CM Chandrababu

టీ టీడీపీ నేతలతో ముగిసిన చంద్రబాబు భేటి ..

Submitted by arun on Mon, 10/22/2018 - 12:50

మహాకూటమి పొత్తులపై సీఎం చంద్రబాబు  టీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పోటీ చేసే స్ధానాలు, అభ్యర్ధుల ఎంపికపై పోలీట్ బ్యూరోలో సుమారు గంట పాటు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుత సమయంలో సీట్ల కంటే టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పని చేయాలంటూ సూచించారు. సీట్ల సర్ధుబాటు, పొత్తులపై కాంగ్రెస్ నేతలు తనతో చర్చించారన్న చంద్రబాబు 12 స్ధానాలు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలిపారు. అయితే తమకు బలమున్న స్ధానాల్లో పోటీ చేసేలా అవకాశమివ్వాలని తాను కోరినట్టు నేతలకు వివరించారు. 

ధర్మాబాద్‌ కోర్టులో చంద్రబాబుకు ఊరట

Submitted by arun on Fri, 10/12/2018 - 13:56

ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. బాబ్లీ కేసులో చంద్రబాబుకు జారీ చేసిన.. నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. బాబ్లీపై పోరాటం కేసులో సీఎం చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు వేసిన రీకాల్‌ పిటిషన్‌‌పై కోర్టులో నేడు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూత్రా, సుబ్బారావు వాదనలు వినిపించారు. తమ క్లయింట్ సీఎం కావడంతో వ్యక్తిగత హాజరు సాధ్యం కాదని, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయలేదని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్లాలా..? వద్దా..?

Submitted by arun on Sat, 10/06/2018 - 10:12

బాబ్లీ కేసు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు నలుగురు సీనియర్ మంత్రులతో పాటు అడ్వకేట్ జనరల్ తో సమావేశంకానున్నారు. ఈ కేసు విషయంలో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకావాలా లేదా అనే అంశంపై చర్చించనున్నారు. ఒకవేళ వారెంట్ రీకాల్ చేయకపోతే ఏమి చేయాలి సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల15న కోర్టుకు హాజరుకావాలని సీఎం సహా మరో 14 మందిని ధర్మాబాద్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభం

Submitted by arun on Tue, 10/02/2018 - 11:37

రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా భృతి కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలులోకి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తు యువత తరలివచ్చింది. ఈ సందర్భంగా యువతతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
 

రూట్‌ మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు...8 నెలల ముందుగానే అభ్యర్ధుల ప్రకటన

Submitted by arun on Sat, 09/22/2018 - 10:00

టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్‌ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి 8నెలల ముందుగానే బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జు‌లుగా నియమిస్తున్నారు. టీడీపీ సంప్రదాయాన్ని పక్కనబెట్టి వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్ధులను ప్రకటించే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. 

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై చంద్రబాబు కీలకనిర్ణయం

Submitted by arun on Wed, 09/19/2018 - 14:17

బాబ్లీ ఆందోళన విష‍యంలో ఏపీ సీఎంకు జారీ అయిన నాన్‌బెయిలబుల్ నోటీస్ వ్యవహారంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన తరపున న్యాయవాదిని పంపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్ ఆధారంగా నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని బాబు తరపు న్యాయవాది కోరునున్నారు. ఈ నెల 21న ఈ కేసు విచారణకు రానుంది.  ఇదే విషయంపై నిన్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో నాందేడ్‌ ఎస్పీ ఫోన్‌‌లో సంభాషించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ ఉందని లేఖ పంపుతున్నామని, లేఖతో పాటు వారెంట్ కూడా పంపుతున్నామని నాందేడ్‌ ఎస్పీ సమాచారం అందించారు.

సీఐ వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Submitted by arun on Wed, 09/19/2018 - 13:42

చిత్తూరు జిల్లా వాయల్పాడులో సీఐ వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న చంద్రబాబు సీఐ సిద్ధ తేజమూర్తిపై తక్షణమే క్రినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాకాపరమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టాలన్న సీఎం.. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 
 

ధర్మాబాద్ కోర్టుకు హాజరవడంపై చంద్రబాబు మంతనాలు..

Submitted by arun on Tue, 09/18/2018 - 09:48

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ వ్యవహారంలో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై అధికారులు, కీలక నేతలతో చర్చలు సాగిస్తున్నారు. నేడు మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ప్రణయ్ హత్య ఘటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 09/17/2018 - 17:56

ప్రణయ్ దారుణ హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రణయ్ పరువు హత్యను అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు కులం అనే అహంతో ప్రియుడ్ని కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ హత్య ఘటన దారుణమన్న ముఖ్యమంత్రి సమాజంలో కులాంతర వివాహాలు పెరగాలని అన్నారు. నచ్చినవాడిని చేసుకుంటే తల్లిదండ్రులు ఆశీర్వదించాలి కానీ చంపడం దుర్మార్గమన్నారు. కులంతార వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాము 'పెళ్లికానుక'ను ప్రారంభించామని బాబు చెప్పారు. 

మరో బాంబు పేల్చిన శివాజీ

Submitted by arun on Fri, 09/14/2018 - 17:34

హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు త్వరలో మరో రెండు నోటీసులు రానున్నాయి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని సినీ హీరో శివాజీ 6 రోజుల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.