Birthday Wishes

నన్ను ఎమ్మెల్యేగా గుర్తించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు: కోమటిరెడ్డి

Submitted by arun on Wed, 05/23/2018 - 14:25

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోమటిరెడ్డికి సీఎం లేఖ పంపారు. ‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’. అని లేఖలో పేర్కొన్నారు. లేఖపై స్పందించిన కోమటిరెడ్డి వెంటకట్‌రెడ్డి తనకు శభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

జగన్‌ బర్త్‌ డే సందర్భంగా చంద్రబాబు విషెస్‌

Submitted by arun on Thu, 12/21/2017 - 17:14

వాళ్లిద్దరూ విభిన్న ధృవాలు. అజాత శత్రులు. ఎనీ టైమ్‌, ఎనీ ప్లేస్‌ కయ్యానికి కాలుదువ్వుతారు. సై అంటే సై అంటారు. అలాంటి వాళ్లిద్దరిలో ఈరోజు ఒకరిది బర్త్‌ డే. మరి ప్రత్యర్థి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తాడా అంటే ట్విట్టర్‌ వేదికగా చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వదించారు. మే గాడ్‌ బ్లెస్‌ యూ, విత్‌ ఏ హ్యాపీ అండ్‌ హెల్తీ లైఫ్‌ అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. గత ఏడాది కూడా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సీటు వద్దకు వెళ్లి కరచాలనం చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.