hyderabad police

ఛాలెంజ్‌ పేరుతో రోడ్లపై డ్యాన్స్‌ చేస్తే జైలుకే...

Submitted by arun on Thu, 08/02/2018 - 11:13

కికీ ఛాలెంజ్‌. ప్రపంచ వ్యాప్తంగా ఇదో కొత్త ట్రెండ్‌. మన మెట్రో సిటీస్‌ యూత్‌‌నీ కికీ ఛాలెంజ్‌ ఊపేస్తోంది. ఈ డ్యాన్స్‌ ఫీవర్‌ బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకింది. కదులుతున్న కారులోంచి అకస్మాత్తుగా దిగేసి కారుతోపాటే రోడ్డు మీద వెళ్తూ ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ సాంగ్‌‌కు స్టెప్పులేయడం అలా డ్యాన్స్‌ చేస్తూ మళ్లీ అదే కారులో ఎక్కేయడం. ఇదే ప్రపంచాన్ని ఊపేస్తున్న కికీ డ్యాన్స్‌ ఛాలెంజ్‌.  ‘కికీ డాన్స్‌ చాలెంజ్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతున్న తాజా ట్రెండ్‌ ఇది. షిగ్గీ అనే కమెడియన్‌ ఈ ట్రెండ్‌కు ఆద్యుడు.

రాచకొండ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ చెడ్డీ గ్యాంగ్ సభ‌్యులు

Submitted by arun on Wed, 08/01/2018 - 13:56

ఆరు రాష్ట్రాల పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని దావోడ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 18న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించారు.  

మతిస్థిమితం లేని వ్యక్తిపై పోలీసుల అరాచకం...ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Submitted by arun on Tue, 06/05/2018 - 19:13

సోషల్‌ మీడియా వదంతులు ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటున్న పోలీసులు... మతిస్థిమితం లేని వ్యక్తి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించారు. అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతున్న ఈ వ్యక్తిని పిల్లల్ని కిడ్నాప్‌ చేసే వ్యక్తిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అతని చేతులు కాళ్ళు కట్టేసి... ఓ అటవీ ప్రాంతంలో పడేసి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కే మాయని మచ్చ తెచ్చారు రాచకొండ పోలీసులు. దీనిపై విచారణ చేపట్టిన సీపీ బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాదు.. మానవ హక్కుల కమిషన్ కూడా ఈ  కేసును సుమోటుగా స్వీకరించి విచారణ జరుపుతోంది.

సినీనటుడు సామ్రాట్‌పై వరకట్న వేధింపులు

Submitted by arun on Tue, 01/30/2018 - 12:13

సినీనటుడు సామ్రాట్‌రెడ్డిపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్లో వరకట్న వేధింపులు, చోరీ కేసు నమోదైంది. గత కొంతకాలంగా సామ్రాట్‌రెడ్డి, ఆయన భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో తాను ఇంట్లో లేనప్పుడు సీసీ కెమెరాను ధ్వంసం చేసి బంగారం తీసుకుపోయినట్టు సామ్రాట్ భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్రాట్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామ్రాట్‌, హర్షితలకు రెండేళ్ల కిందట పెళ్లైంది. కలహాల కారణంగా వారిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు. గతంలో సామ్రాట్‌పై రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 498/ఏ చట్టం కింద కేసు నమోదయింది.

పూటుగా మ‌ద్యం సేవించి డ్రంకన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన‌ యాంక‌ర్ ప్ర‌దీప్

Submitted by arun on Mon, 01/01/2018 - 10:58

తెలుగురాష్ట్రాల్లో న్యూఇయ‌ర్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.  అయితే హైద‌రాబాద్ లో కొత్త‌సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ తనిఖీల్లో ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టుడు ప్ర‌దీప్ డ్రంకన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన‌ట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో రాత్రి 3 గంటల సమయంలో పూటుగా తాగిన ప్ర‌దీప్ కారున‌డుపుకుంటూ వ‌స్తుండ‌గా ట్రాఫిక్ పోలీసులు అడ్డ‌గించి  బ్రీత్ ఎన‌లైజ‌ర్ చెక్ చేశారు. అయితే ఈ టెస్ట్ లో ప్ర‌దీప్ కు 178పాయింట్లు వ‌చ్చాయి. దీంతో  ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు.

పిట్ట‌క‌థతో డబ్బు దండుకుంటున్న రైస్ పుల్లింగ్ గ్యాంగ్

Submitted by lakshman on Thu, 12/21/2017 - 22:12

రైస్ పుల్లింగ్... అస‌లు అదేంటో తెలియాని వారిని సైతం మాట‌ల్లోపెట్టి నిండా ముంచుతున్నారు మాయాగాళ్లు. డ‌బ్బుపై ఆశ‌ప‌డుతున్న వారినే టార్గెట్ గా చేసుకుని మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఓ రాగి చెంబు, పాతిక బియ్యం. ఇవి ఉంటే చాలు. ఓ పిట్ట‌క‌థ అల్లి చివ‌రికి నిండా ముంచి డ‌బ్బును దండుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా అమాయక ప్రజలను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముటాకు చెక్ పెట్టారు హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు.