karimnagar

తండ్రి కొడుకుల దారుణ హత్య

Submitted by arun on Tue, 06/12/2018 - 12:31

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ పరిధిలోని కృష్ణారావుపల్లెలో భూవివాదం కారణంగా తండ్రీ,కొడుకులను ప్రత్యర్థులు నరికి చంపారు. గ్రామానికి చెందిన సవనపల్లి యెల్లయ్య అన్న 15ఏళ్ల క్రితం తన వ్యవసాయ భూమిని దేవయ్య, స్వామిలకు విక్రయించాడు. యెల్లయ్య అన్న మరణించిన తర్వాత నుంచి యెల్లయ్య  ఆ భూమి తనదేనంటూ దేవయ్య, స్వామిలతో గొడవ పడుతుండేవాడు.

Tags

మంత్రులను వెంటాడిన తేనెటీగలు

Submitted by arun on Thu, 06/07/2018 - 15:15

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి.

గతంలో తెలంగాణలోనూ తేనెటీగల దాడికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ కూడా పరుగులు పెట్టారు. కరీంనగర్‌లో జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు నాశనమైన పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేటీఆర్, ఈటల స్థానిక నేతలతో పంట పొలాలకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా దాడి చేసిన తేనెటీగలు అందరినీ పరుగులు తీయించాయి. 

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Submitted by arun on Tue, 05/29/2018 - 10:33

కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారి నెత్తురోడింది.  మానకొండూరు మండలం చెంజర్ల  దగ్గర  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు  వరంగల్ నుంచి కరీంనగర్ వస్తుండగా  లారీ- బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణీకులతో పాటు లారీ డ్రైవర్‌ మృతి చెందగా 15 మంది  గాయపడ్డారు. బస్సును ఓవర్ టేక్ చేయబోయిన లారీ అదుపుతప్పి  బస్సును ఢీ కొట్టడంతో  ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు కుడి భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. బస్సులో  చిక్కుకున్న ప్రయాణీకులను చుట్టుపక్కల వారు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన కొడుకు

Submitted by arun on Sat, 02/24/2018 - 14:48

మద్యం మత్తులో విచక్షణారహితంగా తనను కొడుతున్నాడంటూ ఓ కుమారుడు తన తండ్రిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..  జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన మొలుగూరు శ్రీనివాస్‌ తాగుడుకు బానిసగా మారాడు. మేస్త్రీ పని చేస్తూ చేతికి వచ్చిన డబ్బులతో తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, కుమారుడిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం శ్రీనివాస్‌ భార్య రమ్య, పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో కూలి పని చేసేందుకు వెళ్లింది.

మా ప్రేమ‌ను బ్ర‌తికించండి

Submitted by arun on Wed, 01/24/2018 - 12:35

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి కాపురం చేయాలనుకున్నారు. ఇంట్లో వారిని ఒప్పించి ఒకటవ్వాలనుకొని తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో గుట్టుగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. దీన్ని పరువు తక్కువగా భావించిన పిల్ల తరఫువాళ్లు తాము మారినట్టు మాయమాటలు చెప్పి రప్పించారు. అబ్బాయిని నడిరోడ్డు మీద చితకబాది అమ్మాయిని దాచేశారు. చావుదెబ్బలు తిన్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన భార్యను తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటున్నాడు.

ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్

Submitted by arun on Sat, 01/13/2018 - 11:12

అధికార పార్టీ కారు స్పీడ్ కు బ్రేక్ పడింది. ఉద్యమానికి ఊపిరిపోసిన జిల్లాలో కారు బోల్తా పడింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. గంగాధర ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, అసన్ పల్లిలో ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ జయ కేతనం ఎగురవేసింది. ఈ రెండు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ భారీ మెజార్టీతో  గెలిచాయి. అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి. 


 

విషాదం..ఆడుకుంటున్న చిన్నారులకు అంటుకున్న నిప్పు

Submitted by arun on Thu, 12/28/2017 - 13:48

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. చొప్పదండి మండలం వెదురుగుట్టలో పొరపాటున ముగ్గురు చిన్నారులకు నిప్పు అంటుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఐదేళ్ల చిన్నారులు అగ్గిపెట్టేతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ నిప్పు రవ్వలు పక్కనున్న కిరోసిన్‌పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో చిన్నారులు భయంతో అరుపులు కేకలు వేశారు.

వాట్సాప్‌ తలాక్‌

Submitted by lakshman on Thu, 12/21/2017 - 21:08

 కరీంనగర్‌లో ఓ ముస్లిం మహిళకు భర్త వాట్సాప్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. మరో మహిళలను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాధిత మహిళ... అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. కోర్టు తీర్పును కూడా లెక్కచెయ్యడం లేదంటూ మహిళ ఆవేదన చెందుతుంది. అయితే ఇస్లాం నిబంధనల ప్రకారమే తలాక్‌ చెప్పానని, డబ్బుల కోసమే ఆమె ఇలా డ్రామా చేస్తుందంటూ భర్త ఆరోపిస్తున్నాడు.