speech

లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రేక్షకపాత్ర

Submitted by arun on Wed, 02/07/2018 - 12:53

లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వారి సీట్లలో సైలెంట్‌గా కూర్చొన్నారు. అంతకు ముందు ప్లకార్డులతో హడావిడి చేసిన ఎంపీలు తమ స్ట్రాటజీ ప్రకారం మౌనం వహించారు. దీంతో ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్, వైసీపీ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గందరగోళం మధ్యే మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. 

బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ

Submitted by arun on Thu, 02/01/2018 - 11:18

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో 2018-19 బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ ప్రసంగానికి ఉద్యుక్తులయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఎంపీ చింతామణి మంగ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం స్పీకర్‌ అనుమతితో జైట్లీ సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి తొలిసారి హిందీలో బడ్జెట్‌ విషయాలను ప్రసంగిస్తుండటం విశేషం. వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇది.

కలెక్టర్ ఆమ్రపాలి ‘నవ్వుల ప్రసంగం’పై సర్కార్ సీరియస్

Submitted by arun on Mon, 01/29/2018 - 18:32

గణతంత్ర వేడుకల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్పీ సింగ్‌  సీరియస్ అయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆమ్రపాలి తెలుగులో ప్రసంగిస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ, వెనక్కి తిరిగి చూసుకోవడంతో నలుగురిలో నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్ వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.

వివాదాస్పదమైన కలెక్టర్ ఆమ్రపాలి ప్రసంగం

Submitted by arun on Sat, 01/27/2018 - 10:32

ఆమె ఒక ఐఏఎస్‌ అధికారి.. సాక్షాత్తు జిల్లా పరిపాలనాధికారి. గణతంత్ర వేడుకల్లో జెండా వందనం చేశాక ఆమె చేసే ప్రసంగం జిల్లా అభివృద్ధి ప్రణాళికకు అద్దం పట్టాలి.. ఇంతవరకు సాధించిన ప్రగతి గణాంకాల పట్టం కట్టాలి. ఇదంతా ఎంతో హుందాగా.. అందంగా సాగాల్సిన కార్యక్రమం. కాని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి గణతంత్ర వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగం మాత్రం అలా కాకుండా ‘నవ్వులపాలైంది’.. జిల్లాల్లో చర్చనీయాంశమైంది.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కారణం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా నవ్వడం...గణాంకాల దగ్గర తడబడటం... మధ్యలో ఇట్స్‌ఫన్నీ అని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.

రాజ్యసభ ప్రసంగంలో విఫలమైన సచిన్‌

Submitted by arun on Thu, 12/21/2017 - 16:39

క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్ తొలిసారి పార్లమెంటులో ప్రసంగించాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్‌లను ముడిపెడుతూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య  క్రీడల అంశంపై మాట్లాడేందుకు సచిన్ సభలో లేచి నిలుచున్నారు. కానీ ఆందోళనలు మిన్నంటాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. భారీగా అరుపులు, కేకలు వినిపించారు. సభ గందరగోళంగా మారింది. సచిన్ టెండూల్కర్ క్రీడల అంశంపై మాట్లాడలేకపోయారు. దీంతో తన అరంగేట్ర ప్రసంగంలో సచిన్ రాజ్యసభలో విఫలమయ్యారు.