  నిశ్చితార్ధం, పెళ్లి వెంటవెంటనే ఉండటంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు సల్మాన్ కు చెప్పారట. ఈ ప్రాజెక్టు లో  ప్రియాంక స్థానంలో  కత్రినా కైఫ్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ప్రియాంకను కథానాయికగా తీసుకోమని డైరెక్టర్ అబ్బాస్ కు చెప్పారట సల్మాన్, సల్మాన్ చెప్పడంతో ఒకే చెప్పేశాడట డైరెక్టర్.

‘మా ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగాను’: సల్మాన్‌ఖాన్

Submitted by arun on Mon, 07/23/2018 - 14:03

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అన్ని దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. ఒకప్పుడు సల్మాన్‌ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ జూహీచావ్లాను వివాహం చేసుకోవాలనుకున్నారట! ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా గురించి మాట్లాడిన సల్మాన్‌ పలు ఆసక్తిర విషయాలు వెల్లడించారు. ‘తను చాలా ఆత్మీయత కలిగిన వ్యక్తి. తన వ్యక్తిత్వం నాకెంతగానో నచ్చింది. అందుకే వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి జూహితో నా పెళ్లి జరిపిస్తారా అని అడిగాను.

సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ల నుంచి ముప్పు...హత్య చేసేందుకు పక్కా ప్లాన్

Submitted by arun on Mon, 06/11/2018 - 10:33

కృష‌్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై బిష్టోయ్ తెగ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందా ?  ఇందుకోసం సల్మాన్ ఖాన్ హత్యకు  గ్యాంగ్‌ స్టర్‌లు యత్నిస్తున్నారా ? పోలీసుల కన్నుగప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్లాన్ అమలు చేశారా ? గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారా ? అంటే అవుననే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్‌ను సంపత్ నెహ్రూను వలపన్ని పట్టుకున్న పోలీసులు .. విచారణలో ఈ విషయాలను నిర్ధారించారు. 
గ్రాఫిక్స్ ఆన్ వాయిస్ విత్ బ్రేకింగ్ మ్యూజిక్ 

సల్మాన్‌కు బెయిల్‌

Submitted by arun on Sat, 04/07/2018 - 15:36

కృష్ణ జింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.  నాటకీయ పరిణామాల నడుమ.. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్‌ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్‌ జైలు నుంచి హీరో విడుదలయ్యే అవకాశంఉంది.
 

ఈ రేయి మరచిపోలేనిది..

Submitted by arun on Sat, 04/07/2018 - 14:44

తొలిరాత్రి.. మలిరాత్రి.. ఇంకెన్ని రాత్రులొస్తాయో కానీ.. భయటకు రావాలన్న సల్మాన్ కోరిక మాత్రం తీరడం లేదు. గురువారం తన జీవితంలో తొలిసారి చెరసాలకు వెళ్లిన సల్లూ భాయ్.. శుక్రవారం రాత్రి కూడా ఆ నాలుగు గోడల మధ్యే గడిపాల్సి వచ్చింది. 

 బాలీవుడ్ బ్యాచిలర్.. సిల్వర్ స్క్రీన్ బాయిజాన్.. హీరోయిన్లతో డేటింగ్‌లు, యాక్షన్, ప్యాకప్ ల మాటలు.. ఇలాంటివే తప్ప ఇంకేమీ ఎరుగని సల్మాన్ లైఫ్.. కొత్త టర్న్ తీసుకుంది. చెరసాలే అన్నీ అయిపోయింది. ఊచల వెనుకే రెండు రోజుల జీవితం గడిచిపోయింది. జైలు గోడలే ప్రపంచం అయిపోయింది. 

సల్మాన్ బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

Submitted by arun on Sat, 04/07/2018 - 13:21

సల్మాన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై జోధ్‌పూర్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఇవాళ కూడా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషి.. తీర్పును రెండు గంటలకు వెలువరించనున్నారు. దీంతో సల్మాన్ కు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇటు సల్మాన్ కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరయ్యారు. 

ఇరకాటంలో సల్మాన్ బెయిల్ అంశం

Submitted by arun on Sat, 04/07/2018 - 11:20

సల్మాన్ ఖాన్ బెయిల్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సల్మాన్‌కు బెయిల్  ఇవ్వాలా వద్దా అన్నది తేలాల్సి ఉండగా.. జోధ్‌పూర్ కోర్టు న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషి.. ప్రమోషన్ పై హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. దీంతో రిజర్వ్‌లో ఉన్న బెయిల్ తీర్పు ఇప్పుడప్పుడే వెలువడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గతంలోనే రవీంద్రకుమార్ జోషికి ప్రమోషన్ రాగా.. గత రాత్రి ఆయన బదిలీ అయ్యారు. రాజస్థాన్‌లో మొత్తం 87 మంది జడ్జీలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఈ క్రమంలో రవీంద్రకుమార్ జోషీ కూడా బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో సల్మాన్ బెయిల్  అంశం ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడం లేదని చెబుతున్నారు.

ఇది తొలిరాత్రి

Submitted by arun on Fri, 04/06/2018 - 13:11

కోట్ల సంపద.. అనుభవించేందుకు అన్ని భోగాలు.. పంచ భక్ష పరమాన్నాలు.. రాజు తలుచుకుంటే దేనికి కొదువ. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్  జీవితం రాజభోగాల మయం. అలాంటి కండల ఖాన్.. కటకటాల పాలయ్యాక ఎలాంటి లైఫ్ ను అనుభవించాడు..? జైలు ఊచల వెనుక.. తొలిరాత్రి ఎలా గడిచింది..? 

సల్మాన్ బెయిల్ ఆశలకు బ్రేక్ వేసిన జోధ్‌పూర్‌ కోర్ట్

Submitted by arun on Fri, 04/06/2018 - 12:04

ఇవాళ విడుదలవుతాననుకున్న సల్మాన్ ఖాన్ ఆశలకు జోధ్‌పూర్‌ కోర్టు బ్రేక్ వేసింది. బెయిల్ పిటీషన్ పై తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో సల్మాన్  ఖాన్.. ఇవాళ కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ ఉదయం జోధ్‌పూర్‌ కోర్టులో ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. తీర్పును శనివారానికి వాయిదా వేశారు. 
 

ఒకే జైల్లో..ప్ర‌తి ఫ్రెండూ అవ‌స‌ర‌మేరా

Submitted by lakshman on Fri, 04/06/2018 - 09:09

కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలడంతో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్‌ సెంట్రల్‌కు తరలించారు. జైలులో సల్మాన్‌ఖాన్‌కు 106 నెంబర్‌ను కేటాయించారు. లైంగిక వేధింపులో కేసులో అరెస్టైన ఆశారాం బాపు ఉంటున్న గది పక్కనే సల్మాన్‌ఖాన్‌కు గదిని కేటాయించారు. సినీ నటుడుగా పేరు ప్రఖ్యాతలున్న సల్మాన్‌ఖాన్‌ను సాధారణ ఖైదీలుగానే జైలులో ట్రీట్ చేస్తామని జైల్ అధికారులు ప్రకటించారు.