Renuka Chowdhary

క్యాస్టింగ్‌ కౌచ్‌పై రేణుక సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 04/24/2018 - 16:40

గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన  రేణుకా చౌదరి చట్టసభల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందన్నారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.

సచిన్‌ పై రేణుకా చౌదరి ఫైర్‌

Submitted by arun on Fri, 12/22/2017 - 12:28

భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత రత్న పార్లమెంట్‌లో నీకు మాట్లాడటానికి లైసెన్స్‌ ఇచ్చిందా? అంటూ సచిన్‌ను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ నేత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పై అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన ప్రధాని క్షమాపణలు చెప్పేంత వరకు సభను సజావుగా సాగనివ్వమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు.   కాగా, రైట్‌ టూ ప్లే అండ్‌ ఫ్యూఛర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ అనే అంశంపై సచిన్‌ ప్రసంగించాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ సభ్యుల నిరసనలతో సభ నేటికి వాయిదా పడింది.