man

మద్యం మత్తులో ఓ యువకుడు...బతికున్న కోడినే...

Submitted by arun on Wed, 08/01/2018 - 17:38

మద్యం మత్తులో ఓ యువకుడు జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం ఆర్వోబీ రోడ్డులో మంగళవారం జరిగింది. ఇద్దరు యువకులు సమీపంలోని కోళ్ల దుకాణంలో కోడిని కొనుగోలు చేయగా, మద్యం అతిగా సేవించడంతో ఆర్వోబీకి వెళ్లే రోడ్డు పక్క ఓ యువకుడు కిందపడిపోయాడు. మరో యువకుడు చేతిలో ఉన్న కోడిని అలాగే పీక్కుతిన్నాడు. దీన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్‌గా మారింది.
 

Tags

అత్తింటి ఆగడాలకు మగాడి బలి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:53

భార్యతో కలిసి అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాలలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. 

వరునికి దండ వేసేందుకు వధువును పైకి ఎత్తిన బంధువు...లాగి పీకిన వధువు

Submitted by arun on Tue, 07/03/2018 - 13:27

ఎవరైనా చెంప దెబ్బకొడితే, ఎంత అవమానంగా ఉంటుంది? అది కూడా ఓ పెళ్లి మండపంలో నలుగురి ముందూ వధువు కొడితే... అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా? ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, నిన్న సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది.. ముహూర్తం దగ్గర పడే సమయంలో వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం వరుడిని, వధువుని వారి బంధువులు ఎత్తుకుని దండలు మార్పించాలి.. దీనిలో భాగంగా వరుడి తరపు బంధువు అతన్ని ఎత్తుకుని వధువు మెడలో దండ వేయించాడు.. ఇప్పుడు వధువు వంతు వచ్చింది.

Tags

బతికుండానే మార్చురీకి పేషెంట్‌

Submitted by arun on Tue, 01/09/2018 - 11:44

ప్రాణాలతో ఉండగానే ఓ యువకుడిని దాదాపు 7 గంటలపాటు మార్చురీలో పడేసిన దారుణ సంఘటన కర్ణాటక హుబ్బళ్లి కిమ్స్‌ ఆసుపత్రిలో చేటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో ఉన్న యువకుడు చనిపోయాడని అనుకున్న హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం గదికి తరలించారు. 7 గంటల తరువాత పోస్టుమార్టం చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో యువకుడు ప్రాణాలతో ఉన్న విషయం బయట పడింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో 20 నిమిషాల్లో యువకుడు మరణించాడు. హుబ్బళిలోని ఆనంద నగర్ లో ప్రవీణ్ మూళే (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

రైలు వస్తుండగానే దూకేసిన యువకుడు

Submitted by arun on Thu, 12/21/2017 - 16:58

లండన్ లో ఓ యువకుడు చేసిన సాహస విన్యాసం చూస్తే ఎవరికైనా ఒల్లు జువ్వు మనక మానదు ఈస్ట్ లండన్ లోని ష్టాపోడ్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేసన్ లో ఓ రైలు వేగంగా స్టేషన్ దాటుకొని వెళ్తున్న సమయంలో ఓ యువకుడు రైలును దాటుకుంటూ ఓ ప్లాట్ ఫామ్ మీద నుంచి మరో ప్లాట్ ఫామ్ పైకి దూకాడు  యువకుడి విన్యాసం చూసిన వారందరూ సూసైడ్ చేసుకుంటున్నారని అనుకున్నారు చచ్చిపోయి ఉంటాడని భావించారు అయితే కేవలం సరదా కోసమే అతడు ఇంతటి సాహసానికి పూనుకున్నట్లు తెలియడంతో అందరూ షాక్ కి గురయ్యారు అందరినీ టెన్షన్ పెట్టిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.