CM Chandrababu

రూట్‌ మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు...8 నెలల ముందుగానే అభ్యర్ధుల ప్రకటన

Submitted by arun on Sat, 09/22/2018 - 10:00

టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్‌ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి 8నెలల ముందుగానే బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జు‌లుగా నియమిస్తున్నారు. టీడీపీ సంప్రదాయాన్ని పక్కనబెట్టి వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్ధులను ప్రకటించే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. 

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై చంద్రబాబు కీలకనిర్ణయం

Submitted by arun on Wed, 09/19/2018 - 14:17

బాబ్లీ ఆందోళన విష‍యంలో ఏపీ సీఎంకు జారీ అయిన నాన్‌బెయిలబుల్ నోటీస్ వ్యవహారంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన తరపున న్యాయవాదిని పంపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్ ఆధారంగా నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని బాబు తరపు న్యాయవాది కోరునున్నారు. ఈ నెల 21న ఈ కేసు విచారణకు రానుంది.  ఇదే విషయంపై నిన్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో నాందేడ్‌ ఎస్పీ ఫోన్‌‌లో సంభాషించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ ఉందని లేఖ పంపుతున్నామని, లేఖతో పాటు వారెంట్ కూడా పంపుతున్నామని నాందేడ్‌ ఎస్పీ సమాచారం అందించారు.

సీఐ వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Submitted by arun on Wed, 09/19/2018 - 13:42

చిత్తూరు జిల్లా వాయల్పాడులో సీఐ వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న చంద్రబాబు సీఐ సిద్ధ తేజమూర్తిపై తక్షణమే క్రినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాకాపరమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టాలన్న సీఎం.. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 
 

ధర్మాబాద్ కోర్టుకు హాజరవడంపై చంద్రబాబు మంతనాలు..

Submitted by arun on Tue, 09/18/2018 - 09:48

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ వ్యవహారంలో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై అధికారులు, కీలక నేతలతో చర్చలు సాగిస్తున్నారు. నేడు మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ప్రణయ్ హత్య ఘటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 09/17/2018 - 17:56

ప్రణయ్ దారుణ హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రణయ్ పరువు హత్యను అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు కులం అనే అహంతో ప్రియుడ్ని కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ హత్య ఘటన దారుణమన్న ముఖ్యమంత్రి సమాజంలో కులాంతర వివాహాలు పెరగాలని అన్నారు. నచ్చినవాడిని చేసుకుంటే తల్లిదండ్రులు ఆశీర్వదించాలి కానీ చంపడం దుర్మార్గమన్నారు. కులంతార వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాము 'పెళ్లికానుక'ను ప్రారంభించామని బాబు చెప్పారు. 

మరో బాంబు పేల్చిన శివాజీ

Submitted by arun on Fri, 09/14/2018 - 17:34

హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు త్వరలో మరో రెండు నోటీసులు రానున్నాయి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని సినీ హీరో శివాజీ 6 రోజుల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.

ఏపీ సీఎం తిరుపతి పర్యటనలో అపశృతి

Submitted by arun on Fri, 09/14/2018 - 10:59

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఏర్పేడు ఎస్‌ఐ వెంకట  రమణ గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోవడంతో సహచరులు హుటాహుటిన నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించడంతో  తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

వసంత నాగేశ్వర్ రావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

Submitted by arun on Mon, 09/10/2018 - 14:08

వైసీపీ నాయకుడు వసంత నాగేశ్వర్ రావు ఫోన్ చేసి గుంటుపల్లి పంచాయితీ కార్యదర్శిని బెదిరించిన వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రి దేవినేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రినే హత్య చేస్తాం అనే ధోరణిలో వసంత నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇలాంటి బెదిరింపులను సహించేది లేదని తేల్చిచెప్పారు. బెదిరింపులు, హత్యాయత్నాలు, హత్యల ద్వారా ఏమీ సాధించలేరని అన్నారు. ఫోన్ కాల్ బెదిరింపు వ్యవహారంలో వసంత నాగేశ్వర రావుపై పోలీసు కేసు నమోదైందని టీడీపీ నేతలు చంద్రబాబుకు దృష్టికి తీసుకువచ్చారు.

చంద్రబాబు మండిపాటుపై అధికార పార్టీ ఎమ్మెల్యేల‌లో టెన్ష‌న్

Submitted by arun on Sat, 09/08/2018 - 10:19

అసెంబ్లీ స‌మావేశాల‌పై స్పెష‌ల్ పోక‌స్ పెట్టారు ఏపి సీఎం చంద్ర‌బాబు. ప్ర‌తిప‌క్షం రాక‌పోయినా సొంత పార్టీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి వ‌స్తున్నారా లేదా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే, రోజూ అసెంబ్లీకి హాజరుకావాలనే చంద్రబాబు ఆదేశాలను ఎమ్మెల్యేలు సీరియస్ గా పట్టించుకోవడంలేదు. టీడీపీ  ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. 

కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి

Submitted by arun on Wed, 09/05/2018 - 11:28

విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే  పాముల పుష‌్ప శ్రీవాణి కన్నీరు పెట్టుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజన విద్యార్ధినులకు అందుతున్న వైద్యాన్ని తలుచుకుంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.  కొత్తవలస ఆశ్రమ పాఠశాలలో విషజ్వరాలకు గురైన విద్యార్ధినులకు అందిస్తున్న వైద్యసాయంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు. బాబు గారి 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.