Sandhya Rani

చనిపోయిన తర్వాత దుష్ప్రచారం దారుణం

Submitted by arun on Wed, 12/27/2017 - 13:27

తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ‘నన్ను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని’ ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందని ఆమె వెల్లడించారు. చనిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానల్స్‌లో సంధ్యపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తిని రాంప్రసాద్‌, సంధ్యారాణి తల్లి సావిత్రి, సోదరుడు సాయికుమార్‌లతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రేమను కాదంటే చంపేస్తారా..?

Submitted by lakshman on Fri, 12/22/2017 - 21:37

చదువు, సంస్కారం.. స్వతంత్ర్య వ్యక్తిత్వం కలిగి ఉండటం నేరమా? తనకు ఇష్టం లేని విషయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడం పాపమా? ప్రేమను కాదంటే చంపేస్తారా? ప్రేమించలేనంటే ప్రాణం తీసేస్తారా? మూర్ఖులు, ఉన్మాదులు, పైలాపచ్చీస్ ఆవారా గాళ్ల నుంచి అమ్మాయిలకు రక్షణ లేదా? హైదరాబాద్ లాలాపేట దగ్గర ప్రేమోన్మాది దాడికి బలై ప్రాణం విడిచిన సంధ్య వేస్తున్న ప్రశ్నలివి..

కార్తీక్ ఓ అవారా

Submitted by lakshman on Fri, 12/22/2017 - 21:28

తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని పక్కా ప్లాన్ ప్రకారం చంపేశాడు. ఉన్మాదంతో రెచ్చిపోయి పెట్రోల్ పోసి నడిరోడ్డుమీద తగలబెట్టేశాడు. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదన్న కక్షతో వ్యవహరించాడు. ఎందుకంత కక్ష..? కాదంటే కనికరం లేకుండా చంపేస్తారా..? రాజధానిలో అమ్మాయిలకు రక్షణలేదా..? సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 

గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ పోలీసులు ఎక్కడా

Submitted by lakshman on Fri, 12/22/2017 - 19:51

రాజధానిలో నడిరోడ్డుపై ఓ యువతిని పెట్రోల్ పోసి తగలబెడుతుంటే.. అడ్డుకునేందుకు అక్కడ ఎవరూ లేరా..? ఆ కిరాతకుడిని ఎందుకు అడ్డుకోలేదు..? ఉన్నా ప్రేక్షక పాత్ర ఎందుకు వహించారు..? పోలీసులేం చేస్తున్నారు? ఇంత దారుణాన్ని ఎవరూ ప్రతిఘటించలేకపోవడం అందర్నీ కలచివేస్తోంది. 
 ప్రేమ వ్యవహారంలో సంధ్యారాణి అనే యువతిని రాజధానిలో నడిరోడ్డుపై ఉన్మాది తగలబెట్టేశాడు. ఆ తర్వాత దర్జాగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నడిరోడ్డుపై ఇంత ఘోరం జరుగుతుంటే అక్కడున్నవారు ఏం చేస్తున్నారు...? మనకెందుకులే అని ఎందుకు ఉండిపోయారు. ? 

నా కొడుక్కి ఏ శిక్ష వేసినా తప్పులేదు..

Submitted by arun on Fri, 12/22/2017 - 18:01

తన కొడుక్కి ఎలాంటి శిక్షవేసినా తప్పులేదని సంధ్య మృతికి కారకుడైన కార్తీక్‌ తల్లి ఊర్మిల తెలిపింది. శుక్రవారం ఆమె ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ... తన కొడుకు చేసిన తప్పు మరొకరు చేయొద్దని వేడుకున్నారు. సంధ్యతో కార్తీక్‌కు చాలా రోజులుగా పరిచయం ఉందని తెలిపారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని వెల్లడించారు. సంధ్యకు, నా కొడుక్కి.. కొన్నాళ్లుగా పరిచయం ఉంది. సంధ్య తరచూ మా ఇంటికి వచ్చేది.. కొన్నాళ్ల నుంచి నా కొడుక్కి సంధ్య దూరంగా ఉంటోంది. నా కొడుకు సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడు. నా కొడుకు సంధ్యపట్ల మూర్ఖంగా వ్యవహరించాడు. ఓ అమ్మాయి ఉసురు తీశాడు.

మీడియా ముందుకు నిందితుడు కార్తీక్‌...

Submitted by arun on Fri, 12/22/2017 - 13:48

సంధ్యారాణి హంతకుడు కార్తీక్‌ను విచారించిన పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. కార్తీక్ ఒక్కడే నేరం చేశాడనీ సంధ్యను వెంటాడి దాడి చేశాడని డీసీపీ సుమతి వివరించారు. ప్రేమను తిరస్కరించడం వల్లే కక్ష పంచుకుని పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పారు. కార్తీక్‌పై 307, 354, 354d సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా పెట్టామని సుమతి చెప్పారు. సంధ్య హత్య కేసులో అన్ని ఆధారాలు సేకరించామనీ దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని అన్నారు. 

సంధ్య తన కొలీగ్‌తో క్లోజ్‌గా ఉండడం నచ్చలేదు : కార్తీక్

Submitted by arun on Fri, 12/22/2017 - 11:03

ఇక సంధ్య చావుకు కారణమైన కార్తీక్‌‌పై పోలీసులు 307, 354 D సెక్షన్ల కింద కేసు పెట్టారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. పోలీసుల విచారణలో కార్తీక్ పలు విషయాలు చెప్పాడు. తనది వన్ సైడ్ లవ్వేనని ఒప్పుకున్నాడు. మూడేళ్ళుగా సంధ్యతో పరిచయం ఉందన్న కార్తీక్..ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించానని తెలిపాడు. అయితే తన ప్రేమను సంధ్య అంగీకరించలేదని వివరించాడు. ఇటీవల సంధ్యారాణికి ఫోన్ చేస్తే సంధ్య కొలీగ్ మాట్లాడాడనీ..ఆమె జోలికి రావొద్దని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. సంధ్య తన కొలీగ్‌తో క్లోజ్ ఉండడం సహించలేకపోయాననీ పైగా తనను దూరం పెట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని అంగీకరించాడు.