Woman

బానిసగా మార్చిన భర్త: 21 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ నుంచి హైద్రాబాద్‌కు తిరిగొచ్చిన మహిళ

Submitted by arun on Fri, 03/02/2018 - 11:06

భారత విదేశాంగశాఖ చొరవతో 21ఏళ్ల తర్వాత ఓ మహిళా తల్లితండ్రుల చెంతకు చేరింది. ఒమన్ దేశస్దుడినంటూ నిఖా కుదుర్చుకున్న ఓ పాకిస్దాన్‌ దేశస్తుడు బానిసను చేసి చెరలో బందించాడు. ఎట్టకేలకు విషయం కుటుంబసభ్యులకు తెలియటంతో స్వదేశానికి రప్పించారు. ఇది హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మదీ బేగం అనుభవించిన నరకం.

బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ

Submitted by arun on Mon, 02/12/2018 - 10:34

రెండు వారాల క్రితం కొండాపూర్ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గోనె సంచుల్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మృతురాలి భర్త, అత్త, మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని  గుర్తించారు. ఆదివారమే సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సోమవారం నిందితులను కనుగొన్నారు. కొండాపూర్‌లోని ఒక బార్‌లో పనిచేసే అమర్‌కాంత్‌ ఝా, అతని తల్లి, మృతురాలి భర్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అమర్‌ కాంత్‌, అతని తల్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని పోలీసులు తెలిపారు.

ప్లీజ్‌... ఆ కిరాతకుడి నుంచి కాపాడండి!

Submitted by arun on Mon, 02/05/2018 - 10:22

భర్త తనను మానసికంగా,శారీరకంగా వేధిస్తున్నాడని, తనను భర్త బారి నుంచి కాపాడాలని ముంబై నగరానికి చెందిన ఓ మహిళ ట్విట్టర్ లో వీడియోలో పోలీసులను వేడుకుంది. ముంబై కమీషనరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో గొడవలు జరిగి అదే అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్‌లలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఓరోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్‌ప్రీత్‌, మరోసారి ఏకంగా ఆమెపై దాడికి యత్నించాడు.

కిలాడీ లేడీ..3 పెళ్లిళ్లు.. 6 సహజీవనాలు.. ఎన్నారైలే దీప్తి టార్గెట్!

Submitted by arun on Thu, 01/25/2018 - 16:05

విజయవాడలో కిలాడీ లేడీ దీప్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు బ్రాడీపేటలో నివాసముంటున్న దీప్తి మ్యాట్రీమోనీలో ఫేక్‌ ప్రొఫైల్స్‌తో ఎన్నారైలను మోసం చేస్తోంది. అందమైన అమ్మాయిల ఫొటోలతో ఎన్నారైలకు వలేస్తున్న దీప్తి లక్షల రూపాయలు వసూలుచేసి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతోంది. ఇదే తరహాలో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణికుమార్‌ను బురిడీ కొట్టించిన దీప్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షా 86వేల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత బెదిరింపులకు దిగడంతో మోసపోయానని గ్రహించిన ధరణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధరణి ఫిర్యాదుతో దీప్తిని అరెస్ట్‌‌చేసి రిమాండ్‌కి తరలించారు.

చంద్రబాబు ఇలాకాలో దారుణం.. మహిళను వివస్త్రను చేసిన ప్రత్యర్ధులు

Submitted by arun on Thu, 01/18/2018 - 11:49

తెలుగుదేశం నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల విశాఖలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి దారుణమే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ మద్దతుదారులు కీచకపర్వానికి దిగారు. మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా ప్రవర్తించారు.

బుల్లెట్ ట్రైన్ ఆపేసిన మ‌హిళ : ప‌తియే ప్ర‌త్య‌క్ష‌దైవం

Submitted by lakshman on Sun, 01/14/2018 - 16:22

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సంక్రాతి పండ‌క్కి ఊరెళ్లాలంటే ట్రైయిన్ ప్ర‌యాణం చేయాలి. అస‌లే పండ‌గ క‌దా సీట్లు దొర‌క‌డం క‌ష్టం. అందుకే మీరు ముందుగా వెళ్లి రైల్లో ఓ భోగిలో సీట్లు రిజ‌ర్వ్ చేశారు. కానీ అనుకోకుండా ట్రైన్ బ‌య‌లు దేరుతుంది. మీరైతే ఏం చేస్తారు. ట్రైన్ దిగి మ‌రో ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆ మ‌హిళ మాత్రం అలా కాదు. భ‌ర్త రాలేద‌ని ట్రైన్ బుల్లెట్ ట్రైన్ ఇంచు కూడా క‌ద‌ల‌కుండా ఆపేసింది. ఇదేం చోద్యం అని ప్ర‌శ్నిస్తే నా భ‌ర్త రావ‌డం ఆల‌స్యం అవుతుంది. అందుకే ట్రైన్ ఆపేశాన‌ని తీరిగ్గా చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన రైల్వే అధికారులు ఆమెను ట్రైన్ నుంచి భ‌య‌ట‌కు తోసేశారు.

నాలుగో ముడి వేసుకుంటున్నానంటూ భర్తకు లేఖ రాసి...

Submitted by arun on Sat, 01/13/2018 - 12:09

జీవితంపై విసుగు చెందిన ఓ మహిళ తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన మహిళ, ఆమె మూడేళ్ల కూతురు హైదరాబాదులోని దిండిగల్‌లో గల తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని.. తాము రాకుండానే మృతదేహాన్ని పోలీసులు తరలించడమేంటని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా, బొప్పాపూర్‌ మండలం, రాఘవపూర్‌ గ్రామానికి చెందిన రేణికుంట నర్సింహులు, చంద్రవ్వ కూతురు కవిత అలియాస్‌ సృజన(23) ఎంబీఏ చదువుకుంది. అదే మండలం బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన శంకర్‌తో ఫిబ్రవరి 5, 2014న పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు.

జ్యోతితో మాట్లాడితే రూ.5వేల జ‌రిమానా

Submitted by arun on Wed, 01/10/2018 - 18:03

తరాలు మారుతున్నా వివక్ష మాత్రం సమాజాన్ని వీడడం లేదు. కుల జాడ్యం వేళ్లూనుకుని ఉంది. తాజాగా నిర్మల్‌ జిల్లాలో కులం పేరుతో ఓ కుటుంబానికి అవమానం జరిగింది. స్థానిక కడం మండలం నవాబ్‌పేట్‌ గ్రామంలో బెస్త కులస్తులైన జ్యోతి-లచ్చన్న నివశిస్తున్నారు. అయితే లచ్చన్న ఉపాధి కోసం దుబాయ్‌కి వె‌ళ్లాడు. ఈ క్రమంలో జ్యోతి చెల్లెలు ఎస్‌సి కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల వనభోజనాలకు వెళితే బెస్త కులస్తులు జ్యోతిని అవమానించారు. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, సహాయం చేసినా 5వేల రూపాయల జరిమానా అని నిర్ణయించారు.

అబలలపై ఎన్నాళ్లీ అరాచకాలు?

Submitted by arun on Sat, 01/06/2018 - 13:31

జనారణ్యంలో మానవ మృగాలు విచ్చల విడిగా తిరుగుతున్నాయ్.. విశృంఖలంగా ప్రవర్తిస్తున్నాయ్. ఉద్యోగం కోసం,ఆర్థిక అవసరం కోసం బయటకొచ్చే అమాయక లేడి పిల్లలను వెంటాడి వేధిస్తున్నాయ్.. దొరకబుచ్చుకుని మాన,ప్రాణాలను హరిస్తున్నాయ్.. సభ్య సమాజంలో యధేచ్ఛగా తిరుగుతున్న  ఈ మేకవన్నె పులులను ఏంచేయాలి? ఎప్పటికప్పుడు ఆత్మరక్షణతో,ఎదురు దాడి చేస్తూ తప్పించుకు తిరగాల్సిన ఖర్మ ఆడపిల్లలకి ఎన్నాళ్లు? ఆడపిల్ల ఓర్పును, సహనాన్ని, మంచితనాన్ని.. అసహాయతగా తీసుకునే ఆటవిక మృగాలను ఏం చేయాలి?సమాజంలో పేరు, డబ్బు, పలుకుబడి.. నలుగురిలో గుర్తింపు.. పురుషాహంకారంతో విర్రవీగే కొందరికి ఇదే లైసెన్స్..ఇదే పెట్టుబడి..

మొబైల్‌ చూస్తూ కాలు పోగొట్టుకుంది!

Submitted by arun on Wed, 01/03/2018 - 15:58

స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ న‌డుస్తోన్న ఓ యువ‌తి ప్ర‌మాదానికి గురైన‌ ఘ‌ట‌న చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు కంపెనీలో ఆ యువ‌తి ప‌నిచేస్తోంది. త‌న ప‌ని ముగించుకున్నాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్‌ దగ్గరకు వచ్చింది. అంతలోనే స్మార్ట్‌ ఫోన్‌ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్‌ చూసుకుంటూనే... లిఫ్ట్‌లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్‌ వేగంగా కదిలింది. లిఫ్ట్‌ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే పచ్చడి అయిపోయింది.